Oppo F27 Pro+ 5G Discount: ప్రస్తుతం అమెజాన్ లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ కొనసాగుతోంది. ఈ సేల్ లో అనేక స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉన్నాయి. బ్రాండెడ్ ఫోన్లపై ఏకంగా వేలల్లో తగ్గింపు లభిస్తోంది. ఈ సేల్ సందర్భంగా ఒప్పో F27ప్రో+ 5G స్మార్ట్ ఫోన్ పై 10,000 రూపాయలకు పైగా భారీ డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఇప్పుడు, ఈ హ్యాండ్‌సెట్ 18,000 రూపాయల కంటే తక్కువ ధరకు అందుబాటులో ఉంది. దీని కంపెనీ ఈ ఫోన్ 8GBRAM+128GB స్టోరేజీ వేరియంట్ రూ.27,999 లాంచ్ చేసింది. ఇప్పుడు ఆఫర్, ఫీచర్ల గురించి వివరంగా తెలుసుకుందాం.
ఆఫర్:
ఒప్పో F27 ప్రో+ 5G స్మార్ట్ ఫోన్ 8GBRAM+128GB స్టోరేజ్ వేరియంట్ రూ.18,699 కు లిస్ట్ అయింది. రూ.9,300 ఫ్లాట్ డిస్కౌంట్ పొందుతుంది. అదనంగా, కస్టమర్లు SBI క్రెడిట్ కార్డ్ EMI లావాదేవీలపై రూ.1,250 బ్యాంక్ డిస్కౌంట్ పొందొచ్చు. దీంతో ఈ ఫోన్ ధర రూ.17,499 కి తగ్గుతుంది. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ రూ.907 నుండి ప్రారంభమయ్యే నో-కాస్ట్ EMIని కూడా అందిస్తోంది. అదనంగా, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లు పాత ఫోన్‌లపై రూ.16,400 వరకు డిస్కౌంట్‌లను పొందొచ్చు.
also read:Acerpure Nitro Gaming TV: ఏసర్ నుంచి అధునాతన ఫీచర్లతో గేమింగ్ స్మార్ట్ టీవీ లాంచ్.. ధర ఎంతంటే..?
ఫీచర్లు:
ఈ పరికరం 120Hz రిఫ్రెష్ రేట్, అల్ట్రా-నారో బెజెల్స్, 93% స్క్రీన్-టు-బాడీ రేషియోతో 6.7-అంగుళాల 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ ARM Cortex-A78, Cortex-A55 కోర్లతో కూడిన మీడియాటెక్ 7050 ప్రాసెసర్ ద్వారా పనిచేస్తుంది. ఇది 8GB RAM+ 256GB వరకు నిల్వతో వస్తుంది. కెమెరా గురించి మాట్లాడితే, ఈ ఫోన్ 64MP ప్రధాన కెమెరా, 2MP డెప్త్ కెమెరా, 8MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది. ఇదికలర్ ఆపరేటింగ్ సిస్టమ్ పై నడుస్తుంది. బ్యాటరీ విషయానికి వస్తే, ఇది 67W SUPERVOOC ఫ్లాష్ ఛార్జ్‌కు మద్దతు ఇచ్చే 5,000mAh బ్యాటరీని కూడా కలిగి ఉంది. ఇది కేవలం 44 నిమిషాల్లో 0 నుండి 100% వరకు, 20 నిమిషాల్లో 56% వరకు ఛార్జ్ అవుతుందని కంపెనీ పేర్కొంది. ఇది IP69 వాటర్-రెసిస్టెంట్ రేటింగ్‌తో వస్తుంది.
నోట్: ఆఫర్లు ప్రతిరోజూ మారవచ్చు. మీరు కొత్త ఆఫర్‌లను ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి. ఆఫర్లకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడూ మారుతుంటాయని గమనించాలి


