MG M9 Launched: ఇండియాలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. ప్రముఖ కంపెనీలన్నీ లేటెస్ట్ ఫీచర్లతో ఈవీ కార్లను మార్కెట్ లోకి తీసుకొస్తున్నాయి. తాజాగా ఎంజీ విండ్సర్ కంపెనీ నుండి లగ్జరీ ఎలక్ట్రిక్ వాహనం మార్కెట్లోకి వచ్చింది. JSW-MG మోటార్ ఇండియా తన ప్రీమియం ఎలక్ట్రిక్ MPV MG M9 ఎలక్ట్రిక్ వాహనాన్ని రూ. 69.90 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరకు విడుదల చేసింది. ఈ కారు పూర్తిగా ఫీచర్ చేయబడిన ఒకే వేరియంట్‌లో వస్తుంది. అయితే, ఈ ఎలక్ట్రిక్ వాహనాన్ని కేవలం రూ.1 లక్షకు బుక్ చేసుకోవచ్చు. ఈ గొప్ప MPV డెలివరీ ఆగస్టు 10, 2025 నుండి ప్రారంభమవుతుంది. కాగా, ఈ కారు MG సెలెక్ట్ అనే ప్రత్యేక డీలర్‌షిప్ నుండి విక్రయించబడుతుంది. ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ వాహనానికి సంబంధించి ధర, ఫీచర్లు గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
MG M9 EV రేంజ్, పనితీరు:
ఎంజీ ఎం9 ఈవీ 90kWh బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఎలక్ట్రిక్ MPV ఒక్కసారి ఛార్జ్ చేస్తే 548 కి.మీ (MIDC సైకిల్ ప్రకారం) వరకు నడపగలదని కంపెనీ పేర్కొంది. దీని ముందుభాగంలో అమర్చిన ఎలక్ట్రిక్ మోటార్ 241bhp శక్తిని, 350Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఈ ఎలక్ట్రిక్ కారు టాప్ స్పీడ్ 180 కేఎంపీహెచ్. 11 కేడబ్ల్యూ ఛార్జర్‌తో 5 శాతం నుంచి 100 శాతం వరకు పూర్తి ఛార్జ్ చేయడానికి 8.5 గంటల సమయం పడుతుంది!.
Also Read: Recharge Plans: డేటా తెగ వాడేస్తున్నారా? ఈ రీఛార్జ్ ప్లాన్స్ మీకోసమే!
MG M9 EV ఫీచర్లు:
దీని టాప్ ఫీచర్లలో లెవల్ 2 ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్) వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇందులో ఎలక్ట్రిక్ స్లైడింగ్ రియర్ డోర్లు, 6-వే అడ్జస్టబుల్ రెండవ వరుస సీట్లు, బాస్ మోడ్, వెల్కమ్ సీట్ ఫంక్షన్ ఉన్నాయి. ఇది EPB ఆటో హోల్డ్‌తో 7 ఎయిర్‌బ్యాగ్‌లను పొందుతుంది. ఈ ఎలక్ట్రిక్ వాహనం 12.3-అంగుళాల టచ్‌స్క్రీన్, 7-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లేను పొందుతుంది. ఇది 13-స్పీకర్ JBL సౌండ్ సిస్టమ్, 360-డిగ్రీ కెమెరా, ఎకో, నార్మల్, స్పోర్ట్ వంటి డ్రైవ్ మోడ్‌లను పొందుతుంది.
ఎవరు కొనుగోలు చేయాలి?
ప్రీమియం, సూపర్ లగ్జరీ, ఫీచర్-రిచ్ ఎలక్ట్రిక్, ఎక్కువ దూరాలను కవర్ చేయగల MPV కోసం చూస్తున్నట్లయితే..MG M9 EV ఒక గొప్ప ఎంపిక అని చెప్పవచ్చు. ఇది ఫ్యామిలీకి బెస్ట్ ఎలక్ట్రిక్ కారు. ఈ కారు మార్కెట్లో కియా కార్నివాల్, టయోటా వెల్‌ఫైర్ వంటి లగ్జరీ MPV లతో నేరుగా పోటీపడుతుంది.

