Sunday, February 8, 2026
Homeటెక్నాలజీIT sector: ఐటీ రంగానికి కొత్త ఊపు.. ఈ ఏడాది కొత్తగా 1.25 లక్షల మందికి...

IT sector: ఐటీ రంగానికి కొత్త ఊపు.. ఈ ఏడాది కొత్తగా 1.25 లక్షల మందికి ఉద్యోగాలు

New impetus for the IT sector: గత కొంతకాలంగా ఒడిదొడుకులు ఎదుర్కొంటోన్న ఐటీ రంగానికి ఈ ఏడాది కలిసి రానుంది. వరుస లేఆఫ్‌లతో ఆందోళనలో ఉన్న ఉద్యోగులకు ఇది గుడ్‌న్యూస్‌గా చెప్పవచ్చు. ఏఐ రాకతో ఖర్చులు తగ్గించుకోవడం కోసం బడా కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తూ వస్తున్నాయి. అయితే, ఈ ఏడాది మాత్రం టెక్ రంగానికి భారీగా కలిసి రానుంది. ఐటీ కంపెనీల్లో పెద్ద ఎత్తున నియామకాలు పెరగనున్నాయి. 2025తో పోలిస్తే ఈ ఏడాది 12 నుంచి 15 శాతం పెరిగే ఛాన్స్ ఉందని వర్క్‌ఫోర్స్‌ సొల్యూషన్స్‌ సంస్థ అడెకో ఇండియా పేర్కొంది. శాశ్వత, తాత్కాలిక , కాంట్రాక్టు ఆధారంగా దాదాపు 1.25 లక్షల మందికి కొత్త ఉద్యోగాలు వస్తాయని ఈ సంస్థ వెల్లడించింది. అనేక కంపెనీలు సైతం తమ బిజినెస్‌లో కీలక మార్పులు చేయనున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), డేటా ఇంజినీరింగ్, సైబర్ సెక్యూరిటీ లాంటి విభాగాలను తమ వ్యాపారాల్లో వినియోగించనున్నాయి. దీనివల్ల 2026లో టెక్‌ నియామకాలు పెరగనున్నట్లు అడెకో ఇండియా పేర్కొంది. దీని గురించి ఆ సంస్థ డైరెక్టర్ కమ్‌ బిజినెస్ హెడ్‌ సంకేత్ మాట్లాడుతూ.. 2023-24 మధ్య నెలకొన్న అనిశ్చితి తర్వాత ఏఐ ఇంజినీరింగ్,సైబర్‌ సెక్యూరిటీ, క్లౌడ్‌ ట్రాన్స్‌ఫర్మేషన్, డేటా ప్లాట్‌ఫామ్స్‌ ఆధునికీకరణ లాంటి విభాగాల్లో డిమాండ్ పెరుగుతూ వస్తోందని తెలిపారు. కంపెనీలు క్రమంగా పునరుద్ధరణ దిశగా సాగుతున్నాయన్నారు. మళ్లీ కొత్త ఉద్యోగులకు రిక్రూట్‌మెంట్‌ను ప్రారంభిస్తున్నామన్నారు.

- Advertisement -

ఏఐలో 51 శాతం పెరిగిన డిమాండ్..

ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ (ఏఐ), డేటా, సైబర్‌ సెక్యూరిటీ లాంటి నూతన టెక్నాలజీ కంపెనీలకు ప్రధానంగా మారింది. ఈ విభాగాల్లో 51 శాతం డిమాండ్‌ పెరిగినట్లు అడెకో ఇండియా తెలిపింది. దాదాపు 40 శాతం పెద్ద సంస్థలు జనరేటివ్ ఏఐ ప్రాజెక్టులను కార్యరూపంలోకి తీసుకొచ్చాయి. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (జేసీసీ) సైబర్‌ సెక్యూరిటీకి అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. టెక్‌ ఏతర రంగాలు ఆటోమేషన్‌ను వేగం చేసేందుకు భారీగా టెక్ సిబ్బందిని నియమించుకుంటున్నాయి. ఓవైపు, ఉద్యోగాలు పెరుగుతున్నప్పటికీ మరోవైపు కంపెనీకి అవసరమైన నిపుణల కొరత ఏర్పడనుంది. 2025 నాటికి నైపుణ్యాల లోటు 44 శాతానికి చేరింది. దీంతో నైపుణ్యం ఉన్న అభ్యర్థులకు భారీ డిమాండ్‌ పెరగింది. వేతన ప్యాకేజీలు 2024తో పోల్చి చూస్తే సగటున 18 శాతం పెరగనున్నాయి. ఇక ఏఐ, సైబర్ సెక్యూరిటీ, డేటా ఇంజినీరింగ్ లాంటి విభాగాల్లో 45 శాతం నైపుణ్య లోటు ఉంది. టెక్‌ ఆధారిత నియామకాలు బ్యాంకింగ్, ఫైనాన్స్, బీమా, లాజిస్టిక్స్, ఆరోగ్య సంరక్షణ, తయారీ రంగాల్లో పెరగనున్నాయి. టెక్‌ ఉద్యోగాల్లో ఈ రంగాల వాటా 38 శాతం ఉన్నట్లు అడెకో ఇండియా వెల్లడించింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News