Saturday, November 15, 2025
Homeటెక్నాలజీOnePlus Pad Lite: వన్‌ప్లస్ నుంచి కొత్త ట్యాబ్లెట్..ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..?

OnePlus Pad Lite: వన్‌ప్లస్ నుంచి కొత్త ట్యాబ్లెట్..ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..?

OnePlus Pad Lite launched: వన్ ప్లస్ తన కొత్త టాబ్లెట్ ను మార్కెట్లో లాంచ్ చేసింది. కంపెనీ కొత్త టాబ్లెట్ ను OnePlus Pad Lite పేరిట ఎంపిక చేసిన ప్రపంచ మార్కెట్లలో రిలీజ్ చేసింది. అయితే భారతదేశంలో దీని లాంచ్ గురించి అధికారిక ధృవీకరణ లేదు. ఈ టాబ్లెట్ 11-అంగుళాల LCD స్క్రీన్‌తో వస్తుంది. ఇది TÜV Rheinland నుండి డ్యూయల్ సర్టిఫికేషన్ పొందింది. 9,340mAh బిగ్ బ్యాటరీతో 33W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఈ టాబ్లెట్ MediaTek Helio G100 ప్రాసెసర్‌ అమర్చారు. ఇప్పుడు ఈ టాబ్లెట్ కు సంబంధించి ధర, ఫీచర్ల గురించి పూర్తిగా తెలుసుకుందాం.

- Advertisement -

 

ధర

OnePlus Pad Lite టాబ్లెట్ 6GB + 128GB Wi-Fi మోడల్ ధర 229 యూరోలు (సుమారు రూ. 23,040)గా, 8GB + 128GB LTE మోడల్ ధర 259 యూరోలు (సుమారు రూ. 26,055)గానిర్ణయించారు. ఏరో బ్లూ రంగులో అందుబాటులో ఉన్న ఈ టాబ్లెట్ ప్రస్తుతం UK, ఇతర యూరోపియన్ మార్కెట్లలో లాంచ్ చేసారు.

 

Also read: Boat: బోట్ నుంచి సరికొత్త ఇయర్ బడ్స్.. 80 గంటల బ్యాటరీ లైఫ్, మరెన్నో ఫీచర్లు..

ఫీచర్లు

వన్‌ప్లస్ ప్యాడ్ లైట్ టాబ్లెట్ 11-అంగుళాల HD+ (1,920×1,200 పిక్సెల్స్) 10-బిట్ LCD స్క్రీన్‌ను కలిగి ఉంది. 90Hz రిఫ్రెష్ రేట్, 180Hz టచ్ శాంప్లింగ్ రేట్, 16:10 యాస్పెక్ట్ రేషియో, 500 nits బ్రైట్‌నెస్ లెవల్ అందించారు. ఈ టాబ్లెట్ డిస్ప్లే TÜV రీన్‌ల్యాండ్ నుండి ఫ్లికర్-ఫ్రీ, తక్కువ బ్లూ లైట్ సర్టిఫికేషన్‌ను పొందింది. ఈ టాబ్లెట్ లో MediaTek Helio G100 SoC అమర్చారు. వన్‌ప్లస్ ప్యాడ్ లైట్ 8GB వరకు RAM, 128GB అంతర్గత నిల్వతో వస్తుంది. కాగా, ఈ టాబ్లెట్ Android 15.0.1 ఆధారంగా ఆక్సిజన్ OS 15పై నడుస్తుంది.

కెమెరా గురించి మాట్లాడితే..వన్‌ప్లస్ ప్యాడ్ లైట్ టాబ్లెట్ వెనుక భాగంలో 5-మెగాపిక్సెల్ సెన్సార్, ముందు భాగంలో మరొక 5-మెగాపిక్సెల్ సెన్సార్‌ను కలిగి ఉంది. టాబ్లెట్‌లో హై-రెస్ ఆడియో సర్టిఫికేషన్ పొందిన క్వాడ్ స్పీకర్లు ఉన్నాయి. బ్యాటరీ విషయానికి వస్తే..ఈ టాబ్లెట్ 33W SuperVOOC ఛార్జింగ్‌తో 9,340mAh బ్యాటరీని కలిగి ఉంది. బ్లూటూత్ 5.2 కనెక్టివిటీతో పాటు..SBC, AAC, aptX, aptX HD, LDAC ఆడియో కోడెక్‌లకు కూడా సపోర్ట్ చేస్తుంది. కనెక్టివిటీ పరంగా.. Wi-Fi, LTE, USB టైప్-C పోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. దీని కొలతలు 166.46×254.91×7.39mm. బరువు 530 గ్రాముల.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad