OPPO K13 Turbo Series Launched: ఒప్పో చివరకు ఇండియాలో K13 టర్బో సిరీస్‌ను విడుదల చేసింది. ఈ సిరీస్ కింద కంపెనీ రెండు కొత్త గేమింగ్ స్మార్ట్‌ఫోన్‌లను ప్రవేశపెట్టింది. కంపెనీ ఈ రెండు స్మార్ట్ ఫోన్లను K13 టర్బో సిరీస్ కింద..ఒప్పో K13 టర్బో ప్రో, K13 టర్బో పేరిట మార్కెట్లోకి తీసుకొచ్చింది. అద్భుతమైన ఫీచర్లతో వస్తున్న ఈ రెండు పరికరాలు 7000 mAh బ్యాటరీతో ప్రత్యేకమైన VC కూలింగ్ యూనిట్‌ను కలిగి ఉన్నాయి. ఇపుడు ఒప్పో K13 టర్బో ప్రో, K13 టర్బో స్మార్ట్ ఫోన్లకు సంబంధించి ధర, ఫీచర్ల వివరాలు తెలుసుకుందాం.
Oppo K13 Turbo Pro ధర, ఫీచర్లు:
కంపెనీ ఈ పరికరం 8GB ర్యామ్+ 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.37,999గా పేర్కొంది. ఈ ఫోన్ టాప్ వేరియంట్ 12GB ర్యామ్+ 256 GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 39,999గా నిర్ణయించారు. కాగా, ప్రో వేరియంట్ అమ్మకం ఆగస్టు 15న ప్రారంభమవుతుంది.
ఇక ఫీచర్ల విషయానికి వస్తే.. ఈ స్మార్ట్‌ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.8-అంగుళాల LTPS అమోలేడ్ ప్యానెల్‌ను కలిగి ఉంటుంది. ఈ ఒప్పో ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 4 ప్రాసెసర్‌తో వస్తుంది. ఇది 12GB వరకు LPDDR5x RAM, 256GB వరకు UFS 4.0 స్టోరేజ్ ఉంటుంది. ఈ ఫోన్ 7000mAh బ్యాటరీతో 80W ఫాస్ట్ ఛార్జింగ్‌తో వస్తుంది. ఈ పరికరం ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారంగా కలర్ ఓఎస్ 15 పై నడుస్తుంది. కెమెరా విషయానికి వస్తే..50MP ప్రైమరీ కెమెరా ఉంది. దీనికి 2MP డెప్త్ సెన్సార్ ఇచ్చారు. దీనితో పాటు, ఈ ఒప్పో ఫోన్‌లో సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం 16MP ఫ్రంట్ కెమెరా ఉంది. కనెక్టివిటీ ఎంపికలలో 5G, 4G, Wi-Fi 7, బ్లూటూత్ 5.4, GPS, NFC, USB టైప్ C పోర్ట్ ఉన్నాయి.
Also Read: Lava Blaze AMOLED 2 5G: 50MP కెమెరా, 5,000mAh బ్యాటరీతో లావా సరికొత్త ఫోన్.. ధరెంతో తెలుసా?
Oppo K13 Turbo ధర, ఫీచర్లు:
ఒప్పో K13 టర్బో స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్+128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 27,999గా పేర్కొంది. ఈ ఫోన్ రెండవ వేరియంట్ 8GB ర్యామ్+ 256 GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 30000గా నిర్ణయించారు. అయితే, మొదటి సేల్‌లో టాప్ వేరియంట్‌ను రూ.27999 ప్రారంభ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ అమ్మకం ఆగస్టు 18న ప్రారంభమవుతుంది.
ఇక ఫీచర్ల విషయానికి వస్తే..ఈ స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా ప్రో వేరియంట్ మాదిరిగానే ఉంటాయి. ఈ ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 8450 చిప్‌సెట్ ఉంది. దీనితో పాటు, ఫోన్‌లో బిల్ట్-ఇన్ ఫ్యాన్ వస్తుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారంగా కలర్ ఓఎస్ 15 పై చేస్తుంది. ఇది దుమ్ము, నీటి నుండి రక్షణ కోసం IP / X9 రేటింగ్‌తో అమర్చబడి ఉంటుంది. కనెక్టివిటీ ఎంపికలలో 5G, 4G, Wi-Fi 7, బ్లూటూత్ 5.4, GPS, NFC, USB టైప్ C పోర్ట్ ఉన్నాయి.


