Sunday, November 16, 2025
Homeటెక్నాలజీOppo K13 Turbo Pro vs Poco F7: ఒప్పో K13 టర్బో ప్రో vs...

Oppo K13 Turbo Pro vs Poco F7: ఒప్పో K13 టర్బో ప్రో vs పోకో F7..గేమింగ్‌కు ఏ స్మార్ట్‌ఫోన్ బెస్ట్..?

Oppo K13 Turbo Pro vs Poco F7 For Gaming: ప్రముఖ ఫోన్ల తయారీ కంపెనీలు వినియోగదారులను దృష్టిలో పెట్టుకొని అనేక కొత్త స్మార్ట్ ఫోన్లను విడుదల చేస్తున్నాయి. తాజాగా ఒప్పో తన తాజా గేమింగ్ స్మార్ట్‌ఫోన్ ఒప్పోK13 టర్బో ప్రోను భారతదేశంలో విడుదల చేసింది. కంపెనీ ఈ ఫోన్‌ను రూ.36999 ప్రారంభ ధరకు పరిచయం చేసింది. అయితే, బ్యాంక్ ఆఫర్‌లతో ఈ ఫోన్‌ను రూ. 35 వేల కంటే తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. అయితే, ఇక్కడ ఇదే ధర రేంజ్ లో మరో అద్భుతమైన గేమింగ్ స్మార్ట్‌ఫోన్ భారతీయ మార్కెట్లో అందుబాటులో ఉంది. అదే పోకో F7. దీని కూడా రూ. 35 వేల శ్రేణిలో కొనుగోలు చేయవచ్చు. ఒకవేళ రూ. 35 వేల ధరలో గేమింగ్ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే, ఈ రెండింట్లో ఏది కొనాలో గందరగోళంగా ఉంటె ఈ కధనం చదవాల్సిందే. ఇప్పుడు ఏ స్మార్ట్‌ఫోన్ ఉత్తమ ఎంపికగా ఉంటుందో ఇక్కడ తెలుసుకుందాం.

- Advertisement -

Oppo K13 Turbo Pro vs Poco F7 డిస్ప్లే:

ఒప్పో K13 టర్బో ప్రో స్మార్ట్‌ఫోన్ 6.8-అంగుళాల LTPS అమోలేడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే గరిష్ట ప్రకాశం 1,600. మరోవైపు, పోకో F7 స్మార్ట్‌ఫోన్ విషయానికొస్తే..ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.83-అంగుళాల 1.5K OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. దీని గరిష్ట ప్రకాశం 3200.

Oppo K13 Turbo Pro vs Poco F7 ప్రాసెసర్:

ఒప్పో, పోకో స్మార్ట్‌ఫోన్‌లు రెండూ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8s Gen 4 ప్రాసెసర్‌ను కలిగి ఉన్నాయి. దీనితో పాటు, రెండు ఫోన్‌లలో LPDDR5x RAM ఉంది. నిల్వ పరంగా పోకో అద్భుతంగా ఉంది. దీనికి UFS 4.1 నిల్వ ఉంది. ఇదే సమయంలో ఒప్పో K13 టర్బో ప్రో UFS 4.0 నిల్వను కలిగి ఉంది.

Oppo K13 Turbo Pro vs Poco F7 కెమెరా:

ఒప్పో K13 టర్బో ప్రో స్మార్ట్‌ఫోన్‌లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. దీని ప్రాథమిక కెమెరా 50MP శామ్‌సంగ్ OV02B1B లెన్స్. దీనికి 2MP డెప్త్ సెన్సార్ ఉంది. ఈ ఒప్పో ఫోన్‌లో 16MP సెల్ఫీ కెమెరా ఉంది. ఇక పోకో F7 స్మార్ట్‌ఫోన్‌లో సోనీ IMX882 50MP ప్రైమరీ కెమెరా ఉంది. ఇది OIS, EIS రెండింటికీ మద్దతు ఇస్తుంది. దీనితో పాటు, దీనికి 8MP అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్ ఉంది. పోకో ఫోన్‌లో 20MP ఫ్రంట్ కెమెరా ఉంది

Also Read: OPPO K13 Turbo Series: కొత్త కూలింగ్ టెక్నాలజీతో ఒప్పో K13 టర్బో సిరీస్ విడుదల..ధరలు, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

Oppo K13 Turbo Pro vs Poco F7 బ్యాటరీ:

ఒప్పో K13 టర్బో ప్రో స్మార్ట్‌ఫోన్‌లో 7000mAh బ్యాటరీ ఉంది. ఇది 80W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. అలాగే, పోకో F7 స్మార్ట్‌ఫోన్ 90W ఛార్జింగ్‌తో 7550mAh బిగ్ బ్యాటరీని కలిగి ఉంది.

Oppo K13 Turbo Pro vs Poco F7 ఇతర ఫీచర్లు:

ఒప్పో నుండి వచ్చిన ఈ తాజా స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారంగా కంపెనీ కస్టమ్ యూజర్ ఇంటర్‌ఫేస్ కలర్ OS 15 పై నడుస్తుంది. ఈ ఫోన్‌కు 2 సంవత్సరాల పాటు సాఫ్ట్‌వేర్ నవీకరణలు, మూడు సంవత్సరాల పాటు భద్రతా నవీకరణలు లభిస్తాయని కంపెనీ చెబుతోంది. మరోవైపు పోకో F7 స్మార్ట్‌ఫోన్ Xiaomi హైపర్ OS 2 పై నడుస్తుంది. ఈ ఫోన్‌కు 4 సాఫ్ట్‌వేర్ నవీకరణలు, 6 సంవత్సరాల పాటు భద్రతా నవీకరణలు లభిస్తాయి.

Oppo K13 Turbo Pro vs Poco F7 ధర:

ఒప్పో K13 టర్బో ప్రో స్మార్ట్‌ఫోన్ 12GB ర్యామ్+256GB నిల్వ మోడల్ రూ. 39,999 ధరకు అందుబాటులో ఉంది. మొదటి సేల్‌లో ఈ ఫోన్‌పై రూ. 3 వేల తగ్గింపు లభిస్తోంది. అంటే దీనిని రూ. 36999 ధరకు కొనుగోలు చేయవచ్చు. ఇక పోకో ఎఫ్7 స్మార్ట్‌ఫోన్ 12 జిబి ర్యామ్+ 256 జిబి స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 31,999గా ఉంది. బ్యాంక్ డిస్కౌంట్‌తో ఈ ఫోన్‌ను రూ. 30 వేల వరకు కొనుగోలు చేయవచ్చు.

రూ.35 వేల బడ్జెట్లో ఏ ఫోన్ కొంటె బెస్ట్?

ఒప్పో కె13 టర్బో ప్రో, పోకో ఎఫ్7 స్మార్ట్‌ఫోన్‌ల స్పెసిఫికేషన్లు దాదాపు ఒకే విధంగా ఉన్నాయి. అయితే, పోకో స్మార్ట్‌ఫోన్ ధర ఒప్పో కంటే కొంచెం తక్కువగా ఉంది. ఇది అద్భుతమైన స్పెసిఫికేషన్‌లను అందిస్తుంది. పోకో ఫోన్‌లో అల్ట్రా-వైడ్ కెమెరా, సోనీ ప్రైమరీ కెమెరా లెన్స్ ఉన్నాయి. దీనితో పాటు, మరిన్ని సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లు, దీర్ఘకాలిక సెక్యూరిటీ ప్యాచ్ అప్‌డేట్‌లు అందుబాటులో ఉన్నాయి. మరోవైపు, ఒప్పో ఫోన్ గేమింగ్ స్మార్ట్‌ఫోన్ కూలింగ్ కోసం అధునాతన ఫ్యాన్ సిస్టమ్‌ను కలిగి ఉంది. ఫోన్ డిజైన్ మరింత మెరుగుపరచడానికి, LED లైటింగ్ కూడా ఇందులో అందుబాటులో ఉంది. ఇది దీనికి ప్రీమియం లుక్ అందిస్తుంది.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad