Saturday, November 15, 2025
Homeటెక్నాలజీMotorola Edge 50 pro Discount: రూ.36 వేల ఫోన్ రూ.23 వేలకే..ఇప్పుడు మిసైతే ఎప్పడు...

Motorola Edge 50 pro Discount: రూ.36 వేల ఫోన్ రూ.23 వేలకే..ఇప్పుడు మిసైతే ఎప్పడు కొనలేరు!

Motorola Edge 50 pro SmartPhone: చాలారోజుల నుంచి కొత్త ఫోన్ కొనాలనే ప్లాన్ చేస్తున్నారా?అయితే మీకో గుడ్ న్యూస్! ప్రముఖ ఫోన్ బ్రాండ్ మోటోరోలా ఫోన్ పై క్రేజీ డీలా అందుబాటులో ఉంది. ఈ కామర్స్ సంస్థ అమెజాన్ లో  ప్రస్తుతం మోటరోలా ఎడ్జ్ 50 ప్రోపై భారీ తగ్గింపును అందిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ కలర్-అక్యూరేట్ డిస్‌ప్లే, గొప్ప పనితీరు, 125W ఛార్జింగ్ మద్దతును కలిగి ఉంది. ఇటువంటి డీల్‌లు సాధారణంగా ఎక్కువ కాలం ఉండవు. కాబట్టి కొత్త ఫోన్ కొనాలని చూస్తుంటే ఈ డీల్ బెస్ట్ ఛాయిస్ అవుతుంది. ఇప్పుడు ఫోన్  ఆఫర్ ధర, ఫీచర్ల గురించి వివరంగా తెలుసుకుందాం.

డిస్కౌంట్
కంపెనీ మోటరోలా ఎడ్జ్ 50 ప్రో (12GB + 256GB వేరియంట్, మూన్‌లైట్ పెర్ల్) ఇండియాలో  రూ.35,999 ధరకు లాంచ్ చేసింది. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు అమెజాన్‌లో  కేవలం రూ.23,670కి లిస్ట్ అయింది. అంటే ఈ-కామర్స్ దిగ్గజం ఈ ఫోన్‌పై రూ.12,329 ఫ్లాట్ డిస్కౌంట్‌ను అందిస్తోంది. అదనంగా, అమెజాన్ లో కస్టమర్లకు అనేక బ్యాంక్ ఆఫర్లు కూడా అందిస్తున్నారు.  పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్చ్సేంజ్ చేసుకోవడం ద్వారా రూ.22,250 వరకు ఆదా చేసుకోవచ్చు. కాకపోతే ఎక్చ్సేంజ్ విలువ పాత ఫోన్ కండిషన్, మోడల్ ఫై ఆధారపడి ఉంటుందని గుర్తించుకోండి.
ఫీచర్లు
ఫీచర్ల విషయానికి వస్తే.. మోటరోలా ఎడ్జ్ 50 ప్రో 144Hz రిఫ్రెష్ రేట్, HDR10+ సపోర్ట్, 2,000 nits పీక్ బ్రైట్‌నెస్‌తో 6.7-అంగుళాల 1.5K pOLED కర్వ్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 ప్రాసెసర్‌ ద్వారా శక్తిని పొందుతుంది. ఇది 12GBRAM+256GB నిల్వతో జత చేశారు. ఫోటోగ్రఫీ కోసం..ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. 50MP ప్రధాన కెమెరా (OIS తో), 13MP అల్ట్రా-వైడ్ లెన్స్, 10MP టెలిఫోటో కెమెరా (3x ఆప్టికల్ జూమ్‌తో) అందుబాటులో ఉన్నాయి. ముందు భాగంలో వీడియో కాల్స్ కోసం 50MP సెల్ఫీ కెమెరా ఉంది. ఇక బ్యాటరీ గురించి మాట్లాడితే..ఇది 125W ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్‌కు మద్దతు ఇచ్చే 4,500mAh బ్యాటరీని కలిగి ఉంది.
నోట్: ఆఫర్లు ప్రతిరోజూ మారవచ్చు. మీరు కొత్త ఆఫర్‌లను ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి. ఆఫర్లకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడూ మారుతుంటాయని గమనించాలి.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad