Oneplus Pad 3 Launched: ప్రముఖ సంస్థ వన్ ప్లస్ తన కస్టమర్ల కోసం సరికొత్త టాబ్లెట్ ను మార్కెట్లో లాంచ్ చేసింది. కంపెనీ దీని వన్‌ప్లస్ ప్యాడ్ 3 పేరిట తీసుకొచ్చింది. ఇందులో అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. టాబ్లెట్ లో 13.2-అంగుళాల 2K డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్, 16GB వరకు ర్యామ్ ఉంది. చాలా కాలంగా కొత్త ప్రీమియం టాబ్లెట్ కొనాలని ప్లాన్ చేస్తున్నవారికి ఇది ఉత్తమ ఎంపిక అవుతుంది. ఇప్పుడు దీని ధర, ఫీచర్ల వివరాలు తెలుసుకుందాం.
వన్‌ప్లస్ ప్యాడ్ 3 టాబ్లెట్: ధర ఎంత?
ఈ టాబ్లెట్ ధర విషయానికి వస్తే, కంపెనీ 12GB + 256GB బేస్ వేరియంట్ ధర రూ. 47,999గా, 16GB + 512GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 52,999గా పేర్కొంది. ఇది స్టార్మ్ బ్లూ, ఫ్రాస్టెడ్ సిల్వర్ అనే రెండు రంగులలో లభిస్తోంది. లాంచ్ ఆఫర్ కింద, సెప్టెంబర్ 5-7 మధ్య ఈ టాబ్లెట్‌ను కొనుగోలు చేస్తే, రూ. 7,198 విలువైన వన్ ప్లస్ స్టైలో 2, వన్ ప్లస్ ప్యాడ్ ఫోలియో కేస్‌ను ఉచితంగా పొందొచ్చు. అంతేకాకుండా, ఎంపిక చేసిన క్రెడిట్ కార్డులపై కంపెనీ రూ. 5,000 బ్యాంక్ డిస్కౌంట్‌ను కూడా అందిస్తోంది. దీని అమెజాన్, ఫ్లిప్ కార్ట్, వన్ ప్లస్ వెబ్ సైట్, ఆఫ్‌లైన్ స్టోర్‌లలో కొనుగోలు చేయొచ్చు.
Also read: Smart Phones: కేవలం రూ.6999కే..12జీబీ ర్యామ్, 5200mAh బ్యాటరీతో లభించే స్మార్ట్ ఫోన్స్..
వన్‌ప్లస్ ప్యాడ్ 3 టాబ్లెట్: ఫీచర్లు
వన్‌ప్లస్ ప్యాడ్ 3 టాబ్లెట్ 13.2-అంగుళాల 2K డిస్‌ప్లేను పొందుతుంది. 144Hz LCD స్క్రీన్‌తో వస్తుంది. టాబ్లెట్‌ను శక్తివంతం చేయడానికి ఇది స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ను అమర్చారు. ఈ టాబ్లెట్ 16GB వరకు LPDDR5T RAMని పొందుతుంది. క్వాలిటీ సౌండ్ కోసం, ఈ టాబ్లెట్‌లో ఎనిమిది స్పీకర్లు, 4 మిడ్-బాస్ యూనిట్లు, 4 ట్వీటర్ అల్ట్రా-వైడ్‌బ్యాండ్ యూనిట్లు ఉన్నాయి.
ఈ శక్తివంతమైన టాబ్లెట్ ఆండ్రాయిడ్ 15-ఆధారిత ఆక్సిజన్ OS 15తో వస్తుంది. ఈ పరికరం ఓటీపీ వెరిఫికేషన్స్ మెసేజెస్, సెల్యులార్ డేటా షేరింగ్, టెక్స్ట్ మెసేజెస్ కోసం వన్ ప్లస్ ఫోన్‌లకు సపోర్ట్ చేస్తుంది. అంతేకాదు, ఇది కాపీ, పేస్ట్, నోటిఫికేషన్ షేరింగ్, పరికరాల మధ్య ఫైల్ షేరింగ్ కు సహకరిస్తుంది.
కెమెరా విషయానికి వస్తే, దీని వెనుక భాగంలో ఒకే కెమెరా ఉంది. అది 13MP వెనుక కెమెరా. అలాగే, ఈ టాబ్లెట్‌లో 5.97mm సొగసైన మెటల్ యూనిబాడీ డిజైన్‌ను పొందుతుంది. ఫలితంగా ఇది దీనికి ప్రీమియం లుక్ వస్తుంది. ఈ టాబ్లెట్ 12,140mAh బ్యాటరీతో 80W సూపర్‌వూక్ ఛార్జింగ్‌కు కూడా మద్దతు ఇస్తుంది. ఈ టాబ్లెట్ 92 నిమిషాల్లో 100% వరకు ఛార్జ్ చేయగలదని, 10 నిమిషాల ఛార్జింగ్‌లో 18% బ్యాటరీని ఛార్జ్ చేయవచ్చని కంపెనీ చెబుతోంది.


