Moto G06 Power in Flipkart Diwali Dhamaka Offer: ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ ఎగిరే గంతేసే శుభవార్త చెప్పింది. బిగ్ బ్యాంగ్ దివాళీ పేరిట నిర్వహిస్తున్న సేల్‌లో ఓ క్రేజీ ఆఫర్‌ను తీసుకొచ్చింది. కేవలం రూ. 1749కే 50 మెగాపిక్సెల్ కెమెరా, 7,000mAh బ్యాటరీ గల స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పిస్తోంది. ఇక, ఆఫర్ వివరాల్లోకి వెళ్తే.. మోటో జీ 06 పవర్ స్మార్ట్‌ఫోన్‌పై ఎవరూ ఊహించని భారీ తగ్గింపును అందిస్తోంది. బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్ల ద్వారా మరింత తక్కువ ధరకే దీన్ని కొనుగోలు చేయవచ్చని తెలిపింది. ప్రస్తుతం మోటో G06 పవర్ స్మార్ట్‌ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్ అందిస్తున్న డీల్స్, ఆఫర్స్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
మోటో జీ06 పవర్ ఆఫర్లు..
మోటో జీ06 పవర్‌లోని 4GB RAM + 64GB స్టోరేజ్ వేరియంట్ ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ.7,499 ధర వద్ద లిస్ట్ అయింది. ఎస్‌బీఐ కార్డుతో చేసే పేమెంట్లపై రూ.300 తగ్గింపు లభిస్తుంది. ఈ తగ్గింపు తర్వాత దీని ధర రూ.7,199 కి చేరుకుంటుంది. అదనంగా ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉంటుంది. ఈ ఎక్స్ఛేంజ్ ఆఫర్ దాదాపు రూ.5,450 వరకు ఆదా చేసుకోవచ్చు. ఈ ఎక్స్ఛేంజ్ ఆఫర్ అనంతరం మోటో G06 పవర్ స్మార్ట్‌ఫోన్‌ను కేవలం రూ. 1,749 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. అయితే, ఈ ఎక్స్‌ఛేంజ్ వాల్యూ మీరు ఎక్స్ఛేంజ్ చేస్తున్న ఫోన్ ప్రస్తుత పరిస్థితి, మోడల్‌పై ఆధారపడి ఉంటుందని గుర్తించుకోవాలి.
మోటో జీ06 పవర్ స్పెసిఫికేషన్లు..
మోటో జీ06 పవర్ ఫీచర్ల విషయానికొస్తే.. ఇది 6.88 అంగుళాల హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 720×1640 పిక్సెల్‌ల రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 600 నిట్స్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ హీలియో G81 ఎక్స్‌ట్రీమ్ ప్రాసెసర్ ద్వారా పనిచేస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 15 ఆధారంగా హలో యూఐపై నడుస్తుంది. మోటో G06 పవర్ ఫోన్ 4GB RAM + 64GB స్టోరేజ్‌తో వస్తుంది. దీని స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డ్ ద్వారా 1TB వరకు పెంచుకోవచ్చు. మోటో G06 పవర్ ఫోన్ వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్సీ కోసం IP64-రేటెడ్‌ను కలిగి ఉంటుంది. ఇక, కెమెరా సెటప్ విషయానికొస్తే.. మోటో G06 పవర్ వెనుక భాగంలో f/1.8 అపెర్చర్‌తో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుంది. సెల్ఫీల కోసం f/2.0 అపెర్చర్‌తో 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 7,000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఇది 18W ఛార్జింగ్‌కు మద్దతిస్తుంది. కనెక్టివిటీ ఆప్షన్ల విషయానికి వస్తే.. ఈ 4G LTE ఫోన్‌లో వైఫై, బ్లూటూత్ 6.0, GPS, గ్లోనాస్, గెలీలియో, QZSS, USB టైప్-C పోర్ట్ వంటివి ఉన్నాయి. సెక్యూరిటీ కోసం ఈ ఫోన్‌లో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అందించింది.


