Motorola Edge 60 Fusion: భారతదేశంలో మోటరోలా స్మార్ట్‌ఫోన్లకు ఎప్పటిలాగే మంచి డిమాండ్ కొనసాగుతోంది. యువతరాన్ని ఆకట్టుకునే డిజైన్స్, ప్రీమియం ఫీచర్స్‌తోపాటు అందుబాటు ధరల్లో ఈ బ్రాండ్ మొబైల్స్‌ను అందిస్తుండటంతో, విస్తృతంగా కొనుగోళ్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మోటరోలా తాజాగా విడుదల చేసిన మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ 5G ఫోన్ ప్రస్తుతం మంచి చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే మార్కెట్‌లోకి వచ్చిన ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్ ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది.
ఈ మోడల్‌లో ఉండే ప్రధాన ఆకర్షణ దాని డిస్‌ప్లే. 6.67 అంగుళాల Super HD+ 1.5K pOLED క్వాడ్ కర్వ్డ్ స్క్రీన్‌తో ఇది అందుబాటులోకి వచ్చింది. ఈ డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్‌రేట్ సపోర్ట్ చేయడంతో పాటు 4500 nits పీక్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. స్క్రీన్ రక్షణ కోసం Corning Gorilla Glass 7i టెక్నాలజీ ఉపయోగించారు. దీని వలన రోజువారీ వాడకంలో ఫోన్ మరింత బలంగా, డ్యామేజ్ రహితంగా ఉండే అవకాశం ఉంటుంది.
పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, మోటరోలా ఈ ఫోన్‌లో MediaTek Dimensity 7400 చిప్‌సెట్‌ను అమర్చింది. ఇది ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. అధిక గ్రాఫిక్స్ అవసరమయ్యే గేమ్స్ లేదా మల్టీటాస్కింగ్‌లో కూడా ఈ డివైస్ సాఫీగా నడుస్తుంది.
ఫోటోగ్రఫీని ఇష్టపడే వారికి ఈ మోడల్ ఒక మంచి ఆప్షన్‌గా చెప్పుకోవచ్చు. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా అందించారు. ఈ కెమెరాలో Sony LYTIA 700C సెన్సార్ వాడారు. అలాగే OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్ట్ ఉండటం వలన తక్కువ లైట్‌లో కూడా క్లియర్ ఫొటోలు తీయవచ్చు. అదనంగా 13MP అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా అందుబాటులో ఉంది. ముందుభాగంలో 32MP సెల్ఫీ కెమెరాను మోటరోలా అమర్చింది.
ఎక్కువ శాతం చార్జ్…
బ్యాటరీ విషయానికి వస్తే, ఈ ఫోన్‌లో 5500 mAh సామర్థ్యం గల బ్యాటరీని వాడారు. దీని వలన దీర్ఘకాలం వాడకం సాధ్యమవుతుంది. 68W TurboPower ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ వలన తక్కువ సమయంలోనే ఎక్కువ శాతం చార్జ్ అవుతుంది. ఈ ఫోన్ Android 15 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది.
భారత మార్కెట్‌లో ఈ డివైస్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఒక వేరియంట్ 8GB RAM + 256GB స్టోరేజ్ కలిగి ఉంది. దీని ధర రూ.22,999గా నిర్ణయించారు. రెండో వేరియంట్ 12GB RAM + 256GB స్టోరేజ్‌తో వస్తోంది. దీని ధర రూ.24,999గా ఉంది.
మార్కెట్ ధరలు ఈ స్థాయిలో..
అయితే అసలు మార్కెట్ ధరలు ఈ స్థాయిలో లేవు. బేస్ వేరియంట్ ధర మొదట రూ.25,999గా ఉంది. కానీ ఫ్లిప్‌కార్ట్‌లో అందిస్తున్న ప్రత్యేక ఆఫర్ల వలన 11% తగ్గింపుతో రూ.22,999కు లభిస్తోంది. అలాగే హయ్యర్ వేరియంట్‌పై కూడా తగ్గింపులు అమలు చేస్తున్నారు.
ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేసే వినియోగదారులకు బ్యాంక్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. Axis, HDFC, IDFC, HSBC, Yes బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లతో చెల్లింపు చేస్తే అదనంగా దాదాపు రూ.2,000 వరకు తగ్గింపును పొందవచ్చు. ఈ విధంగా ఫోన్ ధర మరింత తగ్గుతుంది.
అంతేకాదు, పాత మొబైల్‌ను ఎక్స్చేంజ్ చేసి కొత్త ఫోన్‌ను కొనుగోలు చేసే వారికి ప్రత్యేక ప్రయోజనం ఉంటుంది. ఎక్స్చేంజ్ ఆఫర్ ద్వారా రూ.21,650 వరకు విలువను పొందే అవకాశం ఉంది. ఈ బోనస్ మొత్తాన్ని కొత్త ఫోన్ ధర నుంచి తీసేసుకుంటే, కేవలం రూ.1,349కే కొత్త మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ స్మార్ట్‌ఫోన్ పొందవచ్చు.
Also Read: https://teluguprabha.net/technology-news/oppo-k13-turbo-pro-5g-smart-phone-sales-start-in-india/
ఇలాంటి భారీ ఆఫర్లు, డిస్కౌంట్ల వలన ఈ మోడల్ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో బాగా అమ్ముడవుతోంది. యువత ఎక్కువగా ఈ ఫోన్‌ను ఎంపిక చేసుకోవడానికి ప్రధాన కారణం దీని ఆకర్షణీయమైన డిజైన్, కెమెరా క్వాలిటీ, అధిక బ్యాటరీ లైఫ్, వేగవంతమైన చార్జింగ్ మరియు తక్కువ ధర.
మోటరోలా స్మార్ట్‌ఫోన్లపై భారత మార్కెట్‌లో ఉన్న నమ్మకం, అలాగే ఈ కొత్త ఆఫర్ల వల్ల Edge 60 Fusion మోడల్ మరింత ప్రజాదరణ పొందే అవకాశముంది.


