Homeటెక్నాలజీCompact Smartphones: చేతిలో ఇమిడిపోయే చిన్న స్మార్ట్‌ఫోన్‌ కోసం చూస్తున్నారా?.. వీటిపై ఓలుక్కేయండి బాసూ..!

Compact Smartphones: చేతిలో ఇమిడిపోయే చిన్న స్మార్ట్‌ఫోన్‌ కోసం చూస్తున్నారా?.. వీటిపై ఓలుక్కేయండి బాసూ..!

Looking for a small smartphone that fits in your hand: స్మార్ట్‌ఫోన్‌ ప్రియుల అభిరుచులు రోజురోజుకీ మారుతున్నాయి. భారీ స్క్రీన్ల కంటే చేతిలో సులభంగా ఇమిడిపోయే స్మార్ట్‌ఫోన్ల వైపు ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. చిన్న డిస్‌ప్లే, పాకెట్‌లో ఇట్టే ఇమిడిపోయేలా, చేత్తో పట్టుకునేటప్పుడు సౌకర్యవంతంగా ఉండే స్మార్ట్‌ఫోన్ల వైపు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొన్ని కంపెనీలు ఈ మధ్య కాలంలో చిన్న సైజు ఫోన్లను రిలీజ్‌ చేస్తున్నాయి. వీటి డిస్‌ప్లే కేవలం 6.3 అంగుళాలు లేదా అంతకన్నా తక్కువగానే ఉంటోంది. అలా మార్కెట్‌లో అందుబాటులో ఉన్న బుల్లిఫోన్లపై ఓలుక్కేద్దాం.

- Advertisement -

Also read: Harish Rao: బడే భాయి విధానాలను అమలు చేస్తున్న ఛోటే భాయ్‌.. సీఎం తీరుపై మండిపడ్డ హరీష్‌రావు

యాపిల్‌ ఐఫోన్‌ 17e

యాపిల్‌ నుంచి వస్తున్న అతి చిన్న స్మార్ట్‌ఫోన్‌ ఐఫోన్‌ 17ఈ. ఇది కేవలం 6.1 అంగుళాల సూపర్‌ రెటీనా ఎక్స్‌డీఆర్‌ డిస్‌ప్లేతో వస్తోంది. ఏ19 చిప్‌తో పనిచేస్తుంది. 48 ఎంపీ ప్రధాన కెమెరా, 12 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా కలిగి ఉంటుంది. 256 జీబీ వేరియంట్ ధర రూ. 64,900, 512 జీబీ వేరియంట్‌ ధర రూ. 84,900.

వివో X300 FE

వివో నుంచి ఇటీవలి కాలంలో లాంచ్‌ అయిన కాంపాక్ట్‌ ఫోన్‌ వివో X300 FE. ఇందులో 6.31 అంగుళాల అమోలెడ్‌ డిస్‌ప్లే ఉంది. ఆక్టాకోర్‌ స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్‌ 5 ప్రాసెసర్‌, 50 ఎంపీ ప్రధాన కెమెరా, 50 ఎంపీ అల్ట్రావైడ్‌ యాంగిల్‌ కెమెరా, 8ఎంపీ అల్ట్రావైడ్‌ కెమెరా, 50 ఎంపీ సెల్ఫీ కెమెరా ఇచ్చారు. 6500 ఎంఏహెచ్‌ బ్యాటరీ కలిగిన ఈ ఫోన్‌ ధర రూ. 79,999 నుంచి ప్రారంభమవుతుంది.

ఐఫోన్‌ 17

ఐఫోన్‌ 17 మరో పాపులర్‌ కాంపాక్ట్‌ స్మార్ట్‌ఫోన్‌. 6.3 అంగుళాల సూపర్‌ రెటీనా ఎక్స్‌డీఆర్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. యాపిల్‌ ఏ19 చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది. 48 ఎంపీ మెయిన్‌ కెమెరా, 40 ఎంపీ అల్ట్రావైడ్‌ యాంగిల్ కెమెరా, 18 ఎంపీ సెల్ఫీ కెమెరా అమర్చారు. 256 జీబీ వేరియంట్‌ రూ. 82,900, 512 జీబీ వేరియంట్‌ రూ.1,02,900 ధర వద్ద లభిస్తుంది.

గూగుల్‌ పిక్సెల్‌ 9a

గూగుల్‌ పిక్సెల్‌ ప్రియుల కోసం గూగుల్‌‌ పిక్సెల్‌ 9a కాంపాక్ట్‌ సైజ్‌లో అందుబాటులో ఉంది. ఇది 6.3 అంగుళాల డిస్‌ప్లే, టెన్సర్‌ జీ4 ప్రాసెసర్‌ కలిగి ఉంటుంది. 48 ఎంపీ ప్రధాన కెమెరా, 13 ఎంపీ అల్ట్రావైడ్‌ కెమెరా, 13 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా ఉంటుంది. 5,100mAh బ్యాటరీ, 23W వైర్డ్‌ ఫాస్ట్ ఛార్జింగ్‌ను కలిగి ఉంటుంది. 8 జీబీ ర్యామ్‌, 256 జీబీ వేరియంట్‌ ధర రూ. 49,999 వద్ద లభిస్తుంది. రూ. 50 వేల బడ్జెట్‌లో కాంపాక్ట్‌ ఫోన్‌ కోరుకునే వారికి ఇది బెస్ట్‌ ఆప్షన్‌.

ఒప్పో రెనో 15 ప్రో

ఒప్పో రెనో సిరీస్‌లో రెనో 15 ప్రో మిన్‌ 5G అందుబాటులో ఉంది. 6.32 అంగుళాల 1.5K ఎల్‌టీపీఎస్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే, మీడియాటెక్‌ డైమెన్సిటీ 8450 ప్రాసెసర్‌. 200 ఎంపీ ప్రధాన కెమెరా, 50 ఎంపీ అల్ట్రావైడ్‌ కెమెరా, 50 ఎంపీ పెరిస్కోప్‌ కెమెరా, 50 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. 6,200mAh బ్యాటరీ, 80W వైర్డ్‌ ఛార్జింగ్‌ ఫెసిలిటీ గల ఈ స్మార్ట్‌ఫోన్‌ 12 జీబీ + 256 జీీ వేరియంట్‌ రూ.59,999 వద్ద లభిస్తుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News