Moto G35 5G SmartPhone: మీరు తక్కువ ధరకు గొప్ప 5G స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనీ ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్! ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్‌లో గొప్ప డీల్ అందుబాటులో ఉంది. పొరపాటున కూడా ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకండి. ప్రముఖ బ్రాండ్ మోటోరోలా ఫోన్ మోటరోలా G35 5G స్మార్ట్ ఫోన్ కేవలం రూ. 9 వేల కంటే తక్కువ ధరకే కొనుగోలుకు అందుబాటులో ఉంది. ప్రత్యేకత ఏంటంటే? మోటరోలా బడ్జెట్ విభాగంలో మోటరోలా G35 5Gతో 5G కనెక్టివిటీని అందిస్తోంది. చాలామంది ఈ బడ్జెట్ ధరలో 4G పరికరాన్ని కొనుగోలు చేస్తుంటారు. కానీ, ఇదే ధరకు మోటరోలా G35 5G స్మార్ట్ ఫోన్ వస్తుంది. 5G కనెక్టివిటీతో ఎయిర్‌టెల్, జియో లేదా ఇతర కంపెనీల అందిస్తున్న అపరిమిత 5G డేటాను ఆస్వాదించవచ్చు.
Also Read: SmartPhones: రూ.10 వేల లోపు లభించే టాప్ 5G స్మార్ట్ ఫోన్లు.. లిస్ట్ ఇదే..
ఈ మోటోరోలా బడ్జెట్ ఫోన్ ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ.8,999 తగ్గింపు ధరకు లిస్ట్ అయింది. ఎంపిక చేసిన బ్యాంక్ కార్డుల సహాయంతో కొనుగోలు చేస్తే, 5 శాతం క్యాష్‌బ్యాక్ కూడా పొందొచ్చు. దీంతో ఈ ఫోన్ ధర మరింత తగ్గుతుంది. అంతేకాదు, పాత ఫోన్‌ను ఎక్స్చేంజ్ చేసుకుంటే, దాదాపు రూ.7,850 వరకు తగ్గింపు పొందవచ్చు. కాకపోతే, ఫోన్ ఫోన్ మోడల్ కండిషన్‌పై ఆధారపడి ఉంటుంది. ఈ ఫోన్ మూడు రంగు ఎంపికలలో కొనుగోలు చేయవచ్చు. గువా రెడ్, లీఫ్ గ్రీన్. మిడ్‌నైట్ బ్లాక్.
మోటరోలా G35 5G స్మార్ట్ ఫోన్ 6.72-అంగుళాల ఫుల్ HD + 120Hz డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. కెమెరా గురించి మాట్లాడితే, దీని వెనుక ప్యానెల్ 50MP ప్రధాన, 8MP సెకండరీ సెన్సార్‌తో డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇది కాకుండా, ముందు భాగంలో 16MP సెల్ఫీ కెమెరా అందుబాటులో ఉంది. పనితీరు కోసం ఈ ఫోన్ లో T760ను అందించారు. బ్యాటరీ విషయానికి వస్తే, ఈ ఫోన్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది.
నోట్: ఆఫర్లు ప్రతిరోజూ మారవచ్చు. మీరు కొత్త ఆఫర్‌లను ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి. ఆఫర్లకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడూ మారుతుంటాయని గమనించాలి.


