Saturday, November 15, 2025
Homeటెక్నాలజీMoto New Smartphone: మోటో సంచలనం.. అత్యంత సన్నగా స్మార్ట్‌ఫోన్‌ డిజైన్‌.. ఫీచర్లు చూస్తే వావ్‌...

Moto New Smartphone: మోటో సంచలనం.. అత్యంత సన్నగా స్మార్ట్‌ఫోన్‌ డిజైన్‌.. ఫీచర్లు చూస్తే వావ్‌ అనాల్సిందే..!

Moto X70 Air Smartphone Price and Features: దేశీయ స్మార్ట్‌ఫోన్ తయారీ దిగ్గజం మోటోరోలా ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్లను లాంచ్‌ చేస్తోంది. బడ్జెట్‌ ధరలోనే స్మార్ట్‌ఫోన్లను రిలీజ్‌ చేస్తూ యూజర్లను ఆకట్టుకుంటోంది. ఇందులో భాగంగానే అక్టోబర్ 31న మోటో తన లైనప్‌లో ఉన్న మరొక మొబైల్‌ను ఆవిష్కరించేందుకు సిద్ధమవుతోంది. మోటో X70 ఎయిర్‌ పేరుతో దీన్ని తొలుత చైనాలో ఆవిష్కరించనుంది. అనంతరం, ఈ ఫోన్‌ను నవంబర్ 5న గ్లోబల్‌ మార్కెట్‌లోకి తీసుకురానుంది. అయితే, లాంచింగ్‌కు ముందే దీని ప్రీ-ఆర్డర్లు ప్రారంభమయ్యాయి. మోటో ఎక్స్‌ 70 ఎయిర్‌ ఫోన్.. మోటరోలా ఎడ్జ్ 70 రీబ్రాండెడ్ వెర్షన్‌గా వస్తోంది. ఈ ఫోన్‌ ధర, ఫీచర్ల వివరాలపై ఓలుక్కేద్దాం.

- Advertisement -

బడ్జెట్‌ ధరలోనే అదిరే ఫీచర్లు..

మోటో ఎక్స్‌70 ఎయిర్‌ మొత్తం రెండు వేరియంట్లలో అందుబాటులోకి రానుంది. దీని 12 జీబీ + 256 జీబీ వేరియంట్ సుమారు రూ.30 వేల వద్ద లాంచ్‌ అవతుందని అంచనా. అదే సమయంలో 12 జీబీ +512 జీబీ వేరియంట్ ధర సుమారు రూ. 36 వేలుగా కంపెనీ నిర్ణయించినట్లు సమాచారం. ఈ ఫోన్‌ను లెనెవో మాల్‌, JD.com వంటి ప్లాట్‌ఫామ్‌ల నుండి ప్రీ ఆర్డర్ చేయవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌ గాడ్జెట్ గ్రే, లిల్లీ ప్యాడ్, బ్రాంజ్ గ్రీన్ కలర్ వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది.

50 ఎంపీ కెమెరా, ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌..

మోటో ఎక్స్‌ 70 ఎయిర్‌ స్మార్ట్‌ఫోన్‌ 1.5 K (1,220 x 2,712 పిక్సెల్స్) రిజల్యూషన్‌తో కూడిన 6.7 అంగుళాల pOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 4,500 నిట్‌ల గరిష్ట బ్రైట్‌నెస్‌తో వస్తుంది. పాన్‌టోన్‌-సర్టిఫైడ్ ప్యానెల్ ఎస్‌జీఎస్‌ ఐ ప్రొటెక్షన్‌ అనే అద్భుతమైన ఫీచర్‌ను కలిగి ఉంటుంది. దీన్ని సులభంగా అన్‌లాక్ చేయడానికి ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను అందించింది. మోటో X70 ఎయిర్‌ ఆండ్రాయిడ్ 16 ఓఎస్‌పై పనిచేస్తుంది. ఇది స్నాప్‌డ్రాగన్ 7 జెన్‌ 4 చిప్‌సెట్ ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 3D వేపర్ చాంబర్‌తో వస్తుంది . 68W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో 4800mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. కెమెరా విషయానికొస్తే.. దీని వెనుక భాగంలో 50 మెగాపిక్సెల్ మెయిన్‌ కెమెరాతో పాటు 50 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ లెన్స్, సెల్ఫీల కోసం 50 మెగాపిక్సెల్ ఫ్రంట్‌ కెమెరాలు ఉంటాయి. ఈ ఫోన్ 5జీ, వైఫై, బ్లూటూత్, జీపీఎస్‌, OTG, యూఎస్‌బీ టైప్-సీ కనెక్టివిటీ ఆప్షన్లకు మద్దతు ఇస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ కోసం IP68, IP69 రేటింగ్‌లతో వస్తుంది. పొరపాటున నీటిలో పడినప్పటికీ చెక్కు చెదరకుండా అద్భుతంగా పనిచేస్తుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad