Saturday, November 15, 2025
Homeటెక్నాలజీOnePlus Ace 6: వన్ ప్లస్ నుంచి సరికొత్త మొబైల్.. అక్టోబర్ 27న లాంచ్..!?

OnePlus Ace 6: వన్ ప్లస్ నుంచి సరికొత్త మొబైల్.. అక్టోబర్ 27న లాంచ్..!?

OnePlus Ace 6 Features: వన్ ప్లస్ వచ్చే వారం వన్​ప్లస్ ఏస్ 6 5G స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. దీని స్పెసిఫికేషన్లు ఇంకా రహస్యంగానే ఉన్నప్పటికీ చైనాలోని ఆన్‌లైన్ స్టోర్‌లలో వీటిని లిస్ట్ చేశారు. అయితే ఇప్పుడు కంపెనీ ఈ హ్యాండ్‌సెట్ కొన్ని స్పెసిఫికేషన్‌లను ప్రకటించింది. ఈ పరికరం అక్టోబర్ 27న వన్ ప్లస్ 15 స్మార్ట్ ఫోన్ తో మార్కెట్లోకి రానుంది. ఇప్పుడు ఈ పరికరం ధర(అంచనా), ఫీచర్ల(అంచనా) గురించి వివరంగా ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.

- Advertisement -

వన్​ప్లస్ ఏస్ 6 5G ఫీచర్లు(అంచనా)

కంపెనీ ఈ ఆకట్టుకునే పరికరాన్ని అల్ట్రా-పెర్ఫార్మెన్స్ ఫ్లాగ్‌షిప్ పరికరంగా అభివర్ణించింది. చైనీస్ మైక్రో-బ్లాగింగ్ సైట్ వీబోలో పోస్ట్ ద్వారా దాని కొన్ని స్పెసిఫికేషన్‌లను వెల్లడించింది. ఈ పరికరం 165Hz వరకు వేరియబుల్ రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇస్తుందని కంపెనీ పేర్కొంది. దీని వలన ఫోన్ 60Hz, 90Hz, 120Hz, 144Hz, 165Hz రిఫ్రెష్ రేట్‌లకు మద్దతు ఇస్తుంది. అయితే, ఇది అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ స్కానర్‌తో ఫ్లాట్ అమోలేడ్ స్క్రీన్ అవుతుంది.ఈ పరికరం స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుందని లిస్టింగ్ వెల్లడించింది. ఇది ప్రస్తుత ఫ్లాగ్‌షిప్ వన్ ప్లస్ 13లో కూడా కనిపిస్తుంది.

ఈ వన్ ప్లస్ పరికరంలో మెటాలిక్ ఫ్లేమ్ ఉంది. ఇది వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ కోసం ఫోన్ IP66, IP68, IP69, IP69K రేటింగ్‌ను కలిగి ఉంటుంది. ఇక బ్యాటరీ విషయానికి వస్తే, ఇది 7,800mAh బడా బ్యాటరీని కలిగి ఉంటుంది. ఫోన్ 120W ఫాస్ట్ ఛార్జింగ్‌కు కూడా మద్దతు ఇస్తుంది. అయితే, వైర్‌లెస్ ఛార్జింగ్ మద్దతు గురించి కంపెనీ ఎటువంటి సమాచారం అందించలేదు.

లాంచ్, ధర(అంచనా)

కంపెనీ ఇప్పటికే ఫోన్ కొన్ని కలర్ వేరియంట్‌లను టీజ్ చేసింది. ఈ పరికరం మూడు రంగులలో వస్తుందని వెల్లడించింది. బ్లాక్, ఫ్లాష్ వైట్, సిల్వర్. దీని బరువు 213 గ్రాములు ఉండవచ్చు. ఈ ఫోన్ ధర గురుంచి మాట్లాడితే.. ఇది సుమారు రూ.40,000 ఉంటుందని అంచనా. ఈ ఫోన్ అక్టోబర్ 27న సాయంత్రం 4:30 గంటలకు ISTకి లాంచ్ అవుతుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad