Lava Blaze AMOLED 2 5G Launched: లావా భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో తమ కస్టమర్ల కోసం మరో బడ్జెట్ ఫోన్‌ను విడుదల చేసింది. కంపెనీ దీని లావా బ్లేజ్ అమోలేడ్ 2 5G పేరిట మార్కెట్లోకి తీసుకొచ్చింది. కంపెనీ Xలో పోస్ట్ ద్వారా దాని ధరను వెల్లడించింది. బడ్జెట్ ధరలో అద్భుతమైన ఫోన్ కొనాలనుకునేవారికి ఇది ఉత్తమ ఎంపిక. ఇప్పుడు ఈ ఫోన్ కు సంబంధించి ధర, ఫీచర్ల వివరాల గురించి పూర్తిగా తెలుసుకుందాం.
లావా బ్లేజ్ అమోలేడ్ 2 5G ధర:
కంపెనీ ఈ పరికరం 6GB RAM+128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 13,499గా నిర్ణయించింది. ఇది రెండు కలర్ ఆప్షన్ లో లభిస్తోంది. ఫెదర్ వైట్, మిడ్‌నైట్ బ్లాక్. ఈ ఫోన్ మొదటి అమ్మకం ఆగస్టు 16 నుండి అమెజాన్‌లో ప్రారంభమవుతుంది.
లావా బ్లేజ్ అమోలేడ్ 2 5G ఫీచర్స్:
ఈ లావా పరికరం పూర్తి HD+ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్‌తో 6.67-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది ఫోన్ మీడియాటెక్ డిమెన్సిటీ 7060 చిప్‌సెట్‌తో అమర్చారు. ఇది 6GB LPDDR5 RAM, 6GB వర్చువల్ RAM , 128GB UFS 3.1 ఇన్‌బిల్ట్ స్టోరేజ్‌ను కలిగి ఉంటుంది. దీనిని మైక్రో SD కార్డ్‌తో విస్తరించవచ్చు. ఈ ఫోన్ స్టాక్ ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్‌లో పనిచేస్తుంది. కంపెనీ 1 ఆండ్రాయిడ్ అప్‌గ్రేడ్ మరియు 2 సంవత్సరాల భద్రతా నవీకరణలను హామీ ఇస్తుంది. డస్ట్, నీటి నుండి రక్షణ కోసం ఈ ఫోన్ IP64 రేటింగ్‌తో అమర్చబడింది.
Also Read: Upcoming Smartphones: కొత్త ఫోన్ కొనాలా..? అయితే కాస్త ఆగండి..
కెమెరా సెటప్ గురించి మాట్లాడితే..ఇందులో వెనుక భాగంలో AI మద్దతుతో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. ఇదే సమయంలో సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం.. 8-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఇక బ్యాటరీ గురించి విషయానికి వస్తే.. ఈ ఫోన్ 5,000mAh బ్యాటరీతో 33W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ మందం లీనియా డిజైన్‌తో 7.55mm. భద్రత కోసం.. ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, ఫేస్ అన్‌లాక్ ఫీచర్ అందుబాటులో ఉంది.


