Saturday, November 15, 2025
Homeటెక్నాలజీAmazon Festival Sale: అమెజాన్‌ ఫెస్టివల్‌ సేల్‌కు ఇవాళే లాస్ట్.. వీటిని మిస్‌ చేసుకుంటే మళ్లీ...

Amazon Festival Sale: అమెజాన్‌ ఫెస్టివల్‌ సేల్‌కు ఇవాళే లాస్ట్.. వీటిని మిస్‌ చేసుకుంటే మళ్లీ కొనలేరు మావా..!

Last day for Amazon Great Indian Festival Sale Grab the offers Today: దీపావళి పండుగ సందర్భంగా అమెజాన్‌లో కొనసాగుతున్న గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ మరికొద్ది గంటల్లోనే ముగియనుంది. దసరా సందర్భంగా సెప్టెంబర్‌ 23న ప్రారంభమైన ఈ ఫెస్టివల్‌ సేల్‌ దీపావళి పండుగలోనూ కొనసాగింది. ఈ ఏడాది అతిపెద్ద సేల్‌గా అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌లు ఈ సేల్‌ను ముందుకు తీసుకొచ్చాయి. ఈ సేల్‌లో వివిధ ఎలక్ట్రానిక్‌, గృహోపకరణాలపై భారీ డిస్కౌంట్లు, బ్యాంక్‌ ఆఫర్లు అందించాయి. ఈ సేల్ స్మార్ట్‌ఫోన్ల నుండి స్మార్ట్ టీవీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, ఇతర గృహోపకరణాల వరకు ప్రతిదానిపై ఆకర్షణీయమైన డిస్కౌంట్లను అందిస్తుంది. మీరు ఇంకా, ఈ సేల్‌లో కొనుగోలు చేయనట్లైతే.. త్వరపడండి.. వెంటనే మీకు నచ్చిన ప్రోడక్ట్‌ను ఆర్డర్‌ చేసుకోండి. ఎందుకంటే, ఈ ఏడాది మీకు ఇదే చివరి అవకాశం. ఈ ఆఫర్లను ఇప్పుడు మిస్‌ చేసుకుంటే మళ్లీ కొనుగోలు చేయలేరని గ్రహించండి.

- Advertisement -

ఈ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులపై భారీ ఆఫర్లు..

ఈ సేల్ సమయంలో వన్‌ప్లస్‌ 13 స్మార్ట్‌ఫోన్‌పై ఏకంగా రూ. 13వేల డిస్కంట్‌ లభిస్తుంది. ఈ డిస్కౌంట్ అనంతరం మీరు ఈ ఫోన్‌ను కేవలం రూ. 57,999 వద్ద కొనుగోలు చేయవచ్చు. అలాగే శామ్‌సంగ్‌ గెలాక్సీ S24 అల్ట్రా 5G స్మార్ట్‌ఫోన్‌పై కూడా ఆఫర్ ఉంది. దీని సాధారణ ధర రూ. 79,999 వద్ద ఉండగా.. బ్యాంక్ డిస్కౌంట్లతో కలిపి దీన్ని కేవలం రూ. 29 వేలకే కొనుగోలు చేయవచ్చు. ఇవి మాత్రమే కాకుండా మీరు ఐఫోన్ 15ను రూ.50,000 కంటే తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ ధర 128 జీబీ స్టోరేజ్ వేరియంట్‌కు మాత్రమే వర్తిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ అమెజాన్‌లో రూ.49,999 వద్ద లభిస్తుంది. బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో దీన్ని మరింత తక్కువ ధరకే కొనుక్కోవచ్చు. మీరు ఒక పెద్ద స్మార్ట్ టీవీ కొనాలని చూస్తుంటే.. తక్కువ బడ్జెట్‌లో ఉన్న అదిరే స్మార్ట్ ప్రొజెక్టర్ బెస్ట్ ఛాయిస్‌గా చెప్పవచ్చు. మీరు మార్కెట్లో రూ.5,000 నుండి ప్రారంభమయ్యే స్మార్ట్ ప్రొజెక్టర్‌లను కొనుక్కోవచ్చు. ఈ స్మార్ట్ ప్రొజెక్టర్‌లపై ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లను సులభంగా యాక్సెస్ చేయవచ్చు. అలాగే, రూ.6,799 నుండి ప్రారంభమయ్యే టీవీలను కూడా కొనుక్కోవచ్చు. దీపావళి సేల్ సమయంలో మీరు డిస్కౌంట్‌తో స్పీకర్లను కూడా కొనుగోలు చేయవచ్చు. కేవలం రూ.599 నుండి స్పీకర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ బడ్జెట్‌లో జెబ్రోనిక్స్, బోట్, పిట్రాన్, ప్రోట్రానిక్స్, ఉబన్, జస్ట్ కోర్సెకా వంటి ప్రముఖ బ్రాండ్లకు చెందిన సౌండ్‌ బాక్సులు అందుబాటులో ఉన్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad