Saturday, November 15, 2025
Homeటెక్నాలజీOppo K13 Turbo Pro 5G: కూలింగ్ ఫ్యాన్, 7000 ఎంఏహెచ్ బ్యాటరీతో ఒప్పో K13...

Oppo K13 Turbo Pro 5G: కూలింగ్ ఫ్యాన్, 7000 ఎంఏహెచ్ బ్యాటరీతో ఒప్పో K13 టర్బో ప్రో 5G.. ఈరోజు నుంచే సేల్స్

Oppo K13 Turbo Pro 5G Sales Start: ఒప్పో ఇటీవల తన మిడ్-రేంజ్ గేమింగ్ స్మార్ట్‌ఫోన్‌లు ఒప్పో K13 టర్బో 5G, ఒప్పో K13 టర్బో ప్రో 5G లను ఇండియాలో విడుదల చేసిన విషయం తెలిసిందే. కంపెనీ వీటిని అధునాతన పనితీరు, గేమింగ్-కేంద్రీకృత లక్షణాలతో తీసుకొచ్చింది. అయితే, కంపెనీ ఇందిలో K13 టర్బో ప్రో 5G స్మార్ట్ ఫోన్ అమ్మకాన్ని ఈరోజు అంటే ఆగస్టు 15 నుండి ప్రారంభించింది. ఈ పరికరం ప్రత్యేకత విషయానికి వస్తే, దేశంలో అంతర్నిర్మిత కూలింగ్ ఫ్యాన్ కలిగి ఉన్న మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్ ఇదేనని కంపెనీ పేర్కొంది. ఇప్పుడు ఈ కధనం ద్వారా దీని ధర, ఆఫర్‌లు, స్పెసిఫికేషన్‌లు, ఇతర వివరాల గురించి వివరంగా తెలుసుకుందాం.

- Advertisement -

Oppo K13 Turbo Pro 5G ధర:

కంపెనీ ఒప్పో K13 టర్బో ప్రో 5G స్మార్ట్ ఫోన్ 8GB RAM+ 256GB స్టోరేజ్ వేరియంట్‌ ధర రూ.37,999గా, 12GB RAM+256GB స్టోరేజ్ వేరియంట్‌ ధర రూ.39,999గా నిర్ణయించింది. కాగా, ఈ పరికరం మూడు రేసింగ్ డిజైన్లు, రంగు ఎంపికలలో అందుబాటులో ఉంటుంది. సిల్వర్ నైట్, పర్పుల్ ఫాంటమ్, మిడ్‌నైట్ మావెరిక్.

Oppo K13 Turbo Pro 5G సేల్స్ ఆఫర్‌:

కొనుగోలుదారులు ఎంపిక చేసిన బ్యాంక్ ఆఫర్‌లు లేదా ఎక్స్ఛేంజ్ బోనస్‌తో దాదాపు రూ. 3,000 వరకు తక్షణ తగ్గింపు పొందొచ్చు. దీని వలన ఈ పరికరం ప్రభావవంతమైన ధర వరుసగా రూ. 34,999, రూ. 36,999కి తగ్గుతుంది. దీనితో పాటు, 9 నెలల నో కాస్ట్ EMI ఎంపిక కూడా అందుబాటులో ఉంది.

Oppo K13 Turbo Pro 5G లభ్యత:

ఫ్లిప్‌కార్ట్ మినిట్స్ ద్వారా అర్హత కలిగిన ఆర్డర్‌ల కోసం ఒప్పో తన ‘టర్బో స్పీడ్’ డోర్‌స్టెప్ డెలివరీ సేవను కూడా అందిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ కాకుండా, కస్టమర్లు ఒప్పో ఇండియా ఇ-స్టోర్ ద్వారా, ఎంపిక చేసిన ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్‌ల ద్వారా ఫోన్‌ను కొనుగోలు చేయొచ్చు.

Also Read: Smart Tv Discounts: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్..కేవలం రూ. 8000 లోపే 32 అంగుళాల స్మార్ట్ టీవీలు..

Oppo K13 Turbo Pro 5G ఫీచర్లు:

ఈ పరికరం 6.8-అంగుళాల LTPS ఫ్లెక్సిబుల్ అమోలేడ్ డిస్‌ప్లేతో వస్తుంది. ఇది 120Hz డైనమిక్ రిఫ్రెష్ రేట్, 1600 నిట్‌ల వరకు గరిష్ట ప్రకాశానికి మద్దతు ఇస్తుంది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8s Gen 4 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. 12GB వరకు RAM, 256GB అంతర్గత నిల్వతో అందుబాటులో తీసుకొచ్చారు. ఈ స్మార్ట్ ఫోన్ ఒప్పో అప్‌గ్రేడ్ చేసిన థర్మల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ను కలిగి ఉంది.

ఇక కెమెరా కోసం.. ఇందులో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ ఉంది. ఇందులో OV50D40 సెన్సార్‌తో 50MP ప్రధాన కెమెరా, 2MP డెప్త్ సెన్సార్ ఉన్నాయి. ఇది సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం 16MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. బ్యాటరీ విషయానికి వస్తే.. ఫోన్‌లో 7000mAh బ్యాటరీ ఉంది. ఇది 80W సూపర్ ఫ్లాష్ ఛార్జ్‌తో ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఇది కలర్ OS 15 (ఆండ్రాయిడ్ 15 ఆధారిత)పై నడుస్తుంది. ఒప్పో 2 సంవత్సరాల OS నవీకరణలు, 3 సంవత్సరాల భద్రతా ప్యాచ్‌లను హామీ ఇచ్చింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad