Saturday, November 15, 2025
Homeటెక్నాలజీOppo K13 Turbo: ఇవాళ్టి నుంచే ఒప్పో K13 టర్బో 5G సేల్..ధర, ఆఫర్లు, ఫీచర్లు...

Oppo K13 Turbo: ఇవాళ్టి నుంచే ఒప్పో K13 టర్బో 5G సేల్..ధర, ఆఫర్లు, ఫీచర్లు ఇలా..

Oppo K13 Turbo Sale: ఒప్పో ఇటీవల తన రెండు మిడ్-రేంజ్ గేమింగ్ స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసిన విషయం తెలిసిందే. అవి ఒప్పో K13 టర్బో 5G, ఒప్పో K13 టర్బో ప్రో 5G. వీటిని కంపెనీ K సిరీస్ కింద ప్రవేశపెట్టింది. ఈ రెండు పరికరాలు ఆగస్టు 11న భారతదేశంలో విడుదల అయ్యాయి. కాగా ఇందులో K13 టర్బో ప్రో 5G ఆగస్టు 15 సేల్స్ కు వచ్చింది. ఇదే సమయంలో ఇప్పుడు ఈ సిరీస్ ప్రామాణిక మోడల్ ఒప్పో K13 టర్బో 5G అమ్మకం కూడా నేటి నుండి ప్రారంభమైంది. ఈ పరికరం ప్రత్యేకత విషయానికి వస్తే, దేశంలో అంతర్నిర్మిత కూలింగ్ ఫ్యాన్ కలిగి ఉన్న మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్ ఇదేనని కంపెనీ పేర్కొంది. ఇప్పుడు ఈ కధనం ద్వారా దీని ధర, ఆఫర్‌లు, స్పెసిఫికేషన్‌లు, ఇతర వివరాల గురించి వివరంగా తెలుసుకుందాం.

- Advertisement -

Oppo K13 Turbo ధర:

ఒప్పో K13 టర్బో 5G 8GB + 128GB స్టోరేజ్ వేరియంట్‌ ధర రూ. 27,999. ఇక 8GB + 256GB RAM స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 29,999గా ఉంది.

Oppo K13 Turbo లభ్యత, ఆఫర్లు:

ఈ ఫోన్‌ను ఈరోజు నుండి ఫ్లిప్‌కార్ట్, ఒప్పో ఇండియా ఇ-స్టోర్, ఆఫ్‌లైన్ స్టోర్‌ల నుండి కొనుగోలు చేయవచ్చు. కంపెనీ సేల్ మొదటి రోజున కొన్ని డిస్కౌంట్ ఆఫర్‌లను కూడా అందిస్తోంది. ఇక్కడ యాక్సిస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, డిబిఎస్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఐడిఎఫ్‌సి,ఫస్ట్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్డులపై రూ. 3,000 తక్షణ డిస్కౌంట్ పొందవచ్చు. ఈ ఆఫర్ తర్వాత ఫోన్ బేస్ వేరియంట్ ధర రూ. 24,999గా, రెండవ వేరియంట్ ధర రూ. 26,999గా అవుతుంది.

Also Read: Honor X7c 5G: హానర్ X7c 5G వచ్చేసింది..తక్కువ ధరకే అదిరిపోయే ఫీచర్లు..

Oppo K13 Turbo ఫీచర్లు:

ఈ పరికరం 6.80-అంగుళాల అమోలేడ్ డిస్‌ప్లేతో వస్తుంది. ఇక్కడ 120Hz వరకు రిఫ్రెష్ రేటు, 240Hz వరకు టచ్ శాంప్లింగ్ రేటు అందుబాటులో ఉంది. అలాగే, ఈ పరికరం 1,600 nits వరకు గరిష్ట ప్రకాశాన్ని పొందుతుంది. ఈ ఫోన్ శక్తివంతమైన మీడియాటెక్ 8450 చిప్‌సెట్‌ను కూడా పొందుతోంది. ఈ పరికరం 8GB వరకు LPDDR5X RAM, 256GB వరకు UFS 3.1 నిల్వను అందిస్తుంది.

ఇక కెమెరా గురించి మాట్లాడితే.. ఈ ఫోన్ వెనుక భాగంలో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను అందించారు. ఇందులో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2-మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా ఉన్నాయి. ఈ పరికరం ముందు భాగంలో సెల్ఫీ ప్రియుల కోసం 16-మెగాపిక్సెల్ కెమెరాను కలిగి ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ 7,000mAh బ్యాటరీతో 80W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా పొందుతుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad