Most Popular Smartphones Sale in 2025: గ్లోబల్ మార్కెట్‌లోకి రోజుకో స్మార్ట్‌ఫోన్ ఎంట్రీ ఇస్తూ యూజర్లను ఆకట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఏ ఫోన్ ట్రెండింగ్‌లో ఉంది? అనే సందేహం మనలో చాలా మందికి రావొచ్చు. తాజాగా, విడుదలైన గ్లోబల్ హ్యాండ్‌సెట్ మోడల్ సేల్స్ ట్రాకర్ ప్రకారం.. 2025లో ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడైన స్మార్ట్‌ఫోన్‌గా ‘ఐఫోన్ 16’ నిలిచింది. అలాగే, ఈ ఏడాది మార్కెట్‌లో అమ్ముడైన టాప్-10 స్మార్ట్‌ఫోన్ల వివరాలను పరిశీలిద్దాం.
ఐదు స్థానాల్లో యాపిల్ ఫోన్లు..
2025లో అమ్ముడైన టాప్-10 స్మార్ట్‌ఫోన్లలో యాపిల్ ఫోన్లు 5 స్థానాల్లో, శాంసంగ్ పోన్లు మరో 5 స్థానాల్లో చోటు దక్కించుకున్నాయి. ఈ రెండు కంపెనీలకు చెందిన స్మార్ట్‌ఫోన్ మోడళ్లు ఈ మూడో త్రైమాసికంలో మొత్తం స్మార్ట్‌ఫోన్ షిప్‌మెంట్‌లలో దాదాపు 20% వాటాను కలిగి ఉన్నాయి. ముఖ్యంగా, తొలి 5 స్థానాలను 5జీ స్మార్ట్‌ఫోన్‌లు ఆక్రమించగా.. మూడో త్రైమాసికంలో కొత్త రికార్డు నమోదు చేసింది. ఇక, ఐఫోన్ 16.. 4 శాతం మార్కెట్ వాటాతో టాప్1 స్థానంలో నిలిచింది. వరుసగా మూడో త్రైమాసికంలో అత్యధికంగా అమ్ముడైన ఫోన్‌గా నిలిచింది. భారత్‌లో పండుగల సీజన్, ధర తగ్గింపు వంటివి ఐఫోన్ 16 అమ్మకాలకు కలిసి వచ్చాయనే చెప్పాలి. ఇకపోతే, అమెరికా, యూకే, చైనా వంటి కీలకమైన మార్కెట్లలో ఐఫోన్ 16 ప్రో మోడల్స్ అమ్మకాలు కాస్త తగ్గాయి. కానీ స్టాండర్డ్ ఐఫోన్ 16 సేల్స్ మాత్రం భారీగా పెరిగాయి.
మరో ఐదు స్థానాల్లో శాంసంగ్..
ఇక, టాప్-10 స్థానాల్లో 5 స్థానాలను శాంసంగ్ దక్కించుకుంది. గెలాక్సీ A సిరీస్ మోడల్స్ అత్యధికంగా అమ్ముడయ్యాయి. గెలాక్సీ A16 5జీ అత్యధికంగా అమ్ముడైన మోడల్‌గా నిలిచింది. ఏఐ ఫీచర్స్, బెస్ట్ క్వాలిటీ కెమెరాలు, ఫాస్ట్ ఛార్జింగ్ వల్ల గెలాక్సీ A36, A56 వంటి మధ్యశ్రేణి స్మార్ట్‌ఫోన్లకు కూడా భారీ డిమాండ్ ఏర్పడింది. అయితే, గెలాక్సీ ఏ16 4జీ, గెలాక్సీ ఏ6 వంటి ఎల్‌టీఈ మోడల్స్ ఇప్పటికీ లాటిన్ అమెరికా, మధ్యప్రాచ్యం, ఆఫ్రికా మార్కెట్లలో ప్రజాదరణ దక్కించుకున్నాయి. ఇక్కడ, 4జీ ఫోన్లకు మంచి డిమాండ్ ఏర్పడింది. మధ్యస్థశ్రేణి స్మార్ట్‌ఫోన్లలో జనరేటివ్ ఏఐకి పెరుగుతున్న ప్రజాదరణ వల్ల ఈ ఫోన్లు టాప్-10లో అమ్ముడవుతున్నాయి.
2025లో అమ్ముడైన టాప్10 స్మార్ట్‌ఫోన్లు ఇవే..
2025లో అమ్ముడైన టాప్10 స్మార్ట్‌ఫోన్లలో ఐఫోన్ 16 మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా శాంసంగ్ గెలాక్సీ A16 5G, ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్, శాంసంగ్ గెలాక్సీ A36, శాంసంగ్ గెలాక్సీ A56, ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్, శాంసంగ్ గెలాక్సీ A16 4G, శాంసంగ్ గెలాక్సీ A06 ఫోన్లు నిలిచాయి.

