కారు కొనాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. ఇంట్లో కారు ఉండటం అనేది వాళ్ల అవసరాలు తీర్చే ఒక వస్తువుగా మాత్రమే కాదు ఇది వాళ్ల సమాజంలో వాళ్ల స్టేసన్‌ను పెంచుతుందని అనుకుంటారు. అయితే కొత్త సంవత్సరం ప్రారంభం అయ్యి అప్పుడే నెల కావస్తుంది. ధరలు తగ్గుతాయి కొందామని చూసిన వారందరికీ మారుతీ సుజుకీ పెద్ద షాక్ ఇచ్చింది. మారుతి సుజుకి కార్ల ధరలు పెంచినట్లు ప్రకటించింది. 2025 ఫిబ్రవరి 1 నుంచి ఈ కొత్త ధరలు అమలులోకి వస్తాయి. వ్యయాలు పెరగడం వల్ల ధరలు పెంచాల్సి వస్తోందని కంపెనీ పేర్కొంది. మోడల్‌ను బట్టి ధరల పెరుగుదల మారుతూ ఉంటుంది. కొన్ని కార్లకు ధరలు స్వల్పంగా పెరుగుతాయి, మరికొన్నింటికి మాత్రం ఎక్కువగా పెరుగుతాయి.
ప్రధాన విషయాలు:
సెలెరియో మోడల్ కార్ ఇప్పటికే రూ. 32,500 వరకు పెరుగుదలతో అత్యధిక ధర పెరిగిన మోడల్‌గా నిలిచింది. సియాజ్, జిమ్నీ మోడల్స్ కేవలం రూ. 1,500 అతి తక్కు ధర పెరిగిన వాటిగా నిలిచాయి.
మోడల్-వారీగా ధరల పెరుగుదల:
ఆల్టో K10: రూ. 19,500 వరకు
ఎస్-ప్రెస్సో: రూ. 5,000 వరకు
సెలెరియో: రూ. 32,500 వరకు
వాగన్ ఆర్: రూ. 13,000 వరకు
స్విఫ్ట్: రూ. 5,000 వరకు
డిజైర్: రూ. 10,500 వరకు
బ్రెజా: రూ. 20,000 వరకు
ఎర్టిగా: రూ. 15,000 వరకు
ఈకో: రూ. 12,000 వరకు
సూపర్ క్యారీ: రూ. 10,000 వరకు
ఇగ్నిస్: రూ. 6,000 వరకు
బలెనో: రూ. 9,000 వరకు
సియాజ్: రూ. 1,500 వరకు
ఎక్స్‌ఎల్6: రూ. 10,000 వరకు
ఫ్రోన్క్స్: రూ. 5,500 వరకు
ఇన్విక్టో: రూ. 30,000 వరకు
జిమ్నీ: రూ. 1,500 వరకు
గ్రాండ్ విటారా: రూ. 25,000 వరకు
మారుతి సుజుకి వ్యయాలను తగ్గించడానికి ప్రయత్నిస్తూనే, కొనుగోలుదారులపై ప్రభావం తగ్గించేందుకు కృషి చేస్తుందని ప్రకటించింది. 2024 డిసెంబర్ నెలలో మారుతి 1,78,248 యూనిట్లను విక్రయించింది. ఈ సంఖ్య 2023తో పోలిస్తే 30% పెరుగుదలను సూచిస్తోంది. వీటిలో 1,32,523 యూనిట్లు దేశీయ మార్కెట్‌లో అమ్ముడవగా, 37,419 యూనిట్లు ఎగుమతి చేశారు. ఈ ధరల పెంపు వల్ల వినియోగదారులపై ఏ మేర ప్రభావం పడుతుందో చూడాలి.