Nano Banana AI Perplexity Whatsapp: గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో నానో బనానా హవా ట్రెండ్ సృష్టిస్తోంది. గూగుల్ తీసుకొచ్చిన ఈ ఏఐ సాయంతో యూజర్లు తమ తమ ఫొటోలను తమకు నచ్చిన విధంగా మార్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మరో ఏఐ కంపెనీ పర్‌ప్లెక్సిటీ కూడా ఈ తరహా ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫీచర్‌ను వాట్సప్‌లో వినియోగించుకునే సదుపాయాన్ని సంస్థ కల్పించింది. ‘నానో బనానా ఇకపై పర్‌ప్లెక్సిటీ వాట్సప్ బాట్’లోనూ అంటూ సంస్థ సీఈఓ, కో ఫౌండర్ అరవింద్ శ్రీనివాస్ ‘X’లో పోస్ట్ చేశారు.
Nano banana just dropped on Perplexity 🍌
Generate or edit any image using the highest-quality model directly on WhatsApp
Message +1 (833) 436-3285 to start pic.twitter.com/MrOY0wePHS
— Ask Perplexity (@AskPerplexity) September 18, 2025
ఇక ఫీచర్ విషయానికొస్తే వాట్సప్ బాట్‌లో నానో బనానా తరహా ఇమేజ్‌లను ఎడిట్ చేసుకునేందుకు పర్‌ప్లెక్సిటీ ప్రత్యేక నంబర్‌ను తీసుకొచ్చింది. +1(833) 436 3285 నంబర్‌ను కేటాయించింది. జెమిని ఏఐలో ఏ విధంగా ఇమేజ్‌లను ప్రాంప్ట్ ఇచ్చి ఎడిట్ చేసుకుంటామో అదే విధంగా ఈ వాట్సప్ బాట్ ద్వారా ఇమేజ్‌లను ఎడిట్ చేసుకోవచ్చు. మీ ప్రాంప్ట్ ఆధారంగా ఇమేజ్ క్వాలిటీ, డీటెయిల్స్ ఆధరపడి ఉంటాయి. సాధారణ చాట్ ద్వారా హాయ్ అని చెప్పి ప్రారంభించవచ్చు.
అయితే నానో బనానా ఏఐ అనేది జెమిని 2.5 ప్రోలో భాగం. ఆ స్థాయిలో పర్‌ప్లెక్సిటీ ఫలితాన్ని ఇవ్వలేకపోవచ్చు. ఒకవేళ ఆ స్థాయిలో రిజల్ట్ కావాలనుకుంటే పర్‌ప్లెక్సిటీ ప్రోను యూజర్లు సబ్‌స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది. కాగా, టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్‌తో పర్‌ప్లెక్సిటీ సంస్థ జత కట్టింది. మీరు ఎయిర్‌టెల్ యూజర్లు అయితే దీని ద్వారా ప్రో సబ్‌స్క్రిప్షన్‌ను 12 నెలల పాటు ఉచితంగా పొందవచ్చు.


