Thursday, January 15, 2026
Homeటెక్నాలజీNothing Phone 3: నథింగ్ ఫోన్ 3 ధర తగ్గిందోచ్.. ఏకంగా రూ.20వేలు డిస్కౌంట్!

Nothing Phone 3: నథింగ్ ఫోన్ 3 ధర తగ్గిందోచ్.. ఏకంగా రూ.20వేలు డిస్కౌంట్!

Nothing Phone (3) Offer: ప్రీమియం స్మార్ట్‌ఫోన్ కొనాలని ఆలోచిస్తున్నారా..? అయితే, మీకో గుడ్ న్యూస్! నథింగ్ ఫోన్ 3 భారీ డిస్కౌంట్ తో అందుబాటులో ఉంది. నథింగ్ ఫోన్ 3 ఇటివల భారత మార్కెట్లో విడుదల అయినా విషయం తెలిసిందే. అయితే, లాంచ్ అయిన కొన్ని రోజులకే ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో దాదాపు రూ.20,000 భారీ తగ్గింపుతో రావడం విశేషం. ఇటువంటి పరిస్థితిలో ఈ ప్రీమియం పరికరాన్ని కేవలం రూ.59,999కి కొనుగోలు చేయవచ్చు. అయితే, ఈ తగ్గింపు ప్రయోజనాన్ని ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం.

- Advertisement -

Nothing Phone (3) ఆఫర్:

నథింగ్ ఫోన్ 3 లాంచ్ సమయంలో నథింగ్ ఫోన్ 3 (256GB వేరియంట్) అసలు ధర రూ.79,999గా నిర్ణయించారు. కానీ, ఇప్పుడు దీనిపై ఫ్లిప్‌కార్ట్‌లో రెండు గొప్ప ఆఫర్‌లు అందుబాటులో ఉన్నాయి. ICICI , IDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ల ద్వారా కొనుగోలు చేస్తే కస్టమర్‌లు రూ.10,000 ప్రత్యక్ష తగ్గింపును పొందొచ్చు. దీనితో పాటు, పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ పై రూ.10,000 వరకు అదనపు ట్రేడ్-ఇన్ బోనస్ అందించారు. రెండు ఆఫర్‌ల ద్వారా నథింగ్ ఫోన్ 3 కొనుగోలు చేస్తే కస్టమర్‌లు మొత్తం రూ. 20,000 వరకు ఆదా చేసుకోవచ్చు. దీంతో ప్రభావవంతమైన ధర దాదాపు రూ. 59,999కి చేరుకుంటుంది.

Also Read: 5G Smartphones Under 10K: రూ.10 వేల లోపు బెస్ట్ 5G స్మార్ట్ ఫోన్ కొనాలా..? లిస్ట్, ధర, స్పెసిఫికేషన్లు ఇవే..

Nothing Phone (3) స్పెసిఫికేషన్లు:

భారత మొబైల్ మార్కెట్లో నథింగ్ ఫోన్ 3 దాని ప్రత్యేకమైన డిజైన్, శక్తివంతమైన పనితీరు కోసం తనదైన ముద్ర వేస్తోంది. ఈ ఫోన్ వెనుక ప్యానెల్ కొత్త గ్లిఫ్ మ్యాట్రిక్స్ స్క్రీన్‌తో వస్తుంది. ఈ పరికరం 1.5K రిజల్యూషన్‌తో 6.67-అంగుళాల AMOLED డిస్‌ప్లేతో వస్తోంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 4500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌కు సపోర్ట్ ఇస్తుంది. స్క్రీన్‌ను రక్షణ కోసం ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7iని కలిగి ఉంది.

నథింగ్ ఫోన్ 3 పరికరం క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8s Gen 4 చిప్‌సెట్ ను అమర్చారు. దీని క్లాక్ స్పీడ్ 3.2GHz వరకు పెరుగుతుంది. ఇది అడ్రినో 825 GPU, 16GB వరకు RAM, 512GB వరకు నిల్వను కలిగి ఉంది. ఇక కేమెరా విషయానికి వస్తే..ఈ ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ లో 50MP ప్రైమరీ కెమెరా, 50MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ (3x ఆప్టికల్ జూమ్), 50MP అల్ట్రా-వైడ్ కెమెరా లెన్స్ తీసుకొచ్చారు. ఇక సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం.. పరికరం ముందు భాగంలో 50MP హై-రిజల్యూషన్ సెల్ఫీ కెమెరా అందుబాటులో ఉంది. ఇది 5,500mAh బిగ్ బ్యాటరీతో వస్తున్న ఈ మొబైల్ 65W వైర్డు, 15W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.

నోట్: ఫోన్లపై ఆఫర్లు ప్రతిరోజూ మారవచ్చు. కొత్త ఆఫర్‌లను ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి. ఆఫర్లకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడూ మారుతుంటాయని గమనించాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News