OnePlus 15R Ace Edition Launch Date: వన్ ప్లస్ 15R ఏస్ ఎడిషన్ ఇండియన్ టెక్ మార్కెట్లో స్టాండర్డ్ వన్ ప్లస్ 15R మోడల్‌తో పాటు లాంచ్ అవుతుందని గురువారం వన్ ప్లస్ ప్రకటించింది. ఇది గతంలో ప్రకటించిన చార్‌కోల్ బ్లాక్, మింట్ గ్రీన్ షేడ్స్‌తో కలిపి వన్ ప్లస్ 15R కోసం మూడవ రంగు ఎంపికగా రాబోతోంది. వన్ ప్లస్ 15R ఎలక్ట్రిక్ వైలెట్ వేరియంట్ ఇతర రెండు రంగు ఎంపికలతో పోలిస్తే కాస్మెటిక్ తేడాలను కలిగి ఉందని నిర్ధారించబడింది. అయితే హ్యాండ్‌సెట్ ప్రధాన ఫీచర్లు మాత్రం అలాగే ఉంటాయి.
వన్ ప్లస్ 15R ఏస్ ఎడిషన్: ఇండియా లాంచ్
వన్ ప్లస్ 15R ఏస్ ఎడిషన్ ఇండియాలో అమెజాన్, వన్‌ప్లస్ ఇండియా వెబ్‌సైట్ ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుందని కంపెనీ ఒక ప్రెస్ నోట్‌లో పేర్కొంది. ఇది డిసెంబర్ 17న ప్రామాణిక వన్‌ప్లస్ 15R, వన్‌ప్లస్ ప్యాడ్ గో 2 లతో పాటు లాంచ్ అవుతుందని వెల్లడించింది. వన్ ప్లస్ 15R ఏస్ ఎడిషన్ ఫైబర్‌గ్లాస్ బ్యాక్ ప్యానెల్‌ను కలిగి ఉంటుంది. ఈ కొత్త రంగు ఎంపిక డిసెంబర్ 3న చైనాలో లాంచ్ అయినా వన్ ప్లస్ ఏస్ 6T ఎలక్ట్రిక్ వైలెట్ షేడ్‌ని పోలి ఉంటుంది.
also read:Motorola Edge 70: మతిపోగోట్టే ఫీచర్లతో మోటరోలా నుంచి అతి సన్నని స్మార్ట్ ఫోన్..లాంచ్ తేదీ ఇదే!
వన్ ప్లస్ 15R ఏస్ ఎడిషన్: ఫీచర్లు(అంచనా)
వన్ ప్లస్ 15R ఏస్ ఎడిషన్ 165Hz రిఫ్రెష్ రేట్‌తో 1.5K AMOLED స్క్రీన్‌ను కలిగి ఉందని భావిస్తున్నారు. కంపెనీ ప్రకారం..హ్యాండ్‌సెట్ 450PPI పిక్సెల్ డెన్సిటీ, 1,800 నిట్‌ల గరిష్ట ప్రకాశాన్ని కలిగి ఉంటుంది. అయితే వన్ ప్లస్ 15R డిస్ప్లే 2 నిట్‌ల నుండి 1,800 నిట్‌ల వరకు బ్రైట్‌నెస్ పరిధిని సపోర్ట్ చేస్తుందని వన్ ప్లస్ చెబుతోంది. ఫ్లాగ్‌షిప్ వన్ ప్లస్ 15 లాగానే వన్ ప్లస్ 15R కూడా కంప్యూటేషనల్ ఫోటోగ్రఫీ కోసం DetailMax ఇంజిన్‌తో వస్తుంది. ఇది అల్ట్రా క్లియర్ మోడ్, క్లియర్ బర్స్ట్, క్లియర్ నైట్ ఇంజిన్ టెక్నాలజీలను కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ కొత్త స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుంది. వన్ ప్లస్ 15R ఈ ప్రాసెసర్‌ను కలిగి ఉన్న మొదటి స్మార్ట్‌ఫోన్ అవుతుంది. ఈ ఫోన్‌లో కొత్త G2 Wi-Fi చిప్, టచ్ రెస్పాన్స్ చిప్ ఉంటాయని కూడా నిర్ధారించబడింది. అయితే ఈ ఫోన్ గురించి మరిన్ని వివరాలు తెలియాలంటే లాంచ్ అయ్యే వరకు వేచి ఉండాల్సిందే!

