Motorola Edge 70 Smartphone Price and Specifications: దేశీయ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ మోటరోలా గ్లోబల్ మార్కెట్‌లోకి మరో కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది. మోటరోలా ఎడ్జ్ 70 పేరుతో దీన్ని ఆవిష్కరించింది. మోటో తొలిసారిగా వైర్‌లెస్ ఛార్జింగ్ వంటి అద్భుతమైన ఫీచర్‌ను దీనిలో పరిచయం చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7వ జెన్ 4 చిప్‌సెట్‌తో నడుస్తుంది. 6.67 అంగుళాల pOLED డిస్ప్లే, 50-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది. దీనిలో 68W వైర్డ్ ఛార్జింగ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ గల 4,800mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీని అందించింది. ఈ ఫీచర్లతో భారత మార్కెట్ను షేక్ చేసేందుకు సిద్ధమవుతోంది. మోటరోలా ఎడ్జ్ 70 ఫీచర్లు, ఆఫర్లు, స్పెసిఫికేషన్ల వివరాలపై ఓలుక్కేద్దాం.
మోటరోలా ఎడ్జ్ 70 ధర
మోటరోలా ఎడ్జ్ 70 స్మార్ట్‌ఫోన్ ప్రీమియం ధరలోనే లభించనుంది. అయితే, దీనిలోని ఫీచర్లు యాపిల్ ఐఫోన్ తలదన్నేలా ఉంటాయని తెలుస్తోంది. త్వరలోనే భారత మార్కెట్‌లోకి సుమారు రూ. 80,000 ధర వద్ద విడుదల కానుంది. ఈ ఫోన్ త్వరలోనే యూరప్, మిడిల్ ఈస్ట్‌లో సుమారు రూ.81,000 ధర వద్ద త్వరలోనే మార్కెట్‌లోకి రానుంది. ఈ స్మార్ట్‌ఫోన్ పాంటోన్ బ్రాంజ్ గ్రీన్, పాంటోన్ లిల్లీ ప్యాడ్, గాడ్జెట్ గ్రే కలర్ ఆప్షన్లలో లభించనుంది.
మోటరోలా ఎడ్జ్ 70 స్పెసిఫికేషన్లు
మోటరోలా ఎడ్జ్ 70 స్మార్ట్‌ఫోన్ 6.67 అంగుళాల pOLED సూపర్ హెచ్‌డీ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ డిస్‌ప్లే 1220×2712 పిక్సెల్‌ల రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 4,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 446ppi పిక్సెల్ డెన్సిటీతో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7వ జెన్ 4 చిప్‌సెట్ ద్వారా పనిచేస్తుంది. ఇది 12 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్‌ని కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. ఇక, కెమెరా సెటప్ విషయానికొస్తే.. మోటరోలా ఎడ్జ్ 70లో ఓఐఎస్ సపోర్ట్‌తో కూడిన 50 మెగాపిక్సెల్ ప్రైమరీ రియర్ కెమెరా, 50 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరాను అందించింది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం దీనిలో 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. కనెక్టివిటీ ఆప్షన్ల విషయానికి వస్తే.. 5జీ, బ్లూటూత్, జీపీఎస్, A-జీపీఎస్, GLONASS, LTEPP, గెలీలియో, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సీ పోర్ట్, వైఫై 6ఈ వంటివి చేర్చింది. ఇక, భద్రత విషయానికి వస్తే.. దీనిలో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్ అందించింది. వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్సీ కోసం IP68 + IP69 రేటింగ్‌తో కూడిన డిస్‌ప్లేను చేర్చింది. ఈ స్మార్ట్‌ఫోన్ 68W వైర్డు, 15W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు మద్దతు ఇచ్చే 4,800mAh బ్యాటరీతో పనిచేస్తుంది.


