Moto g06 Power and Moto g06 Launched: టెక్ లవర్స్ కు గుడ్ న్యూస్. ప్రముఖ బ్రాండ్ మోటోరోలా రెండు కొత్త స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేసింది. కంపెనీ వీటిని మోటో G06 పవర్, మోటో G06 పేరిట తీసుకొచ్చింది. మోటరోలా ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లను IFA 2025 లో విడుదల చేసింది. ఇది బెర్లిన్‌లో జరుగుతున్న ప్రపంచంలోనే అతిపెద్ద కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాల వాణిజ్య ప్రదర్శన. ఈ ఈవెంట్ లో కంపెనీ మోటరోలా ఎడ్జ్ 60 నియో ను కూడా రిలీజ్ చేసింది. ఇప్పుడు ఈ రెండు పరికరాలకు సంబంధించి ధర, ఫీచర్ల వివరాల గురించి తెలుసుకుందాం.
మోటో G06 పాంటోన్ లారెల్ ఓక్, పాంటోన్ అరబెస్క్యూ, పాంటోన్ టేప్‌స్ట్రీ, పాంటోన్ టెండ్రిల్ వంటి రంగులలో లభిస్తుంది, అయితే మోటో G06 పవర్ పాంటోన్ లారెల్ ఓక్, పాంటోన్ టేప్‌స్ట్రీ, పాంటోన్ టెండ్రిల్ వంటి రంగులలో మాత్రమే లభిస్తుంది. దీని ప్రారంభ ధర 129.99 యూరోలు (సుమారు USD 151 / రూ. 13,405). ఇక ఇండియాలో కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్‌ల ధర, లభ్యతకు సంబంధించి ఇంకా ఎటువంటి సమాచారాన్ని ప్రకటించలేదు.
Also Read: Smart Phones: కేవలం రూ.7 వేల లోపు లభించే బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్లు..
ఈ 4G స్మార్ట్‌ఫోన్‌లు 6.88-అంగుళాల HD ప్లస్ డిస్‌ప్లేను కలిగి ఉన్నాయి. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్‌తో వస్తుంది. రెండూ పరికరాలు మీడియాటెక్ హీలియో G81 ఎక్స్‌ట్రీమ్ ప్రాసెసర్‌తో అమర్చారు. ఈ స్మార్ట్‌ఫోన్‌లు ఆండ్రాయిడ్ 15 అవుట్ ఆఫ్ ది బాక్స్‌లో నడుస్తాయి. ఇక కెమెరా విషయానికి వస్తే, 50-మెగాపిక్సెల్ వెనుక కెమెరా, 8-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను అందించారు.
ఈ రెండు ఫోన్‌ల మధ్య ఉన్న ఏకైక తేడా బ్యాటరీ బ్యాకప్. మోటో G06 10W ఛార్జింగ్ సపోర్ట్‌తో 5200mAh బ్యాటరీని కలిగి ఉంది. మరోవైపు, G06 పవర్ 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో కూడిన 7000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది రెండున్నర రోజుల కంటే ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ అందిస్తుంది.
ఈ ఫోన్‌లు డ్యూయల్ సిమ్ సపోర్ట్‌తో వస్తాయి. మైక్రో SD స్లాట్‌ను కూడా కలిగి ఉంటాయి. రెండు ఫోన్‌లు 3.5mm ఆడియో జాక్‌తో అమర్చబడి ఉంటాయి. భద్రత కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను కూడా కలిగి ఉంటాయి. కనెక్టివిటీ పరంగా..రెండు ఫోన్‌ల లో డ్యూయల్ 4G VoLTE, Wi-Fi, బ్లూటూత్ వెర్షన్ 6.0, GPS, NFC, USB టైప్-C పోర్ట్ వంటి ఫీచర్లు కలిగి ఉన్నాయి. ఈ రెండు ఫోన్‌లు దుమ్ము, నీటి నుండి రక్షించబడటానికి IP64 రేటింగ్‌ను పొందాయి. సౌండ్ క్వాలిటీ కోసం ఇవి డాల్బీ అట్మాస్‌తో స్టీరియో స్పీకర్‌లను కలిగి ఉన్నాయి. G06 పవర్ బరువు 220 గ్రాములు. కొలతలు 171.35×77.50×8.82mm.


