ప్రస్తుతం చాలామంది వారి ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొనటానికి, కలలు నెరవేర్చుకోవటానికి బ్యాంకు లోన్లు తీసుకుంటున్నారు. వాటితో ఇల్లు కొనడం, వాహనం కొనడం లేదా వ్యాపారం ప్రారంభించడం వంటివి చేస్తున్నారు. వీరికి బ్యాంకు రుణాలు చాలా ఉపయోగపడతాయి. బయట తీసుకునే కంటే బ్యాంకు వడ్డీ తక్కువగా ఉంటుంది. వీటిని నెలవారి ఈఎమ్‌ఐ రూపంలో తిరిగి చెల్లిస్తారు. ఒకవేళ నెలవారి EMI బౌన్స్ అయితే, అది పెద్ద సమస్యగా మారుతుంది.
మీరు చెల్లించే నెలారీ వాయిదా మొదటిసారి బౌన్స్ అయినా, బ్యాంకు జరిమానా విధిస్తుంది. మరిన్ని EMIలు చెల్లించకపోతే, బ్యాంకు రిమైండర్ లెటర్ జారీ చేస్తుంది. మూడవసారి EMI బౌన్స్ అయితే, బ్యాంకు దాన్ని నిరర్థక ఆస్తిగా పరిగణించి రికవరీ ప్రక్రియ ప్రారంభిస్తుంది. ఇదే సమయంలో, బౌన్స్ అయిన EMI వల్ల మీ CIBIL స్కోరు కూడా తగ్గుతుంది. కానీ, మీరు EMI చెల్లించడంలో ఇబ్బందిపడుతున్నా, మీరు కొన్ని చిట్కాలను పాటించడంవల్ల ఈ సమస్యలను అధిగమించవచ్చు. ముందుగా, మీరు లోన్ తీసుకున్న బ్యాంకు శాఖకు వెళ్లి, బ్యాంక్ మేనేజర్‌ను కలుసుకుని మీ సమస్యను వివరించండి. మీరు భవిష్యత్తులో ఇలా జరగదని వారికి నమ్మకం ఇవ్వాలి. బ్యాంక్ మేనేజర్ మీకు భరోసా ఇచ్చి, తదుపరి EMIని సకాలంలో చెల్లించమని సూచిస్తారు.
ఇంతలో, మీరు కొంతకాలం EMI చెల్లించలేనట్లయితే, మీరు EMI పై మారటోరియం కోసం కూడా దరఖాస్తు చేయవచ్చు. దీనివల్ల, కొంత సమయం గడిచాక, మీరు పూర్తిగా EMI చెల్లించవచ్చు. ఇంకో ఎంపిక కుడా ఉంది, మీరు “డ్యూ EMI” ఆప్షన్ ఉపయోగించవచ్చు. మీకు జీతం ఆలస్యంగా వచ్చినప్పుడు లేదా నిధులు సమకూర్చలేకపోతే, మీరు బ్యాంక్ మేనేజర్‌తో ఈ ఎంపిక గురించి మాట్లాడవచ్చు. ఈ దశలో, మీరు నెలాఖరులో EMI చెల్లించవచ్చు. మీ CIBIL స్కోరు మీద దృష్టి పెట్టడం ముఖ్యం. మీ బకాయిలు మూడు నెలల కాలం గడవకుండా ఉంటే, బ్యాంక్ మేనేజర్ CIBIL స్కోర్ నివేదిక పంపవచ్చు. ఈ కాలానికి ముందు మీ CIBILపై ప్రతికూల నివేదికను పొందకుండా బ్యాంకు మేనేజర్‌ను కోరవచ్చు.
అంతేకాక, మీరు రుణం తీసుకున్న తర్వాత పరిస్థితి మారితే, EMI చెల్లించలేనట్లయితే, మీరు బ్యాంక్ మేనేజర్‌తో రుణ పరిష్కారం గురించి మాట్లాడవచ్చు. ఈ పరిష్కారం ద్వారా, మీరు ఒక నిర్దిష్ట మొత్తాన్ని ఒకేసారి చెల్లించవచ్చు, ఇది వన్-టైమ్ సెటిల్‌మెంట్‌గా పిలుస్తారు. ఈ విధంగా, మీ వాయిదాలు బౌన్స్ కాకుండా మీరు తగిన ప్రణాళికలు తీసుకుని, బ్యాంకు సమస్యలను సమర్థంగా పరిష్కరించుకోవచ్చు.