OnePlus Ace 6: ప్రముఖ ఫోన్ల తయారీ కంపెనీ వన్ ప్లస్ తన తాజా ఫ్లాగ్‌షిప్ వన్ ప్లస్ 15 ఫోన్ ను చైనా మార్కెట్‌లో రిలీజ్ చేసింది. దీంతో పాటు కంపెనీ మరో కొత్త స్మార్ట్‌ఫోన్ వన్ ప్లస్ ఏస్ 6 ను కూడా లాంచ్ చేసింది. భారత్ సహా గ్లోబల్ మార్కెట్ లో ఈ పరికరం వన్‌ప్లస్ 15R పేరుతో అందుబాటులోకి రానుందని అంచనా. ఈ ఫోన్ గత సంవత్సరం ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్ అయిన క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ SoC ద్వారా శక్తిని పొందుతుంది. 7800mAh భారీ బ్యాటరీతో లాంచ్ అయినా ఈ పరికరం ధర, ఫీచర్ల గురించి వివరంగా తెలుసుకుందాం.
వన్ ప్లస్ ఏస్ 6 ధర, లభ్యత:
కంపెనీ వన్ ప్లస్ ఏస్ 6 పరికరం 12GB + 256GB స్టోరేజ్ వేరియంట్ CNY 2,599 (సుమారు రూ. 32,300) ధరకు లాంచ్ చేసింది. ఇక దీని 16GB + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర CNY 2,899 (సుమారు రూ. 36,000)గా, 12GB + 512GB స్టోరేజ్ వేరియంట్ ధర CNY 3,099 (సుమారు రూ. 38,800)గా, 16GB + 512GB స్టోరేజ్ వేరియంట్ ధర CNY 3,399 (సుమారు రూ. 42,200)గా, 16GB RAM+1TB స్టోరేజ్ వేరియంట్ ధర CNY 3,899 (సుమారు రూ. 48,400)గా నిర్ణయించింది. ఈ పరికరం క్విక్‌సిల్వర్, ఫ్లాష్ వైట్, బ్లాక్ వంటి మూడు రంగుల ఎంపికలలో లభిస్తోంది. కాగా, ఈ ఫోన్ అమ్మకాలు అక్టోబర్ 30 నుండి ప్రారంభమవుతాయి.
also read:Smart Tv Offer: స్టన్నింగ్ డీల్.. కేవలం రూ.6 వేల లోపే స్మార్ట్ టీవీ..డోంట్ మిస్!
వన్ ప్లస్ ఏస్ 6 ఫీచర్లు;
డిస్ప్లే
వన్ ప్లస్ ఏస్ 6 స్మార్ట్‌ఫోన్ 6.83-అంగుళాల 1.5K (1,272 x 2,800 పిక్సెల్‌లు) ఫ్లాట్ అమోలేడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 165Hz వరకు రిఫ్రెష్ రేట్, 5,000 నిట్‌ల గరిష్ట ప్రకాశాన్ని కలిగి ఉంటుంది. ఇది ఇన్-డిస్ప్లే 3D ఫింగర్‌ప్రింట్ స్కానర్‌ను కూడా కలిగి ఉంది.
ప్రాసెసర్
ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుంది. 16GB వరకు LPDDR5X అల్ట్రా RAM, 512GB వరకు UFS 4.1 నిల్వ తో వస్తుంది. గ్రాఫిక్స్ మద్దతు కోసం ఫోన్ G2 గేమింగ్ చిప్‌ను కూడా కలిగి ఉంది.
సాఫ్ట్ వేర్
ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారంగా కలర్ఓఎస్ 16పై నడుస్తుంది.
కెమెరా
ఫోటోగ్రఫీ పరంగా..వన్ ప్లస్ ఏస్ 6 డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. దీని ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్‌లు. ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌కు మద్దతు ఇస్తుంది. దీనికి 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్ కూడా ఉంది. ఈ వన్ ప్లస్ ఫోన్ 16-మెగాపిక్సెల్ ఫ్రంట్-ఫేసింగ్ కెమెరాను కలిగి ఉంది.
బ్యాటరీ
వన్ ప్లస్ ఏస్ 6 స్మార్ట్‌ఫోన్ 7,800mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ విభాగంలో స్మార్ట్‌ఫోన్‌లో అందించే బిగ్ బ్యాటరీ ఇదేనని వన్ ప్లస్ పేర్కొంది. ఫోన్ 120W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. అయితే, వైర్‌లెస్ ఛార్జింగ్ అందుబాటులో లేదు. ఈ వన్ ప్లస్ ఫోన్ IP66 + IP68 + IP69 + IP69K రేటింగ్‌తో డస్ట్, వాటర్ నుంచి సంపూర్ణ రక్షణ అందిస్తుంది.


