మోంట్రా ఎలక్ట్రిక్ భారతదేశంలో తన కొత్త ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ సూపర్ కార్గోను మార్కెట్లో విడుదల చేసింది. ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని కంపెనీ దీనిని తీసుకువచ్చింది. దీనిని సరసమైన ధరతో ప్రవేశపెట్టారు. దీనిని 170 క్యూబిక్ అడుగులు, 140 క్యూబిక్ అడుగులు, ట్రే డెక్ అనే మూడు వేరియంట్లలో తీసుకువచ్చారు. ఇప్పుడు ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ సూపర్ కార్గో ధర, ఫీచర్ల గురుంచి పూర్తిగా తెలుసుకుందాం.
ధర
సూపర్ కార్గో ఎక్స్-షోరూమ్ ధర రూ. 4.37 లక్షల నుండి ప్రారంభమవుతుంది. ఈ ధరలో సబ్సిడీ కూడా ఉంటుంది. దీనిని కొనుగోలు చేసిన తర్వాత 5 సంవత్సరాలు లేదా 1.75 లక్షల కి.మీ బ్యాటరీ వారంటీని కంపెనీ కల్పిస్తోంది.
ఫీచర్లు
సూపర్ కార్గో అనేక గొప్ప ఫీచర్ల తో వచ్చింది. ఇది ఇతర త్రీ-వీలర్ల నుండి భిన్నంగా ఉంటుంది. ఇది 13.8 kWh లిథియం-అయాన్ బ్యాటరీని కలిగి ఉంది. ఈ సూపర్ కార్గో 11 kW పీక్ పవర్, 70 Nm టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. పూర్తిగా ఛార్జ్ చేసిన తర్వాత 200 కి.మీ కంటే ఎక్కువ సర్టిఫైడ్ రేంజ్, వాస్తవ ఉపయోగంలో 170 కి.మీ రేంజ్‌ను ఇస్తుంది. అయితే, ఇది కేవలం 15 నిమిషాల్లో 100 శాతం వరకు ఛార్జ్ అవుతుంది.
సూపర్ కార్గో కు బోరాన్ స్టీల్ ఛాసిస్ ఉంది. 1.2 టన్నుల వాహన బరువు సామర్థ్యాన్ని కలిగి ఉంది. దీంతో భారీ వస్తువులను తీసుకెళ్లడానికి వీలు ఉంటుంది. ఈ వాహనంలో కంపెనీ 6.2 అడుగుల లోడ్ ట్రే, విశాలమైన డ్రైవర్ క్యాబిన్‌ను ఇచ్చింది. పెద్ద డెలివరీ ఆర్డర్లకు సూపర్ కార్గో ఎంతో ఉపయోగపడుతుంది.
సేఫ్టీ ఫీచర్లు
ఇందులో డ్రైవర్, ప్రయాణీకుల భద్రత కోసం అనేక గొప్ప ఫీచర్లు ఉన్నాయి. ముందు డిస్క్ బ్రేక్‌లు, హిల్-హోల్డ్ ఫంక్షన్, రివర్సింగ్ సౌలభ్యం కోసం రివర్స్ అసిస్ట్ పునరుత్పత్తి బ్రేకింగ్‌ను తీసుకొచ్చారు. ఇది 23% గ్రేడబిలిటీని కలిగి ఉంది. అంటే కఠినమైన రోడ్లపై కూడా దీన్ని సులభంగా నడపవచ్చు.