Oppo Find X9 Series Launched: ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో తన కస్టమర్ల కోసం గురువారం అనగా (అక్టోబర్ 16) ఫైండ్ X9 సిరీస్‌ను మార్కెట్లో విడుదల చేసింది. వీటిలో ఒప్పో ఫైండ్ X9 ప్రో, బేస్ ఫైండ్ X9 మోడల్ ఉన్నాయి. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు మీడియాటెక్ డైమెన్సిటీ 9500 ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందుతాయి. అలాగే ఆండ్రాయిడ్ 16-ఆధారిత కలర్ ఓఎస్ 16 పై నడుస్తాయి. ఈ రెండూ పరికరాలు హాసెల్‌బ్లాడ్ కెమెరా మద్దతుతో 50-మెగాపిక్సెల్ Sony LYT 828 ప్రైమరీ సెన్సార్‌ను కలిగి ఉంటాయి. DSLR లాంటి ఫోటోలను తీయగల ఫోన్ కోసం చూస్తున్నట్లయితే ఫైండ్ X9 ప్రో బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఎందుకంటే ఇది 200-మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరాను కలిగి ఉంది. బేస్ మోడల్ 50-మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్‌ను కలిగి ఉంది. ఇప్పుడు ఒప్పో ఫైండ్ X9 ప్రో, బేస్ ఫైండ్ X9 ధర, ఫీచర్ల గురించి వివరంగా తెలుసుకుందాం.
ఒప్పో ఫైండ్ X9 ప్రో, బేస్ ఫైండ్ X9 ధర:
ఒప్పో ఫైండ్ X9 స్మార్ట్ ఫోన్ 12GB+256GB స్టోరేజీ వేరియంట్ ధర CNY 4,399 (సుమారు రూ. 54,300) నుండి ప్రారంభమవుతుంది. అలాగే 16GB+256GB స్టోరేజీ వేరియంట్ ధర CNY 4,699 (సుమారు రూ. 58,000)గా, 12GB+512GB స్టోరేజీ వేరియంట్ ధర CNY 4,999 (సుమారు రూ. 61,700)గా ఉంది. ఇక 16GB+512GB స్టోరేజీ వేరియంట్ ధర CNY 5,299 (సుమారు రూ. 65,400)గా, 16GB+1TB స్టోరేజీ వేరియంట్ ధర CNY 5,799 (సుమారు రూ. 71,600)గా ఉంది.
అదేవిధంగా, ఒప్పో ఫైండ్ X9 ప్రో ధర 12GB+256GB స్టోరేజీ వేరియంట్ ధర CNY 5,299 (సుమారు రూ. 65,400) నుండి ప్రారంభమవుతుంది. అలాగే, 12GB + 512GB స్టోరేజీ వేరియంట్ ధర CNY 5,699 (సుమారు రూ. 70,300)గా, 16GB + 512GB స్టోరేజీ వేరియంట్ CNY 5,999 (సుమారు రూ. 74,100)గా, 16GB + 1TB స్టోరేజీ వేరియంట్ ధర CNY 6,699 (సుమారు రూ. 82,700)గా ఉంది.
also read:iPhone 16e Discount: ఐఫోన్ 16eపై మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్..ఇప్పుడే కోనేయండి!
ఒప్పో ఫైండ్ X9 ప్రో, బేస్ ఫైండ్ X9 ఫీచర్లు:
డిస్ప్లే:
ఒప్పో ఫైండ్ X9 ప్రో స్మార్ట్ ఫోన్ 6.78-అంగుళాల 1.5K (2772×1272 పిక్సెల్స్) LTPO డిస్‌ప్లేను కలిగి ఉంది. అయితే ఫైండ్ X9 6.59-అంగుళాల 1.5K (2760×1256 పిక్సెల్స్) డిస్‌ప్లేను కలిగి ఉంది. రెండూ స్మార్ట్ ఫోన్లు 120Hz రిఫ్రెష్ రేట్, 1800 nits గ్లోబల్ పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉన్నాయి. అయితే పీక్ బ్రైట్‌నెస్ 3600 నిట్స్ కు చేరుకుంటుంది. ProXDR డిస్ప్లేలు HDR వివిడ్, డాల్బీ విజన్, HDR10+ లకు మద్దతు ఇస్తాయి. పూర్తి-స్క్రీన్ ఆల్వేస్-ఆన్ డిస్ప్లే (AOD) ను కూడా కలిగి ఉంటాయి.
ప్రాసెసర్, స్టోరేజీ:
రెండు ఫోన్లు మీడియాటెక్ డైమెన్సిటీ 9500 చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతాయి. 16GB వరకు ర్యామ్, 1TB వరకు అంతర్గత నిల్వతో జత చేశారు. ఇవి ఆండ్రాయిడ్ 16-ఆధారిత కలర్ ఓఎస్ 16 పై నడుస్తాయి. అనేక AI- ఆధారిత ఉత్పాదకత, ఇమేజింగ్ లక్షణాలను కలిగి ఉంటాయి.
కెమెరా:
కెమెరా సెటప్ పరంగా..ఒప్పో ఫైండ్ X9 స్మార్ట్ ఫోన్ 50MP సోనీ LYT-828 ప్రైమరీ సెన్సార్, 50MP సోనీ LYT-600 పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్, 50MP శామ్సంగ్ JN5 అల్ట్రావైడ్ కెమెరాను కలిగి ఉంటుంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 32MP ఫ్రంట్ కెమెరా అందుబాటులో ఉంది. ఇక ఒప్పో ఫైండ్ X9 Pro కూడా అదే ప్రైమరీ, అల్ట్రావైడ్ సెన్సార్లను కలిగి ఉంది. కానీ ఇది 3x డిజిటల్ జూమ్‌కు మద్దతు ఇచ్చే 200MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీల కోసం ఈ పరికరం 50MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది.
బ్యాటరీ, కనెక్టివిటీ ఫీచర్లు:
ఒప్పో ఫైండ్ X9 ప్రో 7,500mAh బ్యాటరీతో పనిచేస్తుంది. అయితే ఫైండ్ X9 7,025mAh బ్యాటరీని కలిగి ఉంది. రెండూ 80W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తాయి. ఈ ఫోన్‌లు వాటర్, డస్ట్ కోసం కోసం IP66, IP68, IP69 రేటింగ్ లను కలిగి ఉన్నాయని కంపెనీ చెబుతోంది. కనెక్టివిటీ కోసం..ఇవి 5G, 4G LTE, Wi-Fi, బ్లూటూత్, GPS, USB టైప్-C పోర్ట్ వంటి ఫీచర్లను కలిగి ఉన్నాయి.


