Nokia QLED Smart TV Features and Price: ప్రముఖ ఎలక్ట్రానిక్ బ్రాండ్ నోకియా స్మార్ట్ ఫోన్లే కాదు, క్రేజీ స్మార్ట్ టీవీలను కూడా పరిచయం చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా 50 ఇంచుల క్యూఎల్‌ఈడీ స్మార్ట్ టీవీలను భారతీయ మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఇది క్యూఎల్‌ఈడడీ ప్యానెల్‌తో 4కే రెజల్యూషన్, డాల్బీ ఆట్మాస్ సౌండ్, ఆండ్రాయిడ్ ఓఎస్ వంటి అదిరిపోయే ఫీచర్లతో వస్తుంది. ఈ-కామర్స్ సైట్లు ఫ్లిప్ కార్ట్, అమెజాన్, సహా ఆఫ్‌లైన్ స్టోర్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం నోకియా స్మార్ట్ టీవీ ధరలు రూ.49,999 నుంచి రూ.69,999 మధ్య ఉన్నాయి. స్మార్ట్ టీవీల ఫీచర్లు, ధర వివరాలపై ఓలుక్కేద్దాం.
నోకియా క్యూఎల్‌ఈడీ స్మార్ట్‌టీవీ ఫీచర్లు
నోకియా క్యూఎల్‌ఈడీ స్మార్ట్‌టీవీ 50 ఇంచుల(127 cm)తో వస్తుంది. ఇది క్యూఎల్‌ఈడీ ప్యానెల్‌ను కలిగి ఉంటుంది. 4K UHD (3840 x 2160 పిక్సెల్స్)తో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీ 60 Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుంది. ఎంఈఎంసీ టెక్నాలజీతో స్మూత్ మోషన్‌తో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీ రెండు స్పీకర్లును కలిగి ఉంటుంది. జేబీఎల్ సౌండ్, హర్మాన్ ఆడియో ఈఎఫ్ఎక్స్, 360° సరౌండ్ సౌండ్, డాల్బీ ఆట్మాస్, 60W+ ఔట్ పుట్‌ను కలిగి ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ 11, గూగుల్ అసిస్టంట్, క్రోమ్‌కాస్ట్, నెట్‌ఫ్లిక్స్/ ప్రైమ్/యూట్యూబ్ హాట్ కీలు, ఫాస్ట్‌కాస్ట్ అప్ ఆప్షన్స్‌ను కలిగి ఉంటుంది. ఇక, కనెక్టివిటీ ఆప్షన్ల విషయానికి వస్తే.. 3 HDMI, 2 USB, డ్యూయల్ బ్యాండ్ వైఫై (2.4/5 GHz), బ్లూటూత్ 5.0, ఈథర్‌నెట్ ఆప్షన్లతో వస్తుంది. ఇది డాల్బీ విజన్, HDR10, HLG వైడ్ కలర్ గాముట్ (WCG), ఇంటెలిజెంట్ డిమ్మింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఇది క్వాడ్ కోర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్‌తో వస్తుంది. ఈ డివైజ్ బెజెల్-లెస్, వాల్ మౌంట్ సపోర్ట్, రిమోట్ వాయిస్ కంట్రోల్స్‌ను కలిగి ఉంటుంది. ఈ టీవీ 4K స్ట్రీమింగ్.. ఐడియల్, QLED టెక్నాలజీతో కలర్స్ వైబ్రెంట్‌గా, బ్లాక్స్ డీప్‌గా ఉంటాయి. ఈ స్మార్ట్‌టీవీ గేమింగ్/మూవీస్‌కు అనుకూలంగా ఉంటుంది.
నోకియా క్యూఎల్‌ఈడీ స్మార్ట్‌టీవీ ధరలు..
ఫ్లిప్ కార్ట్‌లో రూ. 49,999 అమెజాన్/స్మార్ట్ ప్రిక్స్‌లో రూ. 59,999 నుంచి రూ. 69,999 మధ్య ఉంటుంది. ఇక, ఆఫ్ లైన్‌లో అయితే రూ. 55,000 నుంచి రూ. 65,000 మధ్య ఉంటుంది. ఆన్‌లైన్‌లో అయితే ఫ్లిప్‌కార్ట్ లేదా అమెజాన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఆఫ్‌లైన్‌లో అయితే క్రోమా/రిలయన్స్ డిజిటల్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఉచిత డెలివరీ/ఇన్‌స్టాలేషన్ సదుపాయం ఉంటుంది. ఈ స్మార్ట్‌టీవీపై ఏడాది పాటు వ్యారంటీ లభిస్తుంది.

