Monday, February 16, 2026
Homeటెక్నాలజీOppo SmartPhones: 50MP కెమెరాతో ఒప్పో నుంచి రెండు కొత్త 5G ఫోన్లు విడుదల..

Oppo SmartPhones: 50MP కెమెరాతో ఒప్పో నుంచి రెండు కొత్త 5G ఫోన్లు విడుదల..

Oppo A6i+ 5G, Oppo A6v 5G launched: ప్రముఖ స్మార్ట్ ఫోన్ సంస్థ ఒప్పో చైనాలో మార్కెట్లో రెండు కొత్త 5G ఫోన్‌లను విడుదల చేసింది. కంపెనీ వీటిని ఒప్పో A6i+ 5G, ఒప్పో A6v 5G పేరిట పరిచయం చేసింది. ఈ రెండు పరికరాలు 50MP ప్రైమరీ రియర్ కెమెరాను కలిగి ఉన్నాయి. ఒప్పో A6i+ 5G పెద్ద 7000mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. అలాగే, ఒప్పో A6v 5G 6500mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. ఇప్పుడు ఈ ఒప్పో స్మార్ట్‌ఫోన్‌ల ధర, ఫీచర్ల గురించి వివరంగా తెలుసుకుందాం.

- Advertisement -

 

ఒప్పో A6i+ 5G, ఒప్పో A6v 5G- ధర, లభ్యత

ఒప్పో A6i+ 5G రెండు రంగు ఎంపికలు, మూడు స్టోరేజీ వేరియంట్లలో వస్తుంది. కాగా, ఒప్పో A6v 5G మూడు రంగులు, ఒకే స్టోరేజీ వేరియంట్ లో వస్తుంది. ఇప్పుడు ఈ ఫోన్ల వేరియంట్ల వారిగా ధరలు చూస్తే..

ఒప్పో A6i+ 5G స్మార్ట్ ఫోన్ 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర 1,499 యువాన్లు (సుమారు రూ. 20,000)గా, హై-ఎండ్ 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర 1,599 యువాన్లు (సుమారు రూ. 21,000)గా ఉంది. అలాగే 12GB RAM + 512GB స్టోరేజ్ వేరియంట్ ధర 1,799 యువాన్లు (సుమారు రూ. 24,000)గా అందుబాటులో ఉంది. మరోవైపు ఒప్పో A6v 5G స్మార్ట్ ఫోన్ 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర 1,199 యువాన్లు (సుమారు రూ. 16,000)గా ఉంది.

ప్రస్తుతం ఈ రెండు స్మార్ట్ ఫోన్లు ఒప్పో చైనా ఆన్‌లైన్ స్టోర్ ద్వారా ప్రీ-ఆర్డర్ కోసం అందుబాటులో ఉండగా, ఫిబ్రవరి 6 నుండి విక్రయాలు ప్రారంభమవుతాయి.

also read:Fruits For Healthy Skin: హెల్దీ, గ్లోయింగ్ స్కిన్ కావాలా..? మీ డైట్ లో ఈ పండ్లను చేర్చుకోండి..!

ఒప్పో A6i+ 5G, ఒప్పో Oppo A6v 5G- ఫీచర్లు

రెండు ఒప్పో పరికరాలు 6.75-అంగుళాల HD+ LCD స్క్రీన్‌లను కలిగి ఉంటాయి. ఇవి 120Hz వరకు రిఫ్రెష్ రేట్, 256 ppi పిక్సెల్ డెన్సిటీ, 1125 nits వరకు గరిష్ట ప్రకాశాన్ని కూడా అందిస్తాయి. రెండు పరికరాలు 240Hz వరకు టచ్ శాంప్లింగ్ రేటును కూడా అందిస్తాయి. కాగా, రెండు ఫోన్లు మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ద్వారా శక్తిని పొందుతాయి. ఇక ఫోటోగ్రఫీ కోసం..రెండు ఒప్పో A6 సిరీస్ పరికరాలు డ్యూయల్ రియర్ కెమెరాలను కలిగి ఉంటాయి. వీటిలో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2-మెగాపిక్సెల్ మోనోక్రోమ్ కెమెరా ఉన్నాయి. ఇక ఒప్పో A6i+ 5G 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉండగా, మరోవైపు ఒప్పో A6v 5G 5MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. బ్యాటరీ విషయానికి వస్తే..ఒప్పో A6i+ 5G స్మార్ట్ ఫోన్ 7,000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. అలాగే, ఒప్పో A6v 5G 6,500mAh బ్యాటరీతో వస్తుంది. కాగా, రెండు హ్యాండ్‌సెట్‌లు 45W సూపర్‌వూక్ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News