Saturday, November 15, 2025
Homeటెక్నాలజీMoto G67 Power 5G Launched: అదిరిపోయే ఫీచర్లతో మోటో నుంచి  G67 పవర్ 5G...

Moto G67 Power 5G Launched: అదిరిపోయే ఫీచర్లతో మోటో నుంచి  G67 పవర్ 5G వచ్చేసిందోచ్..ధర కూడా తక్కువే! 

Moto G67 Power 5G SmartPhone: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ మోటోరోలా తన కస్టమర్ల కోసం ఇండియాలో సరికొత్త పరికరాన్ని రిలీజ్ చేసింది. కంపెనీ తన G-సిరీస్ కింద  దీని మోటో G67 పవర్ 5G పేరిట తీసుకొచ్చింది.  ఈ హ్యాండ్‌సెట్‌లో స్నాప్‌డ్రాగన్ 7s Gen 2 చిప్‌సెట్, 7000mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీ,  6.7-అంగుళాల ఫుల్ HD+ డిస్‌ప్లే వంటి ఫీచర్లను కలిగి ఉంది. బడ్జెట్ శ్రేణిలో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనీ ప్లాన్ చేస్తున్నవారికి ఇది బెస్ట్ ఆప్షన్ అవుతుంది.
మోటో G67 పవర్ 5G ధర, లభ్యత: 
కంపెనీ మోటో G67 పవర్ 5G స్మార్ట్ ఫోన్ 8GBRAM+128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.15,999గా పేర్కొంది. అలాగే 8GBRAM+256GB స్టోరేజ్ కలిగిన టాప్ వేరియంట్ త్వరలో అందుబాటులోకి రానుంది.  మొదటి సేల్‌ కింద ఈ పరికరాన్ని రూ.14,999 కు విక్రయిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఈ కొత్త హ్యాండ్‌సెట్ సేల్స్ నవంబర్ 12న కంపెనీ వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్‌లో విక్రయానికి రానున్నాయి. కాగా, ఈ పరికరం పాంటోన్ పారాచూట్ పర్పుల్, పాంటోన్ బ్లూ కురాకో, పాంటోన్ సిలాంట్రో రంగులలో లభిస్తోంది.
మోటో G67 పవర్ 5G  ఫీచర్లు:
డిస్ప్లే 
ఈ ఫోన్ ఆకట్టుకునేలా కనిపిస్తుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, HDR10+ సపోర్ట్‌తో 6.7-అంగుళాల ఫుల్ HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ద్వారా రక్షణ పొందుతుంది.  ఈ పరికరం మిలిటరీ-గ్రేడ్ డ్రాప్ ప్రొటెక్షన్‌ను కూడా అందిస్తుంది.
ప్రాసెసర, సస్టోరేజీ 
ఈ ఫోన్ శక్తివంతమైన క్వాల్కమ్ 4nm స్నాప్‌డ్రాగన్ 7s Gen 2 చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ ర్యామ్ బూస్టర్ ఫీచర్‌ను కలిగి ఉంది. ఇది రర్యామ్ ని 24GB వరకు విస్తరించడానికి  అనుమతిస్తుంది. ఇది 256GB వరకు అంతర్గత నిల్వను కూడా అందిస్తుంది.
ఆండ్రాయిడ్ 
ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15-ఆధారిత Hello UXపై నడుస్తుంది. భద్రత కోసం, ఫోన్‌లో ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉంది. గూగుల్ జెమిని AI వాయిస్ అసిస్టెంట్‌కు మద్దతు ఇస్తుంది. ఫోన్ డ్యూయల్-సిమ్ సపోర్ట్‌ను కలిగి ఉంది.
కెమెరా 
ఈ ఫోన్ ప్రత్యేకమైన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో f/1.8 ఎపర్చర్‌తో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, f/2.2 ఎపర్చర్‌తో 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ లెన్స్ ఉన్నాయి. ఇది టూ-ఇన్-వన్ ఫ్లికర్ కెమెరాగా పనిచేస్తుంది. ముందు భాగంలో 32-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. ఈ పరికరం 30fps వద్ద పూర్తి-HD రిజల్యూషన్ వీడియోలను రికార్డ్ చేయగలదు. డ్యూయల్ క్యాప్చర్, టైమ్‌లాప్స్, స్లో మోషన్, ఆడియో జూమ్ మోడ్‌లు వంటి  ఫీచర్లను అందిస్తుంది.
బ్యాటరీ 
ఈ ఫోన్ 30W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో కూడిన 7,000mAh బడా సిలికాన్-కార్బన్ బ్యాటరీతో పనిచేస్తుంది.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad