Lava Blaze Dragon 5G Launched: భారతీయ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ లావా మరోసారి లావా బ్లేజ్ డ్రాగన్ 5G ని విడుదల చేయడం ద్వారా దేశీయ మార్కెట్లోకి బ్యాంగ్ ఎంట్రీ ఇచ్చింది. తక్కువ ధరకే గొప్ప పనితీరు, ప్రీమియం డిజైన్, 5G కనెక్టివిటీ కోసం చూస్తున్న వినియోగదారుల కోసం ఈ స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకంగా రూపొందించారు. అయితే, ఈ పరికరం రూ.10,000 కంటే తక్కువ ధరకు అందుబాటులో ఉండడం విశేషం. ఈ ఫోన్‌కు క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్, 120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే, 50 మెగాపిక్సెల్ AI డ్యూయల్ కెమెరా, 5000mAh బ్యాటరీ వంటి బలమైన ఫీచర్లతో వస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ ధర, ప్రత్యేక ఫీచర్ల గురించి వివరంగా తెలుసుకుందాం.
Lava Blaze Dragon 5G ధర:
లావా బ్లేజ్ డ్రాగన్ 5G మొబైల్ 4GB+128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 9,999 విడుదల చేశారు. లావా అధికారిక వెబ్‌సైట్ లేదా అమెజాన్ ఇండియా నుండి ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. లాంచ్ ఆఫర్ల కింద, కంపెనీ రూ. 1000 బ్యాంక్ డిస్కౌంట్, రూ. 1000 ఎక్స్ఛేంజ్ బోనస్‌ను అందిస్తుంది. కాగా లావా బ్లేజ్ డ్రాగన్ 5G అమ్మకం ఆగస్టు 1 నుండి ప్రారంభమవుతుంది. ఈ ఫోన్ సిల్వర్, బ్లూ రంగు ఎంపికలలో లభిస్తోంది.
Also Read: Honor Pad X7: 7020mAh బ్యాటరీతో హానర్ నయా టాబ్లెట్..!
Lava Blaze Dragon 5G ఫీచర్లు:
ఈ పరికరం 6.78-అంగుళాల FHD+ IPS LCD డిస్ప్లేను కలిగి ఉంది. ఇది 120Hz అధిక రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. దీని పంచ్-హోల్ డిజైన్, సన్నని బెజెల్‌లు దీనికి ప్రీమియం లుక్‌ను అందిస్తాయి. ఇందులో స్నాప్‌డ్రాగన్ 4 Gen 2 చిప్‌సెట్‌ను అమర్చారు. ఇది 5G కనెక్టివిటీతో మెరుగైన పనితీరు, బ్యాటరీ సామర్థ్యాన్ని అందిస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 అవుట్-ఆఫ్-ది-బాక్స్ ఆధారంగా రూపొందించబడింది. దీనిలో బ్లోట్‌వేర్ ఉండదని, అంటే.. వినియోగదారుడు క్లీన్, స్మూత్ UI అనుభవాన్ని పొందుతారని కంపెనీ పేర్కొంది.
కెమెరా విభాగం గురించి మాట్లాడితే..లావా బ్లేజ్ డ్రాగన్ 5Gలో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఈ పరికరంలో 50MP AI ప్రైమరీ సెన్సార్, సెకండరీ డెప్త్ సెన్సార్ ఉన్నాయి. ముందు భాగంలో 8MP సెల్ఫీ కెమెరా ఉంది. ఇది వీడియో కాలింగ్, సోషల్ మీడియాకు మంచి ఎంపిక అని చెప్పవచ్చు. ఇది AI మోడ్, నైట్ మోడ్, HDR, కెమెరా మెరుగుదల కోసం ప్రో మోడ్ వంటి లక్షణాలను కలిగి ఉంది.
ALSO READ: https://teluguprabha.net/technology-news/isro-space-station-2035-satellite-expansion-plan/
బ్యాటరీ విషయానికి వస్తే..ఇది 18W టైప్-C ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇచ్చే 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. బ్యాటరీ బ్యాకప్ మొత్తం రోజంతా సరిపోతుంది. కనెక్టివిటీ పరంగా..ఈ ఫోన్ లో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్, USB టైప్-C పోర్ట్ వంటి ముఖ్యమైన లక్షణాలను కలిగి ఉంది. ఇది IP52 డస్ట్, వాటర్ రెసిస్టెంట్ రేటింగ్‌తో వస్తుంది.


