Saturday, November 15, 2025
Homeటెక్నాలజీMoto Pad 60 Neo Launched: మోటో పెన్ సపోర్ట్, స్మార్ట్ కనెక్ట్ ఫీచర్లతో మోటో...

Moto Pad 60 Neo Launched: మోటో పెన్ సపోర్ట్, స్మార్ట్ కనెక్ట్ ఫీచర్లతో మోటో ప్యాడ్ 60 నియో వచ్చేసిందోచ్!

Moto Pad 60 Neo: ప్రముఖ బ్రాండ్ మోటోరోలా తమ కస్టమర్ల కోసం సరికొత్త ప్యాడ్ ను శుక్రవారం ఇండియాలో లాంచ్ చేసింది. కంపెనీ దీని మోటో ప్యాడ్ 60 నియో పేరిట తీసుకొచ్చింది. అద్భుతమైన ఫీచర్లతో వస్తోన్న ఈ ప్యాడ్ సరసమైన ధరలో లభించడం విశేషం. ఇది ఒకే ఒక స్టోరేజ్ వేరియంట్, కలర్ ఆప్షన్‌లో మాత్రమే లభిస్తుంది. ఇందులో 7,040mAh బ్యాటరీ, ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌ను అందించారు. 8GBర్యామ్+128GB నిల్వను పొందుతుంది. దీని ధర, లభ్యత, ఫీచర్ల గురించి తెలుసుకుందాం.

- Advertisement -

 

మోటో ప్యాడ్ 60 నియో: ధర, లభ్యత

మోటో ప్యాడ్ 60 నియో ఇండియాలో 8GB ర్యామ్+128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ. 17,999. ఇది ఒకే పాంటోన్ బ్రాంజ్ గ్రీన్ రంగులో లభిస్తుంది. వచ్చే వారం నుండి ఫ్లిప్‌కార్ట్, ఇతర రిటైల్ ఛానెల్‌లలో అమ్మకానికి అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. అయితే, ప్రారంభ ఆఫర్ కింద కంపెనీ టాబ్లెట్‌ను రూ. 12,999కి అందిస్తోంది, ఇందులో బ్యాంక్ ఆఫర్‌లు కూడా ఉన్నాయి.

 

మోటో ప్యాడ్ 60 నియో: ఫీచర్లు

మోటో ప్యాడ్ 60 నియో 11-అంగుళాల IPS డిస్‌ప్లేతో కూడిన 5G టాబ్లెట్. ఇది 2.5K (2,560×1,600 పిక్సెల్స్) రిజల్యూషన్, 500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 90Hz రిఫ్రెష్ రేట్, 72 శాతం NTSC కలర్ గమట్, 10-పాయింట్ మల్టీటచ్ సపోర్ట్‌ను అందిస్తుంది. దీని టచ్‌స్క్రీన్ ఫ్లికర్ ఫ్రీ, తక్కువ బ్లూ లైట్ ఎమిషన్ కోసం TÜV రీన్‌ల్యాండ్ ద్వారా ధృవీకరించబడిందని కంపెనీ పేర్కొంది.

Also Read:Moto G35 5G Discount: రూ.8999కే మోటరోలా 5G ఫోన్..50MP కెమెరా,120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే, 5000mAh బ్యాటరీ

పనితీరు కోసం ఇందులో ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌ ను అమర్చారు. ఈ టాబ్లెట్ ఇంటిగ్రేటెడ్ ఆర్మ్ మాలి-G57 MC2 GPU, 8GB LPDDR4x RAM, 128GB UFS 2.2 ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో వస్తుంది. ఈ మోటరోలా టాబ్లెట్ 2.4GHz పీక్ క్లాక్ స్పీడ్‌తో రెండు పెర్ఫార్మెన్స్ కోర్లు, 2.0GHz పీక్ క్లాక్ స్పీడ్‌తో ఆరు ఎఫిషియెన్సీ కోర్లతో వస్తుంది. మోటరోలా ప్యాడ్ 60 నియోలో నానో సిమ్ ట్రే, మైక్రో SD కార్డ్ స్లాట్ కూడా ఉన్నాయి. దీని వలన నిల్వను 2TB వరకు విస్తరించవచ్చు.

ఫోటోగ్రఫీ కోసం, మోటరోలా ప్యాడ్ 60 నియోలో ఒకే 8-మెగాపిక్సెల్ వెనుక కెమెరా ఉంది. ముందు భాగంలో దీనికి 5-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. దీనికి నాలుగు స్పీకర్ల సెటప్ ఉంది. ఇది డాల్బీ అట్మాస్ మద్దతుతో వస్తుంది. ఇది దుమ్ము, స్ప్లాష్ నిరోధకతను కోసం టాబ్లెట్ IP52 రేటింగ్‌ను పొందింది.

మోటరోలా ఈ టాబ్లెట్‌తో మోటో పెన్ స్టైలస్‌ను కూడా అందిస్తుంది. ఆన్‌బోర్డ్ సెన్సార్ జాబితాలో యాక్సిలెరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, హాల్ సెన్సార్ ఉన్నాయి. బ్యాటరీ విషయానికి వస్తే ఇందులో 7,040mAh బ్యాటరీ ఉంది. ఇది 20W వైర్డ్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. కనెక్టివిటీ పరంగా.. ఇందులో GPS, GLONASS, గెలీలియో, A-GPS, Wi-Fi 5, బ్లూటూత్ 5.2 వంటి ఫీచర్లకు మద్దతు ఇస్తుంది. దీని పరిమాణం 254.59×166.15×6.99mm. బరువు దాదాపు 480 గ్రాములు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad