Lenovo Idea Tab Launched: లెనోవా తమ కస్టమర్ల కోసం కొత్త ట్యాబ్ ను తీసుకొచ్చింది. కంపెనీ కొత్త ట్యాబ్ శ్రేణిలో రెండు కొత్త ట్యాబ్‌లను మార్కెట్లో విడుదల చేసింది. అవి ఐడియా ట్యాబ్ ప్రో, ఐడియా ట్యాబ్ 5G . ఈ ట్యాబ్ లు ప్రొఫెషనల్ ఉపయోగం, AI- ఆధారిత పనికి అనుకూలంగా పని చేస్తాయి. ఐడియా ట్యాబ్ ప్రో ప్రీమియం మిడ్-రేంజ్ ఎంపిక అయితే, లెనోవా ఐడియా ట్యాబ్ పోర్టబిలిటీ, కనెక్టివిటీతో మంచి ఎంపిక. అయితే, ఈ ట్యాబ్ లకు సంబంధించి ధర, ఫీచర్లు తెలుసుకుందాం.
Lenovo Idea Tab Pro ధర:
కంపెనీ లెనోవా ఐడియా ట్యాబ్ ప్రో 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.27,999గా, 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.30,999గా నిర్ణయించింది. లెనోవా ఇండియన్ వెబ్‌సైట్, Amazon.in, లెనోవా అధికారిక ఆఫ్‌లైన్ రిటైల్ నెట్‌వర్క్‌లో అమ్మకానికి అందుబాటులో ఉంది.
Lenovo Idea Tab Pro లక్షణాలు:
లెనోవా ఐడియా ట్యాబ్ ప్రో 12.7-అంగుళాల 3K రిజల్యూషన్ LCD స్క్రీన్ కలిగి ఉంది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 8300 SoCని అమర్చారు. ఈ ట్యాబ్ ప్రో గూగుల్ సర్కిల్ టు సెర్చ్, ట్రాన్స్‌లేట్ వితౌట్ స్విచింగ్ యాప్స్, జెమిని AI వంటి AI సాధనాలకు మద్దతు ఇస్తుంది. ఇందులో ఉన్న క్వాడ్ JBL స్పీకర్లు, డాల్బీ అట్మోస్, మల్టీమీడియాకు గొప్పగా పనిచేస్తాయి. బ్యాటరీ విషయానికి వస్తే..ఈ ట్యాబ్ 10,200mAh బిగ్ బ్యాటరీతో 45W ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ ఇస్తుంది. ఇది 11 గంటల బ్యాక్-టు-బ్యాక్ వీడియో ప్లేని ఇస్తుంది. భద్రత కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్, Wi-Fi 6E, బ్లూటూత్ 5.3, ZUI 16 (ఆండ్రాయిడ్ 14), 2 OS , అదేవిధంగా 4 సంవత్సరాల భద్రతా అప్డేట్ ఇస్తున్నట్లు కంపెనీ పేర్కొంది.
Lenovo Idea Tab 5G ధర:
లెనోవా ఐడియా ట్యాబ్ వై-ఫై + పెన్ వేరియంట్ ధర రూ. 16,999 కాగా, 5G + పెన్ వేరియంట్ రూ. 19,999కి అందుబాటులో ఉంది. ఇది ఇప్పుడు లెనోవా ఇండియన్ వెబ్‌సైట్, Amazon.in, లెనోవా అధికారిక ఆఫ్‌లైన్ రిటైల్ నెట్‌వర్క్‌లో అమ్మకానికి అందుబాటులో ఉంది.
Lenovo Idea Tab 5G ఫీచర్స్:
లెనోవా ఐడియా ట్యాబ్ 5G 11-అంగుళాల 2.5K LCD స్క్రీన్ కలిగి ఉంది. ఇది AI-ఎనేబుల్డ్ ఫీచర్‌లను కలిగి ఉంది. ఇది మెరుగైన మల్టీ టాస్కింగ్ కోసం ZUI 17 (ఆండ్రాయిడ్ 15), లెనోవా టర్బోసిస్టమ్ టెక్నాలజీతో వస్తుంది. . డైమెన్సిటీ 6300 5G SoC (4nm) అమర్చారు. ఈ ట్యాబ్‌లో లెనోవా AI నోట్, సర్కిల్ టు సెర్చ్, టర్బోసిస్టమ్ వేగవంతమైన మల్టీయాప్ ఓపెనింగ్ టెక్నాలజీ ఉన్నాయి. ఈ ట్యాబ్ 7040mAh బిగ్ బ్యాటరీ తో వస్తుంది.ఇది ఆండ్రాయిడ్ 15 + ZUI 17, 2 OS అప్‌గ్రేడ్‌లు, 4 సంవత్సరాల భద్రతా మద్దతు ఇస్తుందని కంపెనీ వెల్లడించింది.


