Thursday, March 12, 2026
Homeటెక్నాలజీNothing Phone 2 Pro: అసలైన వాలెంటైన్స్ డే ఆఫర్ అంటే ఇదే.. నథింగ్ ఫోన్...

Nothing Phone 2 Pro: అసలైన వాలెంటైన్స్ డే ఆఫర్ అంటే ఇదే.. నథింగ్ ఫోన్ 2 ప్రో పై బిగ్ డిస్కౌంట్!

Nothing Phone 2 Pro Discount: చాలారోజుల నుంచి కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నవారికి గుడ్ న్యూస్! ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ వాలెంటైన్స్ వీక్ సందర్భంగా తన వాలెంటైన్స్ సేల్‌ను ప్రారంభించింది. ఈ సేల్ సమయంలో నథింగ్ ఫోన్ 2 ప్రో గణనీయమైన తగ్గింపుతో అందుబాటులో ఉంది. ప్రత్యేకమైన డిజైన్, శక్తివంతమైన ఫీచర్లతో ఉన్న ఈ ఫోన్ ఇప్పుడు గతంలో కంటే తక్కువ ధరకే అందుబాటులో ఉంది. ఏకంగా రూ.5000 తగ్గింపుతో కొనుగోలుకు రెడీ గా ఉంది. అదనంగా ఈ ఫోన్ పై క్రెడిట్ కార్డు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లను కూడా పొందవచ్చు. తద్వారా ఈ ఫోన్ ధర మరింత తగ్గుతుంది. ఇప్పుడు ఈ ఫోన్ పై ఉన్న ఆఫర్స్, ఫోన్ ఫీచర్ల గురించి పూర్తిగా తెలుసుకుందాం.

- Advertisement -

నథింగ్ ఫోన్ 2 ప్రో- ఆఫర్

నథింగ్ ఫోన్ 2 ప్రో 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ లాంచ్ సమయంలో అసలు ధర రూ.22,999. అయితే, ప్రస్తుతం ఫ్లయ్ కార్ట్ లో ఏకంగా రూ. 5000 డిస్కౌంట్ తో రూ.17,999కే కొనుగోలుకు అందుబాటులో ఉంది. అదనంగా కెనరా బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లతో కొనుగోలు చేస్తే, రూ.1,000 తగ్గింపు లభిస్తుంది. దీంతో ఈ ఫోన్ ధర రూ.16,999కి తగ్గుతుంది. ఇతర బ్యాంక్ కార్డ్‌లపై సుమారు రూ.500 తగ్గింపు పొందవచ్చు. అంతేకాదు, ఈ ఫోన్ పై రూ.17,400 ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది. కాకపోతే, ఎక్స్ఛేంజ్ విలువ పాత ఫోన్ మోడల్, కండిషన్ పై ఆధారపడి ఉంటుంది. ఒకేసారి మొత్తం డబ్బులు చెల్లించకూడదంటే నెలకు రూ.852 నుండి ప్రారంభమయ్యే EMI తో కొనుగోలు చేయవచ్చు. దాదాపు 24 నెలలు EMI కట్టాల్సి ఉంటుంది. అయితే, EMIలో మొత్తం ధర దాదాపు రూ.20,436 ఉంటుంది. ఇది పూర్తిగా కొనుగోలు చేయడం కంటే చాలా ఖరీదైనది.

also read:

నథింగ్ ఫోన్ 2 ప్రో- ఫీచర్లు

డిస్ప్లే, పనితీరు
6.77-అంగుళాల ఆమోలెడ్ LTPS డిస్ప్లే
120Hz రిఫ్రెష్ రేట్
మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రో ప్రాసెసర్
8GB ర్యామ్, 256GB స్టోరేజీ

కెమెరా, బ్యాటరీ
వెనుక కెమెరా: 50MP + 50MP + 8MP ట్రిపుల్ సెటప్
ముందు కెమెరా: 16MP
బ్యాటరీ: 5,000mAh
ఛార్జింగ్: 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్.

నోట్: ఆఫర్లు ప్రతిరోజూ మారవచ్చు. మీరు కొత్త ఆఫర్‌లను ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి. ఆఫర్లకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడూ మారుతుంటాయని గమనించాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News