Homeటెక్నాలజీMoto G37: మోటో నుంచి బడ్జెట్‌ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌.. ఫీచర్లు ఫిదా అవ్వాల్సిందే..!

Moto G37: మోటో నుంచి బడ్జెట్‌ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌.. ఫీచర్లు ఫిదా అవ్వాల్సిందే..!

Moto G37 smartphones launched: ప్రముఖ మొబైల్‌ తయారీ సంస్థ మోటరోలా తన జీ సిరీస్‌లో రెండు కొత్త స్మార్ట్‌ఫోన్లను దేశీయ విపణిలోకి లాంచ్‌ చేసింది. మోటరోలా జీ37, మోటరోలా జీ37 పవర్‌ పేరిట వీటిని ఆవిష్కరించింది. అద్భుతమైన ఫీచర్లతో బడ్జెట్‌ ధరలోనే వీటిని తీసుకొచ్చింది. ఈ ఎంట్రీ లెవల్‌ స్మార్ట్‌ఫోన్లలో మీడియాటెక్‌ డైమెన్సిటీ 6400 చిప్‌సెట్‌ను అందించడం విశేషం. ఈ రెండు స్మార్ట్‌ఫోన్ల వివరాలు పరిశీలిద్దాం.

- Advertisement -

మోటరోలా G37 ఫీచర్లు..

మోటరోలా G37 6.6 అంగుళాల హెచ్‌డీ+ ఎల్‌సీడీ డిస్‌ప్లేతో వస్తుంది. ఇది 120Hz రిఫ్రెష్‌ రేట్‌, 1,050 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌, IP64 రేటింగ్‌ కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్‌ 16 ఆధారిత ఓఎస్‌పై పనిచేస్తుంది. మీడియాటెక్‌ డైమెన్సిటీ 6400 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌పై రన్‌ అవుతుంది. 50 ఎంపీ మెయిన్‌ కెమెరా+ 8ఎంపీ సెల్ఫీ కెమెరా
5,200mAh బ్యాటరీ, 20W వైర్డ్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌+ 6W వైర్డ్‌ రివర్స్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ ఫెసిలిటీ, కార్నింగ్‌ గోరిల్లా గ్లాస్‌ 7i ప్రొటెక్షన్‌, సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్ వంటి స్పెషల్‌ ఫీచర్లను కలిగి ఉంటుంది. ఈ ఫోన్‌ బరువు 191 గ్రాములు. ఇక, ధర విషయానికొస్తే… మోటరోలా G37 స్మార్ట్‌ఫోన్‌ సింగిల్‌ వేరియంట్‌లో లభిస్తుంది. 4జీబీ+ 64జీబీ వేరియంట్‌ ధరను రూ.13,999గా కంపెనీ నిర్ణయించింది. పాంటోన్ కాప్రి , పాంటోన్ ఇంపెనెట్రబుల్ కలర్‌ ఆప్షన్లలో లభిస్తుంది.

Also read: Telangana cabinet: సీఎం రేవంత్‌ షాకింగ్‌ నిర్ణయం.. యాదాద్రిలో కేబినెట్‌ మీటింగ్‌.. ఎందుకంటే?

మోటరోలా G37 పవర్‌ ఫీచర్లు..

ఇక, మోటోరొలా G37 పవర్‌ 6.6 అంగుళాల హెచ్‌డీ+ ఎల్‌సీడీ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్‌ రేట్‌, 1,050 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌, IP64 రేటింగ్‌తో వస్తుంది. ఇది ఆండ్రాయిడ్‌ 16 ఆధారంగా పనిచేస్తుంది. మీడియాటెక్‌ డైమెన్సిటీ 6400 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌, 50 ఎంపీ మెయిన్‌ కెమెరా+ 8ఎంపీ సెల్ఫీ కెమెరా, కార్నింగ్‌ గోరిల్లా గ్లాస్‌ 7i ప్రొటెక్షన్‌, 7,000mAh బ్యాటరీ, 30W వైర్డ్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ + 6W వైర్డ్‌ రివర్స్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ వంటి ఫీచర్లను కలిగి ఉంది. ఈ ఫోన్‌ బరువు 215 గ్రాములు ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్, పాంటోన్‌ నాటికల్‌ బ్లూ కలర్‌ ఆప్షన్లలో లభిస్తుంది. ఇక, ధర విషయానికొస్తే… మోటోరొలా G37 పవర్‌ స్మార్ట్‌ఫోన్‌ మొత్తం రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. 4GB + 128GB వేరియంట్‌ ధర రూ. 15,999, 8GB + 128GB ధర రూ.18,999గా కంపెనీ నిర్ణయించింది. మే 25 నుంచి ఫ్లిప్‌కార్ట్‌, మోటరోలా ఇండియా వెబ్‌సైట్‌, సంబంధిత రిటైల్‌ స్టోర్లలో అందుబాటులో ఉంటుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News