Homeటెక్నాలజీLayoff emails: మెటా ఉద్యోగులకు బిగ్‌షాక్‌.. వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌ పేరు చెప్పి లేఆఫ్‌ మెయిల్స్‌

Layoff emails: మెటా ఉద్యోగులకు బిగ్‌షాక్‌.. వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌ పేరు చెప్పి లేఆఫ్‌ మెయిల్స్‌

Layoff mails for Meta Employes: ఫేస్‌బుక్‌ మాతృ సంస్థ మెటా తన ఉద్యోగులకు బిగ్‌ షాకిచ్చింది. మరోసారి భారీ లేఆఫ్స్‌కు తెరలేపింది. సంస్థ తొలుత తమ ఉద్యోగులకు వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌ చేయాలని చెప్పి.. సడన్‌గా లేఆఫ్‌ మెయిల్స్‌ పంపినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సింగపూర్‌, యూఎస్‌, యూకే వంటి ప్రాంతాల్లోని ఉద్యోగులకు తొలుత వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేయాలని కంపెనీ తెలిపింది. అందుకు వారు సిద్ధమవుతుండగా.. సరిగ్గా తెల్లవారుజామున కొంతమంది ఉద్యోగులకు లేఆఫ్‌ మెయిల్స్ పంపింది. ఎలాంటి గందరగోళం జరగకుండా ఉండేందుకు సంస్థ ఇలాంటి చర్యలు తీసుకున్నట్లు మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి.

- Advertisement -

Also read: Telangana Cabinet: 23న తెలంగాణ కేబినెట్‌ భేటీ.. ఈ అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్‌..!

దాదాపు 8 వేల మందిపై ఎఫెక్ట్..

ఇక, మెటా తన సింగపూర్‌లోని టీమ్‌కు తొలుత ఈ మెయిల్స్‌ పంపించింది. ఉదయం 4 గంటలకు (భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున 1:30 గంటలకు) వారికి అవి అందాయి. ఈ తొలగింపులకు ముందు ప్రపంచవ్యాప్తంగా మెటాలో దాదాపు 78 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. తాజాగా అందులో 10 శాతం అంటే.. దాదాపు 8 వేల మందిని ఉద్యోగం నుంచి తొలగించేందుకు రంగం సిద్ధం చేసింది. ఇందులో ఎక్కువగా ఇంజినీరింగ్‌, ప్రొడక్ట్‌ బృందాలు ప్రభావం కానున్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ ఏడాది చివర్లో కంపెనీ మరికొంత మందికి లేఆఫ్స్‌ ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. 7వేల మందిని ఏఐ విధుల్లోకి మార్చనున్నట్లు మెటా హెచ్‌ఆర్‌ చీఫ్‌ జానెల్లె గేల్‌ ఇప్పటికే ప్రకటించారు. అయితే, మెటా ఇలా అకస్మాత్తుగా ఉద్యోగులకు లేఆఫ్స్‌ ప్రకటించడం పట్ల నెట్టింట తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News