Friday, July 11, 2025
Homeటెక్నాలజీNvidia Most Valuable Company: షేరు పెరగడంతో వరల్డ్ నం.1గా మారిన ఎన్విడియా

Nvidia Most Valuable Company: షేరు పెరగడంతో వరల్డ్ నం.1గా మారిన ఎన్విడియా

Nvidia world Most Valuable Company: ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీలు అంటే మైక్రోసాఫ్ట్, ఆపిల్ దిగ్గజాలు గుర్తొస్తాయి. కానీ వీటిని తలదన్నేలా మరో కంపెనీ ఎన్విడియా (Nvidia) దూసుకొచ్చింది. ఈ చిప్ తయారీ కంపెనీ ఇప్పుడు కొత్త చరిత్రను రాస్తోంది. ఏఐ (AI) విప్లవాన్ని విజయవంతంగా అందిపుచ్చుకుంటూ, మార్కెట్ విలువ పరంగా ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా అవతరించింది. రెండు రోజుల క్రితం ట్రేడింగ్‌లో ఎన్విడియా షేరు ధర $160.6కి చేరి 2.2 శాతం పెరగడంతో, కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ $3.92 ట్రిలియన్లను తాకింది. ఇది ఇప్పటి వరకు ఉన్న ఇతర దిగ్గజ కంపెనీల మార్కెట్ విలువ కంటే అధికం కావడం గమనార్హం. 2024 డిసెంబర్ 26న యాపిల్ $3.915 ట్రిలియన్ల మార్కెట్ విలువతో అగ్రస్థానంలో నిలిచింది. కానీ తాజాగా ఎన్విడియా ఆ రికార్డును చెరిపేసింది. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ $3.7 ట్రిలియన్‌తో రెండవ స్థానంలో ఉండగా, యాపిల్ $3.19 ట్రిలియన్లతో మూడవ స్థానంలోకి జారిపోయింది.

- Advertisement -

AI టెక్నాలజీలో విప్లవాత్మక మార్పులకు వీలుగా ఉన్న ఎన్విడియా హై-ఎండ్ ప్రాసెసర్లు మైక్రోసాఫ్ట్, అమెజాన్, మెటా, ఆల్ఫాబెట్, టెస్లా లాంటి టెక్ దిగ్గజాలకు కీలకంగా మారాయి. ఈ డిమాండ్ వల్లే ఎన్విడియా స్టాక్‌లు దూసుకెళ్తున్నాయి. “నాలుగు ట్రిలియన్ల మార్కెట్ విలువ గురించి మాట్లాడటం అత్యాశగా అనిపించవచ్చు, కానీ ఇది AIపై పెట్టుబడుల వేగాన్ని తెలియజేస్తోంది” అని థెమిస్ ట్రేడింగ్‌ సహ నిర్వాహకుడు జో సలూజి వ్యాఖ్యానించారు.

గేమింగ్‌ నుంచి AI చిప్ దిగ్గజంగా..

1993లో సహ వ్యవస్థాపడుకుడు జెన్సన్ హువాంగ్ సంస్థ ఎన్విడియా ప్రారంభంలో వీడియో గేమ్ గ్రాఫిక్స్ కోసం GPUలను తయారు చేసింది. కానీ గత నాలుగేళ్లలో ఈ కంపెనీ పునరావిష్కరణతో AI చిప్ పరిశ్రమలో దిగ్గజ సంస్థగా మారింది. 2021లో $500 బిలియన్ల విలువ కలిగిన ఈ కంపెనీ ఇప్పుడు $4 ట్రిలియన్లకు చేరింది. ఈ పెరుగుదల కేవలం స్టాక్ ర్యాలీ వల్లే కాక, సంస్థ ఆదాయ అంచనాల్లో నిలకడగా కనిపిస్తున్న పురోగతిని సూచిస్తుంది.

గ్లోబల్ మార్కెట్లను అధిగమించింది

LSEG డేటా ప్రకారం, ఎన్విడియా విలువ ఇప్పుడు కెనడా మరియు మెక్సికో స్టాక్ మార్కెట్లను కలిపినా, ఆ మొత్తం విలువకన్నా ఎక్కువ ఉంటుంది. అంతేకాక, బ్రిటన్ లో లిస్ట్ అయిన అన్ని కంపెనీల విలువ కంటే కూడా అధికంగా ఉంది. ఈ కంపెనీ షేరు అత్యంత ప్రిమియంలో ట్రేడ్ అవుతోంది. అయినప్పటికీ, ఎన్విడియా ప్రస్తుతం 12 నెలల ప్రొజెక్టెడ్ ఆదాయంతో 32 రెట్లు ట్రేడవుతోంది. ఇది గత ఐదేళ్ల సగటు అయిన 41 కంటే తక్కువ. అంటే ఈ కంపెనీ స్టాక్‌లకు ఉన్న అధిక విలువ వెనుక నిజమైన ఆదాయ వృద్ధి ఉందన్న నమ్మకాన్ని ఇది సూచిస్తోంది.

భవిష్యత్‌కు ఎన్విడియా కీలక డ్రైవర్

AI వృద్ధికి సంబంధించిన పెట్టుబడులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ఎన్విడియా కీలక హార్డ్‌వేర్ సరఫరాదారుగా నిలుస్తోంది. జనవరిలో చైనా స్టార్టప్ డీప్‌సీక్ తక్కువ ఖర్చుతో AI మోడల్‌ను పరిచయం చేయడంతో పెట్టుబడిదారుల్లో ఆందోళన ఏర్పడినా, ఎన్విడియా స్టాక్ మళ్లీ కోలుకొని కొత్త గరిష్ఠాలను తాకుతోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News