Moto G86 Power 5G Launched: మోటరోలా తమ వినియోగదారుల కోసం మరో కొత్త ఫోన్ భారత మార్కెట్లో విడుదల చేసింది. కంపెనీ దీని మోటో G86 పవర్ 5G పేరిట తీసుకొచ్చింది. అనేక అదిరిపోయే ఫీచర్లతో వస్తున్న ఈ పరికరం బడ్జెట్ ధరలో ఉండటం విశేషం. 6,720mAh బిగ్ బ్యాటరీ ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 7400 చిప్‌సెట్ తో వస్తున్న ఈ మొబైల్ సంబంధించి ధర, ఫీచర్ల గురించి వివరంగా చూద్దాం.
Moto G86 Power 5G ధర:
కంపెనీ మోటో G86 పవర్ 5G స్మార్ట్ ఫోన్ భారతదేశంలో 8GB RAM+ 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.17,999గా పేర్కొంది. ఈ ఫోన్ మూడు ఆకర్షణీయమైన Pantone-సర్టిఫైడ్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. కాస్మిక్ స్కై, గోల్డెన్ సైప్రస్, స్పెల్‌బౌండ్.
ఈ పరికరం కొనుగోలుపై కంపెనీ ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులపై రూ.1,000 తగ్గింపు లేదా ఎక్స్ఛేంజ్ ఆఫర్‌గా రూ.1,000 అదనపు తగ్గింపును కూడా అందిస్తోంది. దీంతో వినియోగదారులు ఈ పరికరాన్ని కేవలం ₹ 16,999కే సొంతం చేసుకోవచ్చు. మొదటి సేల్ ఆగస్టు 6 నుండి Flipkart, motorola.in, దేశవ్యాప్తంగా ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్‌లలో ప్రారంభమవుతుంది.
Moto G86 Power 5G ఫీచర్లు:
మోటో G86 పవర్ 5G స్మార్ట్ ఫోన్ 6.7-అంగుళాల సూపర్ HD (1,220×2,712 పిక్సెల్స్) AMOLED స్క్రీన్‌ను 120Hz రిఫ్రెష్ రేట్, 4,500 నిట్‌ల గరిష్ట బ్రైట్‌నెస్, గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్‌తో కలిగి ఉంది. డిస్ప్లే HDR10+కి మద్దతు ఇస్తుంది. అంతేకాకుండా తక్కువ బ్లూ లైట్, తక్కువ మోషన్ బ్లర్ ప్రమాణాలకు SGS సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది.
Also Read: Acer Nitro Lite 16: అదిరిపోయే ఫీచర్లతో ఏసర్ నుంచి కొత్త ల్యాప్‌టాప్ విడుదల.. ధర ఎంతంటే..?
ఈ పరికరం 8GB LPDDR4X RAM, 128GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో జత చేయబడిన 4nm ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7400 SoC ద్వారా శక్తిని పొందుతుంది. మైక్రో SD కార్డ్ ద్వారా స్టోరేజ్‌ను 1TB వరకు విస్తరించవచ్చు. ఫోన్ ఆండ్రాయిడ్ 15-ఆధారిత హలో UI అవుట్-ఆఫ్-ది-బాక్స్‌లో నడుస్తుంది.
కెమెరా గురించి చెప్పాలంటే.. మోటో G86 పవర్ 5G స్మార్ట్ ఫోన్లో 50-మెగాపిక్సెల్ Sony LYT-600 ప్రైమరీ సెన్సార్, మాక్రో మోడ్‌తో కూడిన 8-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ షూటర్, వెనుక భాగంలో 3-ఇన్-1 ఫ్లికర్ సెన్సార్ ఉన్నాయి. ఇక సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం.. హ్యాండ్‌సెట్ ముందు భాగంలో 32-మెగాపిక్సెల్ సెన్సార్ ఉంది. ఇది డాల్బీ ఆడియో, హై-రెస్ ఆడియో సర్టిఫికేషన్‌తో డ్యూయల్ స్టీరియో స్పీకర్ సిస్టమ్‌ను కూడా కలిగి ఉంది.
బ్యాటరీ విషయానికి వస్తే.. ఈ ఫోన్ 33W టర్బోపవర్ సపోర్ట్‌తో 6,720mAh బ్యాటరీ ఉంది. కనెక్టివిటీ పరంగా.. ఇందులో డ్యూయల్ నానో సిమ్, 5G, 4G, Wi-Fi 6, బ్లూటూత్ 5.4, GPS, USB టైప్-C పోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. మోటో G86 పవర్ 5G IP68+IP69 డస్ట్, వాటర్-రెసిస్టెంట్ రేటింగ్‌కు అనుగుణంగా ఉందని మోటరోలా పేర్కొంది. ఇది MIL-STD-810H సర్టిఫైడ్ డ్యూరబుల్ బిల్డ్‌ను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 161.21×74.74×8.6mm కొలతలు. 198 గ్రాముల బరువు.


