New Aadhaar app : యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) కొత్త ఆధార్ యాప్‌ను రిలీజ్ చేసింది. ఇది ఆండ్రాయిడ్, iOS యూజర్లకు అందుబాటులో ఉంది. ఇకపై ఆధార్ కార్డు మరచిపోయినా ఇబ్బంది లేదు. ఫోన్‌లోనే డిజిటల్‌గా భద్రపరచుకోవచ్చు. QR కోడ్‌తో సులభంగా షేర్ చేయవచ్చు. ఫేస్ స్కాన్‌తో ధృవీకరణ, బయోమెట్రిక్ లాక్/అన్‌లాక్ ఫీచర్లు ఉన్నాయి. ఇది ఇప్పటివరకూ ఉన్న Aadhaar యాప్‌ను రీప్లేస్ చేయదు, కానీ మరింత సులభతరం చేస్తుంది.
ALSO READ: Jubilee Hills: బస్తీల్లో ఏరులై పారుతున్న మద్యం.. ఎన్నికల అధికారికి బీఆర్ఎస్ ఫిర్యాదు
యాప్ డౌన్‌లోడ్ ఎలా?
గూగుల్ ప్లే స్టోర్ లేదా యాప్‌ల్ స్టోర్‌లో “Aadhaar” సెర్చ్ చేసి డౌన్‌లోడ్ చేసుకోండి. ఇది ఉచితం. మొదట మొబైల్ నంబర్‌తో రిజిస్టర్ చేసి, OTPతో వెరిఫై చేయండి. ఆధార్ నంబర్ లింక్ చేస్తే పూర్తి యాక్సెస్ వస్తుంది. యాప్ సైజ్ 50MB మాత్రమే, సులభంగా ఇన్‌స్టాల్ అవుతుంది.
ముఖ్య ఫీచర్లు
1. QR కోడ్ షేరింగ్: ఆధార్ కార్డు QR కోడ్‌ను జనరేట్ చేసి, ఫోటో/షేర్ చేయవచ్చు. మాస్కింగ్ ఆప్షన్‌తో సెన్సిటివ్ డేటా (అడ్రస్, ఫోటో) హైడ్ చేయవచ్చు. ఇకపై బ్యాంకులు, గవ. ఆఫీసుల్లో పేపర్ కార్డు అవసరం లేదు.
2. ఫేస్ ఆథెంటికేషన్: AI ఫేస్ స్కాన్‌తో లాగిన్, వెరిఫికేషన్. ఫింగర్‌ప్రింట్/ఐరిస్ కాకుండా సులభం.
3. ఫ్యామిలీ స్టోరేజ్: 5 మంది కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులు ఒకే యాప్‌లో సేవ్ చేయవచ్చు. డిజిటల్ వాల్ట్‌లా పని చేస్తుంది.
4. ప్రైవసీ కంట్రోల్: ఏమి షేర్ చేయాలో మీరు ఎంచుకోవచ్చు. బయోమెట్రిక్ డేటా లాక్ చేసి, అన్‌లాక్ చేయవచ్చు. ఎక్కడ, ఎప్పుడు ఆధార్ ఉపయోగించామో చూడవచ్చు.
5. ఇతర సేవలు: ఆధార్ అప్‌డేట్, లాక్/అన్‌లాక్, ఈ-ఆధార్ డౌన్‌లోడ్. UPI, బ్యాంకింగ్‌లో ఇంటిగ్రేషన్.
ప్రయోజనాలు
ఇకపై ఆధార్ కార్డు మరచిపోయినా ఇబ్బంది లేదు. ఫోన్‌లోనే డిజిటల్ కార్డు, సురక్షిత షేరింగ్. పేపర్ కార్డు లాస్ట్ అయినా సమస్య లేదు. 140 కోట్ల మంది ఆధార్ యూజర్లకు సౌకర్యం. ‘డిజిటల్ ఇండియా’ లక్ష్యానికి అనుగుణంగా రూపొందించారు. యాప్ డేటా ఎన్‌క్రిప్టెడ్‌గా ఉంటుంది, ప్రైవసీ సేఫ్. డౌన్‌లోడ్ చేసి ట్రై చేయండి. మీ అనుభవాలు షేర్ చేయండి!


