Saturday, November 15, 2025
Homeటెక్నాలజీMacBook Air M4: ఆఫర్ అంటే ఇదే..ఆపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ M4 పై రూ.17,000 పైగా...

MacBook Air M4: ఆఫర్ అంటే ఇదే..ఆపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ M4 పై రూ.17,000 పైగా డిస్కౌంట్! 

MacBook Air M4 Discount: ఆపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ M4 పై ఆకర్షణీయమైన ఆఫర్ అందుబాటులో ఉంది. దీని ద్వారా అతి తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు.  ఏకంగా  రూ.17,000 కంటే ఎక్కువ తగ్గింపుతో అందుబాటులో ఉంది. ఈ ఆఫర్ విజయ్ సేల్స్‌లో అందుబాటులో ఉంది. ఇది ఆపిల్ శక్తివంతమైన M4 ప్రాసెసర్‌ను కలిగి ఉంది.  M1 ప్రాసెసర్‌తో మ్యాక్‌బుక్ ఎయిర్‌ను ఉపయోగిస్తుంటే, దీనికి అప్‌గ్రేడ్ చేయడం గొప్ప ఎంపిక
కంపెనీ  మ్యాక్‌బుక్ ఎయిర్ M4 16GB RAM + 256GB SSD వేరియంట్‌ను రూ.99,900కి విడుదల చేసింది. అయితే, విజయ్ సేల్స్ ఈ పరికరాన్ని రూ.92,400 ప్రారంభ ధరకు లిస్ట్ అయింది. ఈ ధర  మ్యాక్‌బుక్ ఎయిర్ M4 స్కై బ్లూ కలర్ వేరియంట్ కోసం. ఇది రూ.7,500 ఫ్లాట్ డిస్కౌంట్‌ లభిస్తోంది. అదనంగా బ్యాంక్ ఆఫర్ ద్వారా రూ.10,000 తగ్గింపును పొందవచ్చు. ప్లాట్‌ఫామ్‌లో ICICI బ్యాంక్ లేదా SBI క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించడం వలన రూ.10,000 తక్షణ క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఈ విధంగా మ్యాక్‌బుక్ ఎయిర్ M4 పై ఏకంగా  రూ.17,500 ఆదా చేయవచ్చు. కలర్ వేరియంట్‌ను మార్చడం వల్ల పరికరం ధర కూడా ప్రభావితమవుతుందని గుర్తుంచుకోండి.
శక్తివంతమైన ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నట్లయితే, ఇది ఉత్తమ ఎంపిక అవుతుంది.  ఇప్పటికే M1 లేదా ఇతర విండోస్ ల్యాప్‌టాప్‌ని ఉపయోగిస్తుంటే, కొత్త ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నట్లయితే దీనికి అప్‌గ్రేడ్ చేయవచ్చు. ఈ ల్యాప్‌టాప్ అద్భుతమైన పనితీరు, బ్యాటరీ బ్యాకప్ ని అందిస్తుంది. ఇది మల్టీ టాస్కింగ్, కంటెంట్ క్రియేటర్ల, నిపుణులులు ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ పరికరం రెండు బాహ్య డిస్‌ప్లేలకు మద్దతు ఇస్తుంది. ఇది సింగల్ ఛార్జ్ తో 18 గంటల బ్యాటరీ బ్యాకప్ అందిస్తుంది. దీంతో ఈ పరికరాన్ని తరచుగా ఛార్జ్ చేయవలసిన అవసరం ఉండదు. ఈ ల్యాప్‌టాప్ సెంటర్ స్టేజ్, డెస్క్ వ్యూ వంటి ఫీచర్లతో 12MP వెబ్‌క్యామ్‌ను కలిగి ఉంది.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad