Oppo K13 Turbo Series Launched: ఒప్పో తన మొట్టమొదటి టర్బో బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది. కంపెనీ Oppo K13 Turbo, K13 Turbo Pro ఫోన్లను చైనాలో విడుదల చేసింది. ఈ రెండు పరికరాలు శక్తివంతమైన ప్రాసెసర్, బిగ్ 7000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, ఇన్-బిల్ట్ RGB కూలింగ్ ఫ్యాన్ వంటి అద్భుతమైన ఫీచర్లతో వస్తున్నాయి. ఇప్పుడు టర్బో సిరీస్ స్మార్ట్ ఫోన్లకు సంబంధించి ధర, ఫీచర్ల గురించి వివరంగా తెలుసుకుందాం.
Oppo K13 టర్బో సిరీస్ ధరలు:
Oppo K13 టర్బో వేరియంట్‌లు
12GB + 256GB – 1799 యువాన్ (సుమారు ₹20,800)
16GB + 256GB – 1999 యువాన్ (సుమారు ₹23,100)
12GB + 512GB – 2299 యువాన్ (సుమారు ₹26,600)
K13 టర్బో ప్రో వేరియంట్‌లు
12GB + 256GB – 1999 యువాన్ (సుమారు ₹23,100)
16GB + 256GB – 2199 యువాన్ (సుమారు ₹25,400)
12GB + 512GB – 2399 యువాన్ (సుమారు ₹2 ₹27,700)
16GB + 512GB – 2699 యువాన్ (సుమారు ₹31,200)
Oppo K13 టర్బో సిరీస్ రంగుల ఎంపికలు:
K13 టర్బో: ఫస్ట్ పర్పుల్, బ్లాక్ సమురాయ్, నైట్ వైట్
K13 టర్బో ప్రో: ఫస్ట్ పర్పుల్, బ్లాక్ సమురాయ్, నైట్ సిల్వర్
Also Read: Motorola New Phone: మార్కెట్లోకి ట్రిపుల్ కెమెరా సెటప్‌తో మోటోరోలా కొత్త ఫోన్.. టీజర్ లాంచ్..
Oppo K13 Turbo, K13 Turbo Pro ఫీచర్లు:
కంపెనీ ఈ ఫోన్‌లలో 2800 x 1280 పిక్సెల్ రిజల్యూషన్‌తో 6.8-అంగుళాల 1.5K OLED డిస్‌ప్లేను కంపెనీ అందిస్తోంది. ఈ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇస్తుంది. K13 Turbo 16GB వరకు LPDDR5x RAM, 512GB వరకు UFS 3.1 టర్బో స్టోరేజ్‌తో వస్తుంది. ఇదే సమయంలో K13 Turbo Pro 16GB వరకు LPDDR5x RAM, 512GB వరకు UFS 4.0 స్టోరేజ్ ఆప్షన్‌తో వస్తుంది.
ప్రాసెసర్ గురించి మాట్లాడితే..కంపెనీ K13 Turboలో డైమెన్సిటీ 8450ని అందిస్తోంది. K13 Turbo Pro గురించి మాట్లాడితే..ఇది స్నాప్‌డ్రాగన్ 8s Gen 4తో అమర్చబడి ఉంటుంది. ఇక ఫోటోగ్రఫీ కోసం..కంపెనీ ఈ ఫోన్‌లలో 50-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాను అందిస్తోంది. దీనితో పాటు, 2-మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా వాటిలో చేర్చారు. సెల్ఫీల కోసం..ఒప్పో ఈ కొత్త ఫోన్‌లు 16-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందిస్తున్నాయి.
ఫోన్‌లకు శక్తినివ్వడానికి 7000mAh బిగ్ బ్యాటరీని అందించారు. ఈ బ్యాటరీ 80W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. భద్రత కోసం.. కంపెనీ ఫోన్‌లో ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెల్‌ను అందిస్తోంది. OS గురించి మాట్లాడితే..ఈ ఫోన్‌లు Android 15 ఆధారంగా కలర్ OS 15పై పనిచేస్తాయి. కనెక్టివిటీ పరంగా..5G, డ్యూయల్ 4G VoLTE, Wi-Fi 6 802.11 ax (2.4GHz + 5GHz), బ్లూటూత్ 5.4, GPS, USB టైప్-C, NFC వంటి ఫీచర్లు ఉన్నాయి.


