Moto G06 Power Features Leak: ప్రముఖ బ్రాండ్ మోటోరోలా ఇండియాలో తన కస్టమర్ల కోసం సరికొత్త మొబైల్ ను లాంచ్ చేయనుంది. కంపెనీ దీని మోటో G06 పవర్ పేరిట తీసుకురానుంది. ఇది కంపెనీ అత్యంత శక్తివంతమైన ఫోన్ కానుంది. మోటోరోలా IFA 2025 ఈవెంట్‌లో మోటో G06 పవర్‌ను ఆవిష్కరించింది. ఇది మోటో G సిరీస్‌లో కంపెనీ మొదటి పవర్ వేరియంట్‌ను సూచిస్తుంది.
ఫోన్ అతిపెద్ద హైలైట్ ఏంటంటే? ఇది 7000mAh బిగ్ బ్యాటరీతో రానుంది. ఇది వినియోగదారులు ఛార్జ్ అవసరం లేకుండా ఎక్కువ సమయం వాడడానికి వీలు కల్పిస్తుంది. కంపెనీ ఈ పరికరం లాంచ్ తేదీ, ధర ఇంకా అధికారికంగా ప్రకటించబడనప్పటికీ, అధికారిక టీజర్ పోస్టర్‌ను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. దీంతో ఫోన్ త్వరలో ఇండియాలో లాంచ్ అవ్వనున్నట్లు అర్థమవుతుంది. మోటో G06 పవర్ బడ్జెట్, మధ్య-శ్రేణి విభాగాలలో బలమైన పోటీ ఇస్తుంది.
లీకైన ఫీచర్లు
డిస్ప్లే గురించి చెప్పాలంటే, ఈ పరికరం 120Hz రిఫ్రెష్ రేట్ తో 6.88-అంగుళాల HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది స్క్రోలింగ్, యాప్‌లను ఓపెన్, క్లోజ్ చేయడం సులభంగా చేస్తుంది. స్క్రీన్ రక్షణ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 అందించనున్నారు. పనితీరు విషయానికి వస్తే, ఈ పరికరం మీడియాటెక్ హీలియో G81 ఎక్స్‌ట్రీమ్ చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుంది. ర్యామ్/స్టోరేజ్ ఎంపికలు 4GBRAM+64GB స్టోరేజ్ వేరియంట్ల నుంచి మొదలు అవుతాయి. నిల్వను మైక్రో SD కార్డ్ ద్వారా విస్తరించవచ్చు.
ఫోటోలు, వీడియోల కోసం..ఇది f/1.8 ఎపర్చర్‌తో 50MP ప్రధాన వెనుక కెమెరా, ముందు భాగంలో 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. రాత్రి లేదా తక్కువ లైట్ లో తీసిన ఫోటోలను మెరుగుపరచడానికి సహాయపడే AI సాధనాలు కూడా ఉన్నాయి. ఈ మోటో పరికరం 7000mAh బిగ్ బ్యాటరీతో 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఇది వినియోగదారులు ఛార్జ్ అవసరం లేకుండా ఎక్కువ సమయం వాడడానికి వీలు కల్పిస్తుంది. ఇతర ఫీచర్లలో డ్యూయల్-సిమ్ సపోర్ట్, USB టైప్-సి పోర్ట్, బ్లూటూత్, NFC, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, IP64 రేటింగ్ ఉన్నాయి. అంటే ఫోన్ వాటర్, డస్ట్ నుండి రక్షించబడుతుంది.


