Oppo F31 series Launch Date: టెక్ ప్రియులకు గుడ్ న్యూస్. త్వరలో ప్రముఖ ఫోన్ బ్రాండ్ ఒప్పో మార్కెట్లోకి కొత్త సిరీస్ స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేయనున్నది. కంపెనీ ఈ పరికరాలను ఒప్పో F31 సిరీస్ పేరిట తీసుకురానున్నాయి. కాగా, ఈ సిరీస్ స్మార్ట్ ఫోన్స్ మార్చిలో రిలీజ్ అయినా ఒప్పో F29 సిరీస్ మాదిరిగానే ఉంటాయి. ఇప్పటికే ఈ ఫోన్ల ఫీచర్లు ఆన్లైన్ లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ సిరీస్ స్మార్ట్ ఫోన్లు మీడియాటెక్ డైమెన్సిటీ చిప్‌సెట్‌తో రావొచ్చని సమాచారం.
పలు లీక్స్ ప్రకారం..ఒప్పో F31 సిరీస్ స్మార్ట్ ఫోన్లు ఇండియాలో ఈ ఏడాది సెప్టెంబర్ 12-14 మధ్య లాంచ్ అవుతుందని తెలుస్తోంది. రాబోయే లైనప్‌లో ఒప్పోF31, ఒప్పోF31 ప్రో, ఒప్పోF31 ప్రో ప్లస్ అనే మూడు మోడళ్లు ఉండవచ్చు.
అయితే, ఈ పరికరాలు ఒప్పో F31 మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌ను పొందుతుందని సమాచారం. ఇదే సమయంలో ఒప్పో F31 ప్రో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్‌ను పొందవచ్చు. ఇక బ్యాటరీ విషయానికి వస్తే ఈ రెండు ఫోన్‌లు 7000mAh బ్యాటరీతో 80W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తాయి. కెమెరా గురించి మాట్లాడితే, ఒప్పోF31, ఒప్పోF31 ప్రో లలో కెమెరా, చిప్‌సెట్ పరంగా దాదాపు ఒప్పో F29 సిరీస్ స్మార్ట్ ఫోన్లను పోలి ఉంటాయి. కాకపోతే చిన్న మార్పులు మాత్రమే ఉండవచ్చు.
Also Read:Pixel 9 vs Pixel 10: పిక్సెల్ 9 vs పిక్సెల్ 10.. ఏది కొంటె బెటర్ ..?
ఒప్పోF31 సిరీస్ 360-డిగ్రీల ఆర్మర్ బాడీతో తీసుకురాబడుతుందని నివేదించబడింది. డ్రాప్ ప్రొటెక్షన్‌ను మెరుగుపరచడానికి డైమండ్-కట్ కార్నర్‌లు, ఇంపాక్ట్-అబ్జార్బర్ ఎయిర్‌బ్యాగ్‌లతో బలంగా తయారు చేయడానికి ఈ లైనప్‌లో అల్యూమినియం అల్లాయ్ మదర్‌బోర్డ్ కవర్ కూడా అందించారు.
దీనితో పాటు, సిరీస్‌లో నెట్‌వర్క్ పనితీరులో కూడా పెద్ద మార్పులు ఆశించవచ్చు. కంపెనీ ప్రస్తుతానికి వివరాలు వెల్లడించనప్పటికీ ఒప్పో F29 సిరీస్‌లో హంటర్ యాంటెన్నా లేఅవుట్ ఉందనున్నది. ఇది సిగ్నల్ బలాన్ని 300 శాతం వరకు పెంచుతుంది. అంతేకాదు, ఇది నాలుగు-ఛానల్ రిసెప్షన్‌ను కూడా కలిగి ఉంటుంది. ఇక ఈ సిరీస్ స్మార్ట్ ఫోన్ల గురించి పూర్తి వివరాలు తెలియాలంటే లాంచ్ అయ్యే వరకు వేచి చూడాల్సిందే!


