Sunday, November 16, 2025
Homeటెక్నాలజీMobile Offers: లావా నుంచి మరో బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్‌ రిలీజ్‌.. కేవలం రూ.7,500లకే కిర్రాక్‌ ఫీచర్లు..!

Mobile Offers: లావా నుంచి మరో బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్‌ రిలీజ్‌.. కేవలం రూ.7,500లకే కిర్రాక్‌ ఫీచర్లు..!

lava shark 2 price in india Price and Specifications: దేశీయ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ లావా ఎప్పటికప్పుడు కొత్త మోడళ్లను రిలీజ్‌ చేస్తూ స్మార్ట్‌ఫోన్‌ ప్రియులను ఆకట్టుకుంటోంది. లావా తాజాగా అతి తక్కువ ధరలోనే మరో స్మార్ట్‌ఫోను ఆవిష్కరించింది. భారత మార్కెట్‌లోకి సరసమైన ధరలోనే దీన్ని విడుదల చేసింది. లావా షార్క్‌ 2 పేరుతో దీన్ని లాంచ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ అమ్మకాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. బడ్జెట్‌ ధరలో రిలీజైన లావా షార్క్‌ 2 స్మార్ట్‌ఫోన్‌ ధర, ఫీచర్ల వివరాలపై ఓలుక్కేద్దాం.

- Advertisement -

లావా షార్క్‌ 2 ధర..

లావా షార్క్‌ 2 స్మార్ట్‌ఫోన్‌ భారత మార్కెట్‌లోకి కేవలం రూ.7,500 ధర వద్ద రిలీజైంది. కంపెనీ 4 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్‌ను ప్రవేశపెట్టింది. ఈ ఫోన్‌పై తక్షణ తగ్గింపు కూడా లభిస్తుంది. ఫోన్ కొనుగోలుపై రూ.750 డిస్కౌంట్‌ను సైతం అందిస్తోంది. ఈ డిస్కౌంట్ తర్వాత దీని ధర రూ.6,750కి చేరుకుంది. కాగా, దీనిని రిటైల్ అవుట్‌లెట్ల నుండి మాత్రమే కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ బ్లాక్, సిల్వర్ కలర్ వేరియంట్లలో లభిస్తుంది.

లావా షార్క్‌ 2 స్పెసిఫికేషన్లు..

లావా షార్క్‌ 2 ఫీచర్ల విషయానికి వస్తే.. ఈ స్మార్ట్‌ఫోన్‌ 6.75 అంగుళాల హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. దీనిలోని ఎల్‌సీడీ ప్యానెల్ నాచ్ డిజైన్‌తో వస్తుంది. ఈ డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. లావా షార్క్‌ 2 ఫోన్ యూనిసోక్‌ T7250 చిప్‌సెట్ ద్వారా పనిచేస్తుంది. ఇది 4 జీబీ ర్యామ్‌ + 64 జీబీ స్టోరేజ్‌ను కలిగి ఉంటుంది. దీనిలోని ర్యామ్‌ని 4 జీబీ వరకు విస్తరించుకోవచ్చు. ఇది ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత ఓఎస్‌పై పనిచేస్తుంది. ఇక, కెమెరా విషయానికొస్తే.. లావా షార్క్‌ 2 స్మార్ట్‌ఫోన్‌ 50 మెగాపిక్సెల్ బ్యాక్‌ కెమెరా, 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాలను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో కూడిన 5000mAh బ్యాటరీతో వస్తుంది. దీని డిస్‌ప్లే వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్సీ కోసం IP54 రేటింగ్‌ను కలిగి ఉంటుంది. లావా షార్క్ 2 ఫోన్ గ్లాసీ బ్యాక్ ప్యానెల్‌తో వస్తుంది.ఇది ‘లావా బోల్డ్ ఎన్1 ప్రో’ మోడల్‌ను పోలి ఉండటం గమనార్హం. ఇక, ఫోన్ కనెక్టివిటీ, ఇతర పోర్టుల విషయానికొస్తే, కుడివైపు పవర్, వాల్యూమ్ బటన్లు ఉండగా, ఎడమవైపు సిమ్ ట్రే కోసం స్లాట్ ఇచ్చారు. ఫోన్ కింద భాగంలో స్పీకర్ గ్రిల్, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, యూఎస్‌బీ టైప్-సి పోర్టు ఉన్నాయి. ఇన్ని ప్రీమియం ఫీచర్లతో అతి తక్కువ ధరలోనే దీన్ని విడుదల చేయడం విశేషం. బడ్జెట్‌ ధరలోనే అన్ని ఫీచర్లతో కూడిన స్మార్ట్‌ఫోన్‌ కోసం చూస్తున్న వారికి ఇది బెస్ట్‌ ఆప్షన్‌గా చెప్పవచ్చు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad