OnePlus Turbo 6 Series Launched: ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ వన్ ప్లస్ చైనా మార్కెట్లో కొత్త టర్బో సిరీస్ ను అధికారికంగా లాంచ్ చేసింది. ఈ సిరీస్ లో వన్‌ప్లస్ టర్బో 6, వన్‌ప్లస్ టర్బో 6V ఉన్నాయి. వన్ ప్లస్ టర్బో 6 స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4 ప్రాసెసర్‌తో శక్తినిస్తుంది. మరోవైపు..వన్ ప్లస్ టర్బో 6V స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 4 చిప్‌సెట్‌తో శక్తినిస్తుంది. డస్ట్ అండ్ రెసిస్టెన్స్ కోసం IP66, IP68, IP69, IP69K రేటింగ్ లను కలిగి ఉన్నాయి. ఈ పరికరాలను కంపెనీ పవర్‌ఫుల్ ప్రాసెసర్, హై రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే, భారీ బ్యాటరీ ముఖ్యంగా, గేమింగ్ యూజర్లను లక్ష్యంగా చేసుకుని రూపొందించింది. ఇప్పుడు ఈ సిరీస్ కు సంబంధించి ధర, లబ్యత, ఫీచర్ల గురించి వివరంగా తెలుసుకుందాం.
వన్‌ప్లస్ టర్బో 6: ధర, ఫీచర్లు
ధర:
వన్ ప్లస్ టర్బో 6 నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంది. అవి
12GB RAM+256GB మోడల్ ధర CNY 2,099 (సుమారు రూ. 27,000)
12GB RAM+512GB మోడల్ ధర CNY 2,399 (సుమారు రూ. 30,000)
16GB RAM+256GB మోడల్ ధర CNY 2,399 (సుమారు రూ. 30,000)
16GB RAM+512GB మోడల్ ధర CNY 2,899 (సుమారు రూ. 37,000)
ఈ స్మార్ట్ ఫోన్ లైట్ చేజర్ సిల్వర్, లోన్ బ్లాక్, వైల్డ్ గ్రీన్ రంగులలో లభిస్తుంది.
ఫీచర్లు:
డిస్ప్లే
వన్ ప్లస్ టర్బో 6 స్మార్ట్ ఫోన్ 6.78-అంగుళాల పూర్తి-హెచ్‌డి+ (1,272 x 2,772 పిక్సెల్‌లు) ఫ్లెక్సిబుల్ ఆమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. దీని పిక్సెల్ డెన్సిటీ 450ppi, రిఫ్రెష్ రేట్ 60Hz, 165Hz మధ్య మారుతుంది. స్క్రీన్ 100 శాతం DCI-P3 కలర్ గామట్, 1800 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 330Hz వరకు టచ్ శాంప్లింగ్ రేటును కలిగి ఉంది.
ప్రాసెసర్, స్టోరేజీ
ఇది అడ్రినో 825 GPUతో స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4 ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందుతుంది. వన్‌ప్లస్ టర్బో 6 16GB వరకు LPDDR4X ర్యామ్, 512GB వరకు UFS 3.1 నిల్వతో వస్తుంది.
సాఫ్ట్ వేర్
డ్యూయల్-సిమ్ (నానో+నానో) వన్‌ప్లస్ టర్బో 6 ఆండ్రాయిడ్ 16-ఆధారిత కలర్‌ఓఎస్ 16పై నడుస్తుంది.
కెమెరా
ఇది f/1.8 అపెర్చూర్, ఆటోఫోకస్‌తో 50-మెగాపిక్సెల్ వైడ్-యాంగిల్ ప్రైమరీ సెన్సార్, 20x డిజిటల్ జూమ్‌తో 2-మెగాపిక్సెల్ మోనోక్రోమ్ కెమెరాను కలిగి ఉన్న డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. కాగా, ముందు కెమెరా 16-మెగాపిక్సెల్.
బ్యాటరీ
బ్యాటరీ పరంగా..వన్ ప్లస్ టర్బో 6 80W SuperVOOC ఛార్జింగ్‌కు మద్దతు ఇచ్చే 9,000mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది.
కనెక్టివిటీ ఫీచర్లు
వన్ ప్లస్ టర్బో 6లోని కనెక్టివిటీ ఎంపికలలో 5G, Wi-Fi 7, బ్లూటూత్, GPS/AGPS, గెలీలియో, GLONASS, Beidou, NFC, USB టైప్-C పోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. సెన్సార్లలో యాక్సిలెరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, కలర్ టెంపరేచర్ సెన్సార్, ఇ-కంపాస్, గైరోస్కోప్, ఇన్‌ఫ్రారెడ్ రిమోట్ కంట్రోల్, ప్రాక్సిమిటీ సెన్సార్ ఉన్నాయి.
కొలతలు
ఫోన్ కొలతలు 162.46×77.45×8.50mm. బరువు సుమారు 217 గ్రాములు.
వన్ ప్లస్ టర్బో 6V: ధర, ఫీచర్లు
ధర
వన్ ప్లస్ టర్బో 6 మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. అవి
8GB RAM + 256GB స్టోరేజ్ మోడల్ ధర CNY 1,699 (సుమారు రూ. 21,000)
12GBRAM + 256GB స్టోరేజ్ మోడల్ ధర CNY 1,899 (సుమారు రూ. 24,000)
12GB RAM +512GB స్టోరేజ్ మోడల్ ధర CNY 2,199 (సుమారు రూ. 28,000)
ఇది ఫియర్‌లెస్ బ్లూ, లోన్ బ్లాక్, నోవా వైట్ రంగులలో లభిస్తుంది.
ఫీచర్లు
వన్ ప్లస్ టర్బో 6Vలో వన్ ప్లస్ టర్బో 6 మోడల్ మాదిరిగానే సిమ్, సాఫ్ట్‌వేర్, డిస్‌ప్లే, IP రేటింగ్ కలిగి ఉన్నాయి. వన్ ప్లస్ టర్బో 6V స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4 చిప్‌సెట్, Adreno 810 GPU ద్వారా శక్తిని పొందుతుంది. ఇది 12GB వరకు LPDDR4X ర్యామ్, 512GB వరకు UFS 3.1 నిల్వతో వస్తుంది. ఇది 6.78-అంగుళాల పూర్తి HD+ (1,272×2,772 పిక్సెల్‌లు) ఫ్లెక్సిబుల్ ఆమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 93.5 శాతం స్క్రీన్-టు-బాడీ నిష్పత్తి, 1,800 నిట్‌ల గరిష్ట ప్రకాశం, 300Hz వరకు టచ్ శాంప్లింగ్ రేటును కలిగి ఉంది.
ఫోటోగ్రఫీ పరంగా..వన్ ప్లస్ టర్బో 6Vలో డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్ ఉంది. ఇందులో 50-మెగాపిక్సెల్ వైడ్-యాంగిల్ ప్రధాన కెమెరా, 2-మెగాపిక్సెల్ మోనోక్రోమ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో చాట్‌ల కోసం..16-మెగాపిక్సెల్ ఫ్రంట్-ఫేసింగ్ కెమెరా ఉంది.
వన్ ప్లస్ టర్బో 6V లోని కనెక్టివిటీ ఎంపికలలో బ్లూటూత్, Wi-Fi 6, USB టైప్-C, NFC వంటి ఫీచర్లను ఉన్నాయి. సెన్సార్లు వన్ ప్లస్ టర్బో 6 వేరియంట్ మాదిరిగానే ఉంటాయి. వన్ ప్లస్ టర్బో 6V 80W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇచ్చే 9,000mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది.

