Nothing Phone 3a Lite Launch Date: లండన్‌కు చెందిన స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ నథింగ్ త్వరలో తన సరసమైన ఫోన్‌ను ప్రపంచ మార్కెట్‌లో విడుదల చేయనుంది. తన కొత్త స్మార్ట్‌ఫోన్, నథింగ్ ఫోన్ 3a లైట్‌ను అక్టోబర్ 29న విడుదల చేయనున్నట్లు కంపెనీ అధికారికంగా ధృవీకరించింది. కంపెనీ X (ట్విట్టర్)లో పోస్ట్ ద్వారా ఈ లాంచ్‌ను ప్రకటించింది. లాంచ్ ఈవెంట్ IST సాయంత్రం 6:30 గంటలకు ప్రారంభమవుతుంది.
ఈ ఫోన్ కంపెనీ నథింగ్ ఫోన్ 3 సిరీస్‌కి తాజా అదనంగా ఉంది. ఈ లైనప్‌లో ప్రస్తుతం ఫ్లాగ్‌షిప్ నథింగ్ ఫోన్ 3, ఫోన్ 3a, ఫోన్ 3a ప్రో ఫోన్లు ఉన్నాయి. ఈ నథింగ్ ఫోన్ 3 సిరీస్‌లో ఇది నాల్గో మోడల్. ఈ పరికరం గీక్ బెంచ్, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) సర్టిఫికేషన్ వెబ్‌సైట్లలో కనిపించింది. ఈ నథింగ్ 3a లైట్ డిజైన్ విషయానికి వస్తే..ఇది సిగ్నేచర్ మినిమలిస్ట్, ట్రాన్స్‌పరెంట్ కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఇది ఫ్లాట్ ఎడ్జెస్, సిమెట్రిక్ బెజెల్స్, బ్యాక్ సైడ్ సెంట్రల్ డ్యూయల్ కెమెరా మాడ్యూల్ కలిగి ఉండవచ్చు. ఇంకా, ఈ ఫోన్ గ్లిఫ్ ఎల్ఈడీ ఇంటర్‌ఫేస్‌ను కలిగి ఉండొచ్చు.
also read:Oppo Find X8 Pro Discount: ఈ ఒప్పో ప్రీమియం 5G ఫోన్ పై ఏకంగా రూ.13 వేల డిస్కౌంట్!
కంపెనీ ఇంకా అధికారికంగా ఫీచర్లు అలాగే ధరను వెల్లడించనప్పటికీ, పరిశ్రమ వర్గాల నుంచి లీకైన సమాచారం ప్రకారం..ఈ ఫోన్ ఫీచర్లు చూస్తే.. నథింగ్ ఫోన్ 3a లైట్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందే అవకాశం ఉంటుంది. ఇది 2.50GHz వద్ద క్లాక్ చేయబడిన నాలుగు హై-పెర్ఫార్మెన్స్ కోర్లు, 2.0GHz వద్ద క్లాక్ చేయబడిన నాలుగు ఎఫిషియెన్సీ కోర్లతో కూడిన ఆక్టా-కోర్ చిప్‌సెట్. ఈ ఫోన్‌లో మాలి-G615 MC2 GPU, 8GB RAM ఉంటాయి. ఇది సున్నితమైన గేమింగ్, మల్టీ టాస్కింగ్ అనుభవాన్ని అందిస్తుంది.
నథింగ్ ఫోన్ 3a లైట్ 8GB RAM, 128GB స్టోరేజ్‌తో ఒకే వేరియంట్‌లో రాబోతోందని సమాచారం. ఈ ఫోన్ వైట్, బ్లాక్ వంటి రెండు రంగుల ఎంపికల లభించనుంది. బ్యాటరీ గురించి మాట్లాడితే..ఈ నథింగ్ ఫోన్ 5000mAh బ్యాటరీతో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. కెమెరాల విషయానికొస్తే.. డ్యూయల్ 50MP సెటప్, ప్రైమరీ, సింగిల్ టెలిఫోటో లెన్స్ సూచిస్తున్నాయి. ఈ ఫోన్ ధర నథింగ్ ఫోన్ 3a కంటే తక్కువగా ఉంటుందని సమాచారం. ఈ ఏడాది మార్చిలో లాంచ్ అయినా నథింగ్ ఫోన్ 3a ధర రూ.22,999 కంటే లైట్ వెర్షన్ ధర దీనికంటే తక్కువగా ఉండొచ్చని అంచనా. ఇది బడ్జెట్ విభాగంలో బలమైన ఎంపిక అవుతుంది.


