Saturday, November 15, 2025
Homeటెక్నాలజీLava Agni 4: టెక్ ప్రియులకు గుడ్ న్యూస్..లావా అగ్ని 4 లాంచ్ డేట్ ఫిక్స్..కీలక...

Lava Agni 4: టెక్ ప్రియులకు గుడ్ న్యూస్..లావా అగ్ని 4 లాంచ్ డేట్ ఫిక్స్..కీలక ఫీచర్లు వెల్లడి!

Lava Agni 4 SmartPhone: లావా త్వరలో లావా అగ్ని 4 అనే మరో 5G స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో విడుదల చేయనుంది. ఈ పరికరం నవంబర్ 20న ఇండియా, ఎంపిక  చేసిన ప్రపంచ మార్కెట్‌లో లాంచ్ అవుతుందని కంపెనీ ధృవీకరించింది. సోషల్ మీడియా పోస్ట్ ద్వారా కంపెనీ లాంచ్ తేదీని నిర్ధారించింది. ఈ పరికరం అక్టోబర్ 2024లో మార్కెట్లో లాంచ్ అయినా లావా అగ్ని 3 5Gకి కొనసాగింపుగా రాబోతోంది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ చిప్‌సెట్‌ను కూడా కలిగి ఉంటుందని భావిస్తున్నారు. గతంలో, రాబోయే స్మార్ట్‌ఫోన్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుందని లావా టీజ్ చేసింది. అయితే, సెన్సార్ వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. ఇప్పుడు లావా అగ్ని 4 పరికరం లాంచ్ డేట్, ధర, ఫీచర్ల గురించి వివరంగా తెలుసుకుందాం.
నవంబర్ 20న లాంచ్ 
లావా మొబైల్స్ అధికారిక హ్యాండిల్ Xలో పోస్ట్‌లో అగ్ని సిరీస్ తదుపరి వెర్షన్ నవంబర్ 20న లాంచ్ అవుతుందని ప్రకటించింది. లాంచ్ తేదీ ప్రకటనతో పాటు, పరికరాన్ని శక్తివంతం చేసే ప్రాసెసర్ టీజర్ కూడా షేర్  చేసింది.
https://twitter.com/LavaMobile/status/1984870645960765714
మీడియాటెక్ 8350 చిప్‌సెట్
ఖచ్చితమైన చిప్‌సెట్ ఇంకా వెల్లడి కానప్పటికీ, కంపెనీ డైమెన్సిటీ లోగోను పంచుకుంది. రాబోయే స్మార్ట్‌ఫోన్ UFS 4.0 స్టోరేజ్‌ను కలిగి ఉంటుందని, మీడియాటెక్ 8350 చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందవచ్చని ఇటీవలి నివేదికలు సూచిస్తున్నాయి.
కొత్త కెమెరా మాడ్యూల్
ఈ నెల మొదట్లో నవంబర్ 1న కంపెనీ లావా అగ్ని 4 యొక్క వెనుక కెమెరా సెటప్‌ను X పోస్ట్‌లో టీజ్ చేసింది. కంపెనీ హ్యాండ్‌సెట్ ఫోటోను షేర్ చేసింది. ఇది దాని మునుపటి మోడల్ ట్రిపుల్ కెమెరా లేఅవుట్ కంటే పూర్తిగా భిన్నంగా ఉంటుంది.
7000mAh బడా బ్యాటరీ
ఈ పరికరం 7000mAh లిథియం పాలిమర్ బ్యాటరీతో శక్తిని పొందుతుందని భావిస్తున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే ఈ రాబోయే హ్యాండ్‌సెట్ అగ్ని 3 స్మార్ట్ ఫోన్ 5,000mAh బ్యాటరీ నుండి బిగ్ అప్‌గ్రేడ్ అవుతుంది.
ధర ఎంత ఉండవచ్చు?
లావా ఇంకా అధికారిక ధరను వెల్లడించనప్పటికీ, అగ్ని 4 ధర భారతదేశంలో సుమారు రూ.20,000 ఉంటుందని భావిస్తున్నారు. ఈ ఫోన్ లావా అధికారిక ఆన్‌లైన్ స్టోర్‌తో పాటు అమెజాన్‌లో కూడా అందుబాటులో ఉంటుందని సమాచారం
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad