Nothing Phone 3a Smartphone: పండుగ సీజన్ రావడంతో ఫ్లిప్‌కార్ట్ ప్రస్తుతం బిగ్ బిలియన్ డేస్ సేల్‌ను నిర్వహిస్తోంది. ఈ సేల్లో స్మార్ట్‌ఫోన్లపై భారీ ఆఫర్ అందిస్తోంది. ఈ సేల్ సమయంలో స్మార్ట్‌ఫోన్లు మాత్రమే కాకుండా, ఫ్యాషన్, ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలపై అద్భుతమైన డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది. రూ. 25 వేలలోపు బెస్ట్ స్మార్ట్ఫోన్ కోసం చూసేవారికి ఈ ఫోన్ బెస్ట్ ఆప్షన్‌గా చెప్పవచ్చు. ఈ ఆఫర్ ద్వారా ఈ ఫోన్ను కేవలం రూ.22,499 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ డిజైన్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. అద్భుతమైన సాఫ్ట్‌వేర్ అనుభవాన్ని అందిస్తుంది. ఫ్లిప్కార్ట్లో ఈ సేల్ వివరాలను పరిశీలిద్దాం.
నథింగ్ ఫోన్ ౩ఏ భారీ డిస్కౌంట్..
ఫ్లిప్‌కార్ట్ సేల్లో నథింగ్ ఫోన్ 3a స్మార్ట్ఫోన్పై భారీ డిస్కౌంట్ లభిస్తుంది. దీని అసలు ధర రూ.27,999 వద్ద ఉండగా..సేల్ సమయంలో దీన్ని కేవలం రూ.23,999 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. అదనంగా, ఈ ఫోన్పై గొప్ప బ్యాంక్ ఆఫర్ కూడా లభిస్తుంది. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ ఆప్షన్ ద్వారా దీనిపై రూ.1500 తగ్గింపు పొందవచ్చు. ఇతర క్రెడిట్, డెబిట్ కార్డ్‌ల ద్వారా అదనంగా మరో రూ.1000 డిస్కౌంట్ను కూడా పొందవచ్చు. అంటే బ్యాంక్ ఆఫర్ తర్వాత, ఈ ఫోన్ ధర కేవలం రూ.22,499 వద్ద లభిస్తుంది. మీరు మీ పాత ఫోన్‌ను మార్చుకోవడం ద్వారా తక్కువ ధరకే దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద భారీ తగ్గింపు లభిస్తుంది. మీ పాత స్మార్ట్ఫోన్ కండీషన్ను బట్టి ఎక్స్ఛేంజ్ ధర ఆధారపడి ఉంటుంది. మీ పాత ఫోన్ స్థితి ఎంత బాగుంటే, మీరు అంత మంచి విలువను పొందవచ్చు.
నథింగ్ ౩ఏ స్పెసిఫికేషన్లు..
స్మార్ట్‌ఫోన్‌లో 6.77 అంగుళాల AMOLED డిస్‌ప్లే ఉంటుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 3000 నిట్‌ల వరకు పీక్ బ్రైట్నెస్‌ను కూడా అందిస్తుంది. ఫోన్ క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 7s Gen 3 చిప్‌సెట్తో పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 50W ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీ ఉంటుంది. ఫోటోగ్రఫీ కోసం, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఈ ఫోన్లో 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్ కెమెరా, 50MP టెలిఫోటో లెన్స్ కెమెరా వంటివ ఉంటాయి. సెల్ఫీల కోసం ప్రత్యేకంగా 32 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. కాగా, నథింగ్ వన్‌ప్లస్ సబ్‌బ్రాండ్‌గా మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ స్మార్ట్ఫోన్లో తక్కువ ధరలోనే ప్రీమియం ఫీచర్లను అందించింది. చాలా స్టైలిష్ లుక్‌తో దీన్ని డిజైన్ చేశారు.


